breaking news
Land resurvey
-
Jupudi: దౌర్భాగ్యమైన నాయకుల పాలనలో ఉన్నాం
-
వైఎస్ జగన్ సంస్కరణలపై కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసలు
-
ఆంధ్రప్రదేశ్‌లో రీ సర్వే సూపర్. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ, మార్కెట్ సంస్కరణలు భేష్ అని పొగిడిన కేంద్ర ఆర్థిక సర్వే
-
కేంద్ర ఆర్థిక ‘సర్వే’ సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం.. 'రీ సర్వే' సూపర్
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా.. పార్లమెంట్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోసారి రుజువైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన భూ సంస్కరణలపై బురద చల్లుతూ చంద్రబాబు ఆడిన కపట నాటకం బట్టబయలైంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ.. ఆంగ్లేయుల తరువాత వందేళ్ల అనంతరం దేశంలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే యజ్ఞం ఫలితాలను తాజాగా కేంద్ర ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన కీలక మార్పులు, ప్రతి అడుగులో రైతన్నలకు తోడుగా నిలిచిన ఆర్బీకేలు, విప్లవాత్మక రీతిలో అమలు చేసిన భూ సంస్కరణలను అభినందించింది. వైఎస్ జగన్ హయాంలో నిర్వహించిన భూ రీ సర్వే ఫలితాలను వివరిస్తూ కేంద్ర ఆర్థిక సర్వే(2025–26)లో పేర్కొన్న భాగం ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అమలు చేసిన సమగ్ర భూ సర్వే ఫలాలను సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాల్లో ఎలా వేసుకున్నారో దేశానికి చాటి చెప్పింది. మాజీ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన భూ సంస్కరణలు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేసి పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా తెచ్చిన ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ విధానాలకు కేంద్రం కితాబిచ్చింది. ఇక వ్యాపార వాతావరణ అనుకూల విధానాల్లో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పారిశ్రామిక అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేసిందని, 2023–24లో మహిళల నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది. ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ఆర్థిక సర్వే నివేదిక 2025–26 ప్రవేశపెట్టారు. ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిళ్లుభూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో భూముల రీ సర్వే ప్రాజెక్టును ప్రారంభించిందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. రీ సర్వేకు డ్రోన్ టెక్నాలజీని వినియోగించడంతో పాటు కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్లు (సీవోఆర్‌ఎస్), జీఐఎస్ సాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిళ్లను జారీ చేసినట్లు ఆర్థిక సర్వే ప్రధానంగా ప్రస్తావించింది. సమగ్ర భూ సర్వేలో భాగంగా 6,901 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారని, 81 లక్షల భూ కమతాలను రీ సర్వే చేశారని వెల్లడించింది. తద్వారా సుమారు 86,000 సరిహద్దు వివాదాలను పరిష్కారమయ్యాయని స్పష్టం చేసింది. దాదాపు 15 వేల మంది సర్వేయర్లను నియమించి రైతులకు పైసా ఖర్చు లేకుండా భూముల సమగ్ర సర్వేను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టడం తెలిసిందే. సచివాలయాల సిబ్బంది పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వే ద్వారా తొలిసారిగా డ్రోన్లు, రోవర్లు, విమానాలను వినియోగించి సర్వే చేశారు. భూములకు జియో హద్దులు నిర్ణయించి పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్లు ముద్రించారు. ట్యాంపరింగ్‌కు వీలులేని విధానాల ద్వారా భూ రికార్డుల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. సర్వే రాళ్లు విలక్షణంగా ఉంటేనే అందరికీ తెలుస్తుందనే ఉద్ధేశంతో 1.25 కోట్ల సర్వే రాళ్లను పాతించారు. అంతేకాదు.. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవలను సచివాలయాల్లోనే పొందే సౌలభ్యం కల్పించారు. నిర్విరామంగా ఒక మహాయజ్ఞంలా జరిగిన రీ సర్వే కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా కూడా పాలుపంచుకుంది. కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలు రీ సర్వే మోడల్‌పై అధ్యయనం చేసి టెక్నాలజీ సాయం కోరాయి. ఆర్బీకేలతో పంటలకు మెరుగైన ధరలురైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మెరుగైన ధరలు కల్పించే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన రైతు భరోసా కేంద్రాలు, ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను కళ్లాల నుంచే నేరుగా తమకు నచ్చిన ధరకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ వైఎస్సార్ సీపీ హయాంలో ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేస్తూ, మన పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా దీన్ని తెచ్చింది. మండీలకు ప్రత్యామ్నాయంగా రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రాసెసర్లను అనుసంధానిస్తూ దేశంలో తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు వ్యాపారులు పోటీపడి ముందుకొచ్చారు. వీరిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కూడా ఉండటం గమనార్హం.ఈ– ఫార్మర్ మార్కెట్‌తో ప్రయోజనాలెన్నో..⇒ దళారీల ప్రమేయం ఉండదు. ఎలాంటి ఫీజులు, రుసుములు లేకుండా కళ్లాల నుంచే అమ్ముకోవచ్చు.⇒ ఉత్పత్తి లభ్యత, పంట వివరాలు, నాణ్యత వివరాలను ఎలక్ట్రానిక్ పోర్టల్‌లో నమోదు చేస్తే ఇదే పోర్టల్‌లో వ్యాపారులు నేరుగా రైతులతో సంప్రదించి కొనుగోలు చేస్తారు. నగదు రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు.పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులుబిజినెస్ రీఫార్మ్ యాక్షన్ ప్లాన్ (బీఆర్ఎపీ) 2024 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు, ఆన్లైన్లో భూమి రిజిస్ట్రేషన్, పర్యావరణ అనుమతులు జారీ చేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించినట్లు కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది.తయారీ రంగంలో మహిళా యాజమాన్య సంస్థల సత్తాదేశంలో మహిళా యాజమాన్యంలోని సంస్థల వాటా పెరుగుతోందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. 2021 – 2022లో 24.2 శాతం ఉండగా 2023 – 24లో 26.2 శాతానికి పెరిగినట్లు తెలిపింది. 2023–24లో మహిళా యాజమాన్యంలోని సంస్థలకు సంబంధించి తయారీ రంగంలో వాటా అత్యధికంగా 58.4 శాతం ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ అత్యధిక వాటా కలిగిన రాష్ట్రాల్లో నిలిచింది.⇒ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కృషి చేసినట్లు కేంద్ర ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ⇒ కోవిడ్ మహమ్మారి తరువాత విదేశీ విద్యార్ధులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, 2023 గణాంకాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది. -
‘వెలిగొండ’నూ కొట్టేద్దాం!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్నారు. విశాఖలో డేటా సెంటర్, భూముల సమగ్ర రీ సర్వే, గత ప్రభుత్వం చేపట్టిన ఇతరత్రా కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకోవడానికి పాట్లు పడుతున్న ఆయన చూపు తాజాగా ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రికార్డు సమయంలో రెండు టన్నెల్స్ పనులన్నీ పూర్తయినప్పటికీ, నల్లమలసాగర్‌కు నీటిని తరలించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు గత ప్రభుత్వం కృషినంతటినీ తన ఘనతగా చెప్పుకునేందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో సీఎం చంద్రబాబు వెలిగొండ సందర్శించి.. పూర్తయిన పనులన్నీ తన ఘనతేనని చాటుకునేందుకు సిద్ధమైపోయారు. వాస్తవానికి దశాబ్దాల స్వప్నం వెలిగొండ సాకారమైందని.. శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్‌కు చేరడంతో తమ కష్టాలు కడతేరుతాయనుకున్న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల ప్రజల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం అడియాశలు చేసింది. ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను (ఆసియాలోనే అతి పొడవైనవి) రికార్డు సమయంలో నాటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించి, రూ.992 కోట్లు వ్యయం చేసి, పునరావాసం కల్పించి 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. కేవలం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితోనే నల్లమలసాగర్ నిర్వాసిత కుటుంబాలకు 20 నెలలుగా పునరావాసం కల్పించకుండా చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తోందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై ఆది నుంచి సీఎం చంద్రబాబుకు ఉన్న కపట ప్రేమ మరోసారి నిరూపితమైందని ఎత్తిచూపుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2024–25లో 1,439 టీఎంసీలు, 2025–26లో 1,936.79 టీఎంసీల ప్రవాహం వచ్చి.. ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024–25లో 848.96 టీఎంసీలు, 2025–26లో 1,652.12 టీఎంసీలు కలిశాయని ఎత్తి చూపుతున్నారు. టీడీపీ హయాంలో నాసిరకంగా పనులు వైఎస్సార్సీపీ సర్కార్ తయారు చేసిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2025 ఖరీఫ్ సీజన్లో కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఒడిసిపట్టి.. నల్లమలసాగర్‌కు తరలించి ఉంటే తమ ప్రాంతాలు సుభిక్షం అయ్యేవని రైతులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2025లో కురిసిన భారీ వర్షాలకు టీడీపీ సర్కార్ పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్ చానల్ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్ వాల్, మిగతా ప్రాంతాల్లో కాంక్రీట్ లైనింగ్ చేసే పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. వాటిని అస్మదీయ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం గమనార్హం. వెలిగొండ టన్నెల్స్ నుంచి నల్లమలసాగర్‌కు నీటిని తరలించే కాలువ చంద్రబాబు సర్కార్ దోపిడీని కడిగేసిన కాగ్ ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలు మాత్రమే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు ఎత్తి చూపుతున్నారు. విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా, పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించక పోవడమే చంద్రబాబు సర్కార్ చేసిన దోపిడీకి నిదర్శనం. జీవో–22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింç³#)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతు చేయకపోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం. 2017, 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు. వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు దోచేయడాన్ని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగి పారేసింది. ఇంజినీరింగ్ అద్భుతం.. నల్లమలసాగర్ ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల(గ్యాప్)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తుతో సుంకేశుల డ్యామ్.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తుతో గొట్టిపడియ డ్యామ్.. 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తుతో కాకర్ల డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజ సిద్ధంగా రూపు దిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగు నీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపున ఉన్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవి్వ.. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీల పొడవున తవి్వన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతి పెద్ద నీటి పారుదల సొరంగాలు కావడం గమనార్హం. -
Perni Nani: జగన్ ట్రెండ్ సెట్టర్.. మీరు ఫాలోవర్స్..
-
ఏపీలో సమగ్ర భూ రీసర్వేపై నాడు దుష్ప్రచారం చేసి, నేడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.... సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
భూ సర్వేపై జగన్ కు జై కొట్టిన బాబు
-
జగన్ భూసర్వేపై అప్పుడు విషం చల్లారు.. ఇప్పుడు అదే దిక్కయ్యింది..
-
నాడు దుష్ప్రచారం.. నేడు క్రెడిట్ చోరీ
సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన మా నాన్నకు సమకాలికుడు. ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీ పడలేకపోతున్నారు. నేను చేసిన దానిపై క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. ప్రజలను నమ్మించేందుకు ఒక అబద్ధాన్ని ఈ స్థాయిలో గోబెల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాటమాడటం న్యాయమేనా? చంద్రబాబు ఒకసారి తన గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలని కోరుతున్నా. రీ సర్వే ప్రక్రియ చేపట్టడానికి అత్యున్నత కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియాతో 2020 డిసెంబర్ 9న ఒప్పందం చేసుకున్నాం. యూరప్, అమెరికాలో వాడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రీ సర్వేలో వినియోగించాం. రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా సీవోఆర్ఎస్లు (కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్) పెట్టాం. లక్ష్యాన్ని చేరుకోవడానికి 3,640 గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ రిసీవర్స్ అందుబాటులోకి తెచ్చాం. కచ్చితత్వం కోసం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను వాడిన ప్రభుత్వం మాది.సమగ్ర రీ సర్వే కోసం రెండు విమానాలు, నాలుగు హెలికాప్టర్లు, 200కు పైగా హైఎండ్ డ్రోన్స్‌ను తొలిసారిగా వినియోగించాం. దీని మీద అవగాహన కోసం సచివాలయాల్లోని 40 వేల మంది సిబ్బందికి 70 సార్లు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. ఇదెప్పుడూ గతంలో జరగలేదు. ఇంత గొప్ప యజ్ఞం చేశాము కాబట్టే 5 సెంటీమీటర్లు కూడా తేడా లేకుండా కొలతలు వేశాం. అందుకే దీన్ని మహా యజ్ఞం అంటున్నాం.చంద్రబాబు అనే వ్యక్తికి చిత్తశుద్ధి, బాధ్యత ఉండదు. ఎవరైనా చేస్తే ఆ క్రెడిట్ కొట్టేయడానికి మాత్రం ప్రయత్నిస్తాడు. సాధారణంగా ఆయనకు అవగాహన తక్కువ. సర్వే మీద కూడా అవగాహన తక్కువే. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఇలాంటి సర్వే చేయాలని తపన, తాపత్రయ పడలేదు. సర్వే రాళ్లు లేకుండా సర్వే ఎలా పూర్తవుతుంది? కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించారని బుద్ధి, అవగాహన, జ్ఞానం లేకుండా మాట్లాడారు. రైతు, భూ యజమానికి సరిహద్దులు తెలిసేలా రాళ్లను పాతితేనే సర్వే పూర్తయినట్లు. ఆ భూమిలో సర్వే అయినట్టు ప్రత్యేక (డిస్టింక్ట్) రాయి ఉండాలి. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి.. ఇదే సర్వే రాయి అంటే సరిహద్దులు ఎలా ఉంటాయి? అలా చేస్తే కథ మళ్లీ మొదటికి రాదా? అందుకే ప్రత్యేక (డిస్టింక్ట్) తరహాలో సర్వే రాళ్లను ఉచితంగా ప్రభుత్వం రైతులకు సరఫరా చేసింది. ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు ృ భూ రక్ష పేరు పెట్టాం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో 1923లో బ్రిటీష్ వాళ్లు పెట్టిన రాళ్లు కనిపిస్తాయి. (బ్రిటీష్ హయాంలో పెట్టిన సర్వే రాళ్లు చూపించారు) చంద్రబాబు ఏమో రాళ్లెందుకు అంటాడు. మేం సంకల్పంతో పని చేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలు రైతులు, భూ యజమానులకు అందకూడదని, జగన్‌కు మంచి పేరు వస్తుందని రాక్షసులకన్నా దారుణంగా చంద్రబాబు, ఆయన ఎల్లో గ్యాంగ్ వ్యవహరించారు. యజ్ఞం భగ్నం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రధాన రాక్షసుడు.. ఆయన లెఫ్ట్, రైట్లో ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి పిల్ల రాక్షసుల పాత్ర పోషించారు. మీ భూమి మీది కాదు.. కాళ్ల కింది నేల కదిలిపోతోంది! అంటూ అబద్ధాలు, వక్రీకరణలు చేశారు. 2024 మే 13న పోలింగ్ అయితే మే 10వ తేదీన ఈనాడులో ‘మీ భూమి మీకు కాకుండా పోతుంది’ అంటూ ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఢిల్లీలోని గుర్గావ్ నుంచి లక్షలాదిగా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించారు. వైఎస్సార్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుందని విషపూరిత, తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ చర్యలతో చంద్రబాబు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొంది ఉండొచ్చు. కానీ, అబద్ధాలు ఎంతో కాలం దాగవు. నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. భూముల సర్వే విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా భూ యజమానులు, రైతులకు జరిగే మేలు భూములు ఉన్నంత వరకూ నిలిచిపోతాయి. రీ సర్వేలో ఏపీ ప్లాటినమ్ గ్రేడింగ్ సాధించిందని డిసెంబర్ 2023లో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రూ.400 కోట్లు ఎప్పుడు వచ్చాయో తెలుసా? 2025 ఫిబ్రవరి 19న వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన పనికి కేంద్రం ఈ డబ్బులు ఇచ్చిందని క్రెడిట్ చోరీకి పాట్లు పడుతున్నారు. మాకు నాలుగేళ్లు సమయం పడితే.. చంద్రబాబు ఆరు నెలల్లో చేసిన పనికి ప్లాటినమ్ గ్రేడింగ్ ఇచ్చారట! మరి ఎన్నికల ముందు వరకు ఆయన చేసిన ఆరోపణలు ఏమైపోవాలి? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మహోన్నత సంకల్పంతో మేం సమగ్ర భూ రీసర్వే మహా యజ్ఞాన్ని చేపడితే వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాక్షసుడిలా విషం చిమ్మి.. ఇప్పుడు ఆ రీసర్వే నీ ఘనతే అంటూ క్రెడిట్ చోరీకి పాల్పడతావా? అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. భూ మండలంలో అత్యంత దారుణంగా క్రెడిట్ చోరీకి పాల్పడే వారు నిన్ను మించి ఎవరైనా ఉంటారా.. నిన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర భూ రీ సర్వేపై చంద్రబాబు చెబుతున్న అబద్ధాల వెనుక దాగిన నిజాలను సాక్ష్యాధారాలతో వివరించారు. ‘‘జగనన్న భూ హక్కు – భూరక్ష’’ పథకం అమలు తీరును ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాటినమ్ గ్రేడింగ్ ఇవ్వడాన్ని.. ఈ సర్వే దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందంటూ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ స్పష్టం చేయడాన్ని, వివిధ రాష్ట్రాలు భూ సర్వేను ప్రశంసిస్తూ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని ఉద్ఘాటించడాన్ని, నీతి ఆయోగ్ అత్యంత పారదర్శకంగా కచ్చితత్వంతో భూ రీ సర్వే చేశారంటూ కితాబు ఇచ్చిన అంశాలను సాక్ష్యాధారాలతో గుర్తు చేశారు. అప్పట్లో ఈ మహాయజ్ఞంపై ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు చిమ్మిన విషాన్ని.. నాడు చేసిన భూసర్వేను ప్రశంసిస్తూ కేంద్రం రూ.400 కోట్లు రాయితీ ఇస్తే అది తన ఘనతేనని చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏనాడైనా రీసర్వే ఆలోచనైనా చేశావా? ఈ మధ్య కాలంలో భూముల రీ సర్వేపై చంద్రబాబు మాటలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రీ సర్వే క్రెడిట్ అంతా తనదేనంటూ చెబుతున్న మాటలు వింటుంటే.. ఈ భూ మండలం మీద ఇంత దారుణంగా క్రెడిట్ చోరీ చేసే వ్యక్తి ఇంకొకరు ఎవరైనా ఉంటారా.. అనిపిస్తోంది. చివరకు ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి బహుశా సిగ్గు పడుతుందేమో! అంతటి దారుణమైన మోసాలు.. అబద్ధాలు. నాలుగుసార్లు సీఎం అని చెప్పే చంద్రబాబుకు భూములు రీ సర్వే చేయాలనే కనీస ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని ఏనాడైనా తపన పడ్డావా? ఈ రోజు క్రెడిట్ చోరీ చేస్తూ మాట్లాడుతున్న మాటలకు నిజంగా ఈ పెద్దమనిషి సిగ్గుపడాలి. 6,800 గ్రామాల్లో అన్ని రకాల సర్వే పూర్తి మా ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద వ్యవస్థను సృష్టించి, డ్రోన్ సర్వే కూడా పూర్తి చేశాం. ఆర్థోరెక్టిఫైడ్ రాడార్ ఇమేజెస్ (ఓఆర్ఐ) అన్ని జిల్లాలకు పంపేశాం. ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో అన్ని రకాల సర్వే పూర్తి చేసేశాం. రైతుల భూ సరిహద్దులను ఖరారు చేశాం. సర్వే రాళ్లను పాతడం పూర్తయింది. ఈ గ్రామాల్లో రికార్డులన్నింటినీ అప్డేట్ చేసి, సబ్ డివిజన్స్, మ్యుటేషన్లు పూర్తి చేసి, ప్రతి భూ కమతాకు విశిష్ట నంబర్ (యూనిక్ నంబర్) ఇచ్చాం. భూ కమతా మ్యాప్‌ను కూడా జియో ట్యాగింగ్ చేసి, పాస్‌బుక్‌లో పొందుపరిచి, 30 లక్షల మంది రైతుల సమస్యలు మొబైల్ మెజిస్ట్రేట్లతో పరిష్కరించాం. వివాదాలు లేని విధంగా క్యూ ఆర్ కోడ్‌తో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఈ క్యూ ఆర్ కోడ్ ప్రజలు స్కాన్ చేస్తే మొత్తం భూమి, యజమాని వివరాలు కనిపిస్తాయి. మీ భూమి పోర్టల్ అప్‌గ్రెడేషన్ పూర్తి చేశాం. జియో ట్యాగింగ్ చేసిన క్రమంలో అక్షాంశాలు, రేఖాంశాలతో సహా మొత్తం భూమి వివరాలు వచ్చేస్తాయి. రియల్ టైమ్ అలర్ట్‌లతో.. మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేసి, భూ రికార్డులపై ఆటోమేటిక్‌గా మీకు అలర్ట్‌లు వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చాం. దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న పథకం ఇది. ఇందులో 40 వేల మంది ఉద్యోగుల నాలుగేళ్ల శ్రమ, కష్టం ఉంది. అందుకే ఈ పథకానికి ‘జగనన్న భూ హక్కు – భూరక్ష’ అని పేరు పెట్టాం. ఇలా ఏనాడైనా చేశావా బాబూ? చంద్రబాబూ.. ఇలా ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? మీరు ఎప్పుడైనా చేశారా? రైతు, భూ యజమాని నష్టపోకూడదని, అన్ని రకాలుగా మంచి జరగాలని మీరెప్పుడైనా తాపత్రయ పడ్డారా? ఇంత చేసిన మా గురించి ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఎవరు దొంగలో ఇప్పుడు చెప్పండి. ప్రజల ఆస్తులను కొల్లగొట్టాలని అనుకునే ఎవరైనా ప్రత్యేక (డిస్టింక్ట్) రాళ్లు పాతి, భూ కమతాల నలుమూలలా జియో ట్యాగింగ్ చేసి, క్యూ ఆర్ కోడ్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టాదార్ పాసు పుస్తకాలు ఇస్తారా? చెడు ఉద్దేశాలుంటే ఈ విధంగా మంచి చేస్తారా? అబద్ధాలకు ఒక హద్దు ఉండాలి. మాపై బాబు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. ఒకసారి పాత, కొత్త పాస్ పుస్తకాలను అందరూ గమనించాలి. పాత వాటిలో భూ వివరాలన్నీ చేతితో రాసి ఉంటాయి. ఆ పాత పుస్తకంలో ఎక్కడా మ్యాప్‌లు లేవు. అక్షాంశాలు, రేఖాంశాలతో జియో ట్యాగింగ్ లేదు. మేం సబ్ డివిజన్, మ్యూటేషన్ చేశాక, విశిష్ట భూ కమతా నంబర్, ఏ మాత్రం తేడాలేని కొలతలతో కూడిన జియో ట్యాగింగ్ చేసి, క్యూ ఆర్ కోడ్లతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. పాస్‌బుక్ చివరలో రైతులకు సూచనలు చేస్తూ వెబ్‌సైట్‌ను అప్‌గ్రేడ్ చేసి, రైతుల వివరాలు అప్డేట్ చేసి, రియల్ టైమ్ అప్డేట్స్తో అందుబాటులోకి తెచ్చాం. సర్వే పూర్తయిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చాం. దాన్ని పూర్తిగా వదిలేశారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ఎందుకంత ముఖ్యమంటే.. కళ్ల ఎదుటే గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ, రికార్డులు అప్డేట్ అవుతున్నప్పుడు, మోసాలకు ఏ మాత్రం ఆస్కారం ఉండదు కాబట్టి. నీతి ఆయోగ్ కొనియాడింది.. మేం చేపట్టిన రీసర్వే గొప్పగా జరిగింది కాబట్టే నీతి ఆయోగ్ కొనియాడింది. కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. మహారాష్ట్ర వచ్చి ప్రశంసలు కురిపించింది. అసోం బృందం ఏపీలో పర్యటించి, ఏపీ ప్రభుత్వ సహకారం కోరింది. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ మా ప్రభుత్వ తీరును మెచ్చుకున్నారు. (వీడియో ప్లే చేసి చూపించారు). క్రెడిట్ కోసం పడరాని పాట్లు సమగ్ర భూ సర్వేతో భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని నాడు చంద్రబాబు విష ప్రచారం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో భాగస్వామిగా ఉండీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా మా ప్రభుత్వంలో సర్వే చేశామని కేంద్రం రూ.400 కోట్లు రాయితీ ఇస్తే ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని ట్వీట్ చేయడం, చంద్రబాబు థ్యాంక్యూ అని రీ ట్వీట్ చేయడం ఆశ్యర్యంగా ఉంది. క్యూ ఆర్ కోడ్ తానే తెచ్చానంటూ చంద్రబాబు సొల్లు మాటలు చెబుతున్నారు. సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు. మేమిచ్చిన పుస్తకాలకే రంగు మార్చి.. మేం ఇచ్చిన 30 లక్షల పాస్ బుక్‌లు వెనక్కి తీసుకొని, వాటికే చంద్రబాబు రంగు మార్చి ఇస్తున్నారు. రంగు మార్చి ఇస్తున్న వాటిలో తేడా ఏముందో చూస్తే.. అదే క్యూ ఆర్ కోడ్, అదే ఫార్మాట్. జీయో కో ఆర్డినేట్స్‌తో భూ కమతా నంబర్, జియో కో ఆర్డినేట్స్ ల్యాండ్ మ్యాప్ ఇలా అన్ని ఒకే విధంగా ఉన్నాయి. చివరి పేజీల్లో చూస్తే వైఎస్సార్సీపీ హయాంలో అప్‌గ్రేడ్ చేసిన మీ భూమి పోర్టల్‌ను కాపీ కొట్టి ముద్రించారు. మేం ఇచ్చిన పుస్తకాలకు రంగు మార్చడం తప్ప ఈ 19 నెలల్లో చంద్రబాబు చేసిందేమీ లేదు. రంగు మార్చి ఇచ్చే పుస్తకాల్లోనూ తప్పుల తడకలే. పేర్లు, ఫొటోలు, ఐడీ నంబర్లు, విస్తీర్ణం అన్నింట్లో తప్పులు వస్తున్నాయి. వాటిని సరిచేసుకోవడానికి రైతులు మళ్లీ లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. పేర్లు చెరిపేయడానికి రూ.15 కోట్లు రీ సర్వే చేసి కొన్ని కోట్ల సర్వే రాళ్లను మేము పాతాం. ఆ రాళ్ల మీద ఉండే వైఎస్సార్, జగనన్న భూ హక్కు – భూ రక్ష పేరును రూ.15 కోట్ల డబ్బు ఇచ్చి మెషీన్లు పెట్టి తుడిచేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము వెచ్చించి, ఇంత పనికిమాలిన పని ఎవరైనా చేస్తారా? ఈయన కొత్తగా రాళ్లు ఇవ్వకపోగా, మేం పాతిన రాళ్లపై పేర్లను చెరిపేస్తున్నారు. అంటే అవి భూ రక్ష రాళ్లు కాదని చూపడానికి, అందులో ఉండే ప్రత్యేకతను(డిస్టింక్ట్) దగ్గరుండి తీసివేసే కార్యక్రమం చేస్తున్నాడు. పనికి మాలిన పని కాకపోతే ఇదేంటి? బుద్ధి ఉన్నోడు ఎవడైనా ఇలా చేస్తాడా? విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర కూడా ఇంతే. విగ్రహం నిర్మాణం ప్రారంభించి, పూర్తి చేసి, ఆవిష్కరించిందీ నేనే. అదే పనిగా అధికారులను పంపి నా పేరును తీయించారు. ఇటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. నా పేరు తీసేస్తే మాత్రం ఆ అంబేడ్కర్ విగ్రహం ఎవరు కట్టారో తెలియదా? రీ సర్వే ఎవరు చేయించారో తెలియదా? ట్యాంపర్‌కు వీల్లేని పాస్ పుస్తకాలు ఎప్పుడు వచ్చాయో తెలియదా? చంద్రబాబు వయసేమో 80 ఏళ్లు. మా నాన్నతో సమకాలికుడు. మా నాన్నతో పోటీ దేవుడెరుగు, ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీకి అవస్థ పడుతున్నారు. కమీషన్ కోసం దేన్నీ వదలడం లేదు⇒ మా హయాంలో రూ.55.79కు పట్టాదారు పాస్‌బుక్ ఇచ్చాం. కలర్ మార్చి రూ.76కు చంద్రబాబు ఇస్తున్నారు. అంటే రూ.20 కమీషన్. కమీషన్ కోసం దేనినీ వదలడం లేదు. ఇంకో ఆశ్చర్యం చంద్రబాబు 22–ఏ గురించి మాట్లాడటం. 22–ఏ గురించి 2016–17లో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి, నిషేధిత జాబితా కింద పెట్టి, రైతులను, పేదలను, భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఆయనది. తప్పులన్నీ ఆయన చేసి, బురద మాత్రం వేరేవాళ్ల మీద చల్లుతారు. ⇒ మేం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా 20.24 లక్షల మంది పేదలు, రైతులకు ఏకంగా 35.44 లక్షల ఎకరాలపై హక్కులు లభించాయి. ఇందులో ప్రధానంగా అసైన్డ్ ల్యాండ్ పొంది 20 ఏళ్లు దాటితే, వారి భూముల మీద పూర్తి హక్కులు కల్పించిన ఘనత మా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. ఒరిజినల్ అసైనీలకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపజేస్తూ మేము తీసుకొచ్చిన చట్టం ద్వారా ఏకంగా 15,21,160 మంది అసైన్డ్ నిరుపేదలకు 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయి. ⇒ చుక్కల భూములకు సంబంధించి మరో 97 వేలకు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలకు మేం హక్కులు కల్పించాం. షరతులు కలిగిన భూములకు సంబంధించి 22 వేల మంది రైతులకు మరో 35 వేలకు పైగా ఎకరాల భూమి మీద హక్కులు వచ్చాయి. విలేజ్ సర్వీస్ ఇనాం భూముల కింద 1.58 లక్షల ఎకరాలకు సంబంధించి మరో 1.61 లక్షల మందికి మేలు కలిగిస్తూ హక్కులు కల్పించాం. ⇒ చంద్రబాబు సృష్టించిన కష్టాల నుంచి మేము పేదలను, రైతులను బయటకు వేశాం. ఇప్పుడేమో ఆ పెద్ద మనిషి 22–ఏ మా హయాంలో పెట్టామని మాట్లాడుతున్నాడు. అబద్ధాలు చెప్పడానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క సెంటు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మా ప్రభుత్వ హయాంలో 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు కొత్తగా మేము పంపిణీ చేశాం. గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద 1.54 లక్షల గిరిజన కుటుంబాలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కు కల్పించాం. చంద్రబాబు క్రెడిట్ చోరీలో భాగంగా, 22ఏ మేము పెట్టామని అంటున్నాడు. ఇంత కచ్చితమైన గ్రామ మ్యాప్స్ దేశంలో తొలిసారిభారత్లో భూ రికార్డులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. గ్రామాల్లో పట్వారీ ఉపయోగించే మ్యాప్స్‌ను నిజంగా మ్యాప్‌లు అని కూడా అనలేం. అవి కచ్చితత్వం లేని, తప్పులతో కూడిన మ్యాప్స్. ఈ పరిస్థితిని సరిచేయడానికి 2008లో ఎన్ఎంఎల్ఆర్పీ అనే ఒక పథకం వచ్చింది. కానీ ఆ పథకం ద్వారా జరగాల్సిన స్థాయిలో సంస్కరణలు జరగలేదు. ఏపీలో దూరదృష్టి కలిగిన సీఎం వైఎస్ జగన్ సంస్కరణల దిశగా అడుగులు వేశారు. భూ రికార్డులను సంపూర్ణంగా సరిచేయాలన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వచ్చారు. మొదటగా 10 వేల మందికిపైగా గ్రామ సర్వేయర్లను నియమిస్తూ అడుగులు వేశారు. రీసర్వే అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూఏవీలు, డ్రోన్స్, హెలికాప్టర్లు, విమానాల సహాయంతో గ్రామాల మ్యాపింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు గ్రామాల్లో ఉన్న మ్యాప్స్‌తో పోలిస్తే, ఇకపై రైతులకు లభించే వివరాలు, మ్యాప్‌లు అత్యంత కచ్చితంగా ఉంటాయి. ఇది దేశంలోనే ఒక మైలు రాయి. ఇంత కచ్చితమైన గ్రామ మ్యాప్స్‌ను రూపొందించడం దేశంలో ఇదే తొలిసారి. 17 వేల గ్రామాలకుగాను ఇప్పటికే 7 వేలకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తయింది. ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న పథకాన్ని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. – 2022 నవంబర్ 23న నరసన్నపేటలో సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ (ఈ వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు) -
వందేళ్ల తర్వాత చేపట్టిన మహాయజ్ఞం అది
సాక్షి, అమరావతి: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో అత్యాధునిక ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ఇదివరకెన్నడూ లేని విధంగా సమగ్ర భూ రీ సర్వేను విప్లవాత్మక రీతిలో చేపట్టడం వల్లే మహా యజ్ఞం అంటున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... వందేళ్ల తర్వాత మహా యజ్ఞం2019కి ముందు చేపట్టిన నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రే భూముల రీ సర్వేకు మూలం. భూములకు సంబంధించిన సమస్యలతో రైతులు, ప్రజలు పడే ఇబ్బందులను పాదయాత్రలో కళ్లారా చూశాను. ఆ రోజుల్లో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ పరిస్థితి ఎంతో దారుణంగా ఉండింది. సరిపడా సర్వేయర్లు, సిబ్బంది లేరు. పరికరాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అంతకన్నా లేవు. భూముల క్రయవిక్రయాలు, కుటుంబాల మధ్య భూ పంపిణీ జరిగితే సబ్ డివిజన్, మ్యుటేషన్ ఊసే ఉండేది కాదు. దీనికి తోడు చంద్రబాబు ఎప్పుడు పడితే అప్పుడు భూములను ఎడాపెడా 22–ఏ జాబితాలో పెడుతున్న దుస్థితి అప్పట్లో ఉంది. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారంగా సమగ్ర భూ సర్వే, సమగ్ర భూ సంస్కరణలు చేయాలనే ఆలోచన పుట్టుకొచ్చింది. జియో కో ఆర్డినేట్స్ ఆధారంగా రీ సర్వేను అత్యంత పారదర్శకంగా, అత్యంత కచ్చితత్వంతో చేపట్టాం.పారదర్శకంగా భూముల సర్వే» ప్రజలు, రైతులకు వివాదాలు లేకుండా పారదర్శకంగా భూముల సర్వే చేయడంతో పాటు, భూ రికార్డులు అన్నింటినీ అప్డేట్ చేయడం. » ట్యాంపర్ చేయడానికి ఏ మాత్రం ఆస్కారం లేని విధంగా భౌతికంగా, డిజిటల్ రూపంలో రికార్డులను భద్ర పరచడం. » భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాకుండా, ఆ క్లియర్ టైటిల్స్‌కు ప్రభుత్వమే గ్యారంటీగా నిలబడుతుంది.అత్యాధునిక ప్రమాణాలు(అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్), క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాస్ పుస్తకాలను ఇచ్చాం. » భూముల క్రయవిక్రయాలు జరిగినా, లేదంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, అన్నదమ్ముల మధ్య భూ పంపిణీ ద్వారా యాజమాన్య హక్కులు మారిన సందర్భాల్లో ఆటోమేటిక్ సబ్ డివిజన్, ప్రొటోకాల్ మ్యుటేషన్ జరిగేలా చేశాం. » ఇందుకు సంబంధించిన రికార్డులు అన్నీ కూడా ఆ గ్రామ సచివాలయంలోనే ఉంటాయి. సచివాలయాల్లోనే రికార్డులన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా, అక్కడే రిజి్రస్టేషన్ సేవలు ప్రారంభించాం. » భూముల లావాదేవీలపై రియల్ టైమ్ అలర్ట్స్‌ను మొబైల్ ఫోన్‌కు పంపేలా ప్రభుత్వ పోర్టల్‌ను అభివృద్ధి చేశాం. » ఈ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, భూ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసి, ట్యాంపర్ చేయడానికి వీల్లేని పత్రాలు చేతిలో పెట్టి, తర్వాత కూడా వ్యవస్థను నిర్వహించాలని తపనపడ్డ మా వంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. » ఇలా ఎంతో లోతుల్లోకి వెళ్లాం. అందుకే దీన్ని మహాయజ్ఞం అంటున్నాం. అసలు ఎంత లోతుల్లోకి మేం వెళ్లాం.. చిత్తశుద్ధి చూపామనడానికి నాడు చేసి సమీక్షలే నిదర్శనం. (31.03.2022న సమీక్ష వీడియో ప్రదర్శించారు) ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా.. చూశావా.. చేశావా.. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబూ? » ఇవన్నీ చేయని చంద్రబాబు ఏ రకంగా రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటారు? క్రెడిట్ చోరీకి ఎలా పాల్పడతారు? వీటిలో ఏ ఒక్కటీ ఆయన హయాంలో జరగలేదు. మరి క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గుండాలి. ప్రతి ప్రయత్నం ఓ రికార్డు» సమగ్ర భూ సర్వేలో మేం చేసిన ప్రతీ ప్రయత్నం ఓ రికార్డు. 15 వేల గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. ఇది ఒక రికార్డు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగుల చొప్పున ఒకే ఒక నోటిఫికేషన్‌తో 1.34 లక్షల ఉద్యోగులను నియమించాం. ఇది ఎవ్వరూ ఎప్పుడూ అధిగమించలేని సూపర్ రికార్డు. ప్రతి సచివాలయంలో వీఆర్వో (గ్రామ రెవెన్యూ అధికారి), సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్ చొప్పున దాదాపు 40 వేల మంది రీ సర్వేలో పాల్గొన్నారు. సర్వే కోసం విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించాం. » రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికల సందర్భంగా మా మేనిఫెస్టోలో సుపరిపాలన అంశంలో రాష్ట్రంలోని భూములన్నింటినీ సమగ్ర రీ సర్వే చేయించి, శాశ్వత భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చాం. చెప్పిన మేరకు 2020 డిసెంబర్ 21న రీసర్వే అనే మహా యజ్ఞాన్ని ప్రారంభించాం. అంతకు ముందు వందేళ్ల కిందట 1923లో బ్రిటీష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వేను మా ప్రభుత్వం చేపట్టింది. గొప్ప వ్యవస్థను సృష్టించాం చంద్రబాబులా మేమెప్పుడూ కబుర్లు చెప్పలేదు. గొప్ప వ్యవస్థను సృష్టించి, అత్యాధునిక సాంకేతికతను దత్తత చేసుకుని గొప్పగా అడుగులు వేశాం. అంతటితో ఆగిపోలేదు. ఎక్కడికక్కడ వివాదాల పరిష్కారం కోసం మండలానికి ఇద్దరు అధికారుల చొప్పున 1,358 మండల మొబైల్ మేజిస్ట్రేట్ లను అందుబాటులోకి తెచ్చాం. రియల్ టైమ్ అప్డేట్స్తో ఏపీ ప్రభుత్వ ‘మీ భూమి’ వెబ్ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేశాం. ల్యాండ్ పార్సిల్స్ (భూ కమతాలు)కు సంబంధించి ఏ లావాదేవీ జరిగినా, యజమానులకు రియల్ టైమ్ అలెర్ట్ వచ్చే విధంగా పోర్టల్‌ను తీర్చిదిద్దాం. చంద్రబాబు అనే వ్యక్తికి చిత్తశుద్ధి, బాధ్యత ఉండదు. ఎవరైనా చేస్తే ఆ క్రెడిట్ కొట్టేయడానికి మాత్రం ప్రయత్నిస్తాడు. రైతు, భూ యజమానికి సరిహద్దులు తెలిసేలా రాళ్లను పాతితేనే సర్వే పూర్తయినట్లు. ఆ భూమిలో సర్వే అయినట్టు ప్రత్యేక (డిస్టింక్ట్) రాయి ఉండాలి. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి.. ఇదే సర్వే రాయి అంటే సరిహద్దులు ఎలా ఉంటాయి? అందుకే ప్రత్యేక (డిస్టింక్ట్) తరహాలో సర్వే రాళ్లను ఉచితంగా ప్రభుత్వం రైతులకు సరఫరా చేసింది. రాళ్ల మీద శాశ్వత భూ హక్కు – భూ రక్ష పేరు పెట్టాం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో 1923లో బ్రిటీష్ వాళ్లు పెట్టిన రాళ్లు కనిపిస్తాయి. (బ్రిటీష్ హయాంలో పెట్టిన సర్వే రాళ్లు చూపించారు) చంద్రబాబు ఏమో రాళ్లెందుకు అంటాడు? -
Land Resurvey: ఎప్పుడైనా విన్నావా బాబు..
-
భూ రీసర్వే పై YS జగన్ రియాక్షన్
-
బుద్ధి జ్ఞానం అయిన ఉండాలి... అబద్ధాలు చెప్పడానికి సిగ్గయినా ఉండాలి
-
మేనిఫెస్టో కాపీని చూపిస్తూ.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్రలో వచ్చింది..
-
అబద్ధాలు.. దబాయింపులు
జగన్ప్రభుత్వం చేస్తున్న రీ సర్వే వల్ల రైతులకు నష్టం. మీ భూములన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిని ఆక్రమిస్తారు.. ఇక మీ భూములు మీవి కావు.. రీ సర్వే నెపంతో అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో తెలుసుకోవడం కోసమే ఈ సర్వే చేస్తున్నారు.. మేము అధికారంలోకి రాగానే రీ సర్వేను ఆపేస్తాం.. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపండి. - ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్‌కో దుష్ప్రచారంఆంధ్రప్రదేశ్లో రీ సర్వే అద్భుతం.. రీ సర్వే చాలా బాగా జరిగింది.. ఇంకా జరుగుతోంది.. ఆధునిక టెక్నాలజీ వాడుతున్నాం.. ఇప్పటికే సగానికిపైగా గ్రామాల్లో పూర్తి చేశాం.. ఏడాదిలోగా భూ సమస్యలే లేకుండా చేస్తాం.. రీ సర్వే వల్ల రైతులకు ఎంతో లాభం.- సీఎం హోదాలో కేంద్రానికి రాసిన లేఖలో చంద్రబాబుసాక్షి, అమరావతి: నాడు దుష్ప్రచారంతో భూముల రీ సర్వేను అడ్డుకుని, ఇప్పుడు దాని క్రెడిట్‌ను చోరీ చేస్తుండడం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి చంద్రబాబు దబాయింపు మొదలు పెట్టారు. అసలు విషయాలపై మాట్లాడకుండా తానే భూముల రీ సర్వే చేయిస్తున్నానని, పట్టాదార్ పాస్‌పుస్తకాలపై క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పిన అబద్ధాలనే మళ్లీ చెబుతున్నారు. ఎన్నికలకు ముందు భూముల రీ సర్వేను అడ్డుకున్న చంద్రబాబు.. విపరీతమైన దుష్ప్రచారం చేసిన విషయం జగమెరిగిన సత్యం.కానీ ఇప్పుడు దానిపై ఆయన యూటర్న్ తీసుకుని, అది తన గొప్పేనని ప్రచారం చేసుకోవడంపై అధికారులు, ప్రజలు నివ్వెరపోతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2020లో ప్రారంభమై విజయవంతంగా జరిగిన భూముల రీ సర్వేకు కేంద్ర ప్రభుత్వం కితాబిచ్చింది. నీతి ఆయోగ్ సైతం దాన్ని ప్రశంసించింది. అయితే ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దేశానికి ఆదర్శంగా మారిన రీ సర్వేపై పనిగట్టుకుని బురదజల్లారు. రీ సర్వే చేసి భూములు దోచేస్తున్నారంటూ ఎల్లో మీడియాతో కలిసి విష ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక రీ సర్వే ప్రయోజనాలు గొప్పగా ఉండడం, కేంద్రం దాన్ని కొనసాగించాల్సిందేనని స్పష్టం చేయడంతో ఒక్కసారిగా రూటు మార్చేశారు. ఏడాది పాటు రీ సర్వేను పూర్తిగా నిలిపివేసినా, చివరికి కొనసాగించారు. రాయితీల కోసం యూటర్న్భూ రికార్డులను ఆధునికీకరణ చేసే రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని, 50 ఏళ్లపాటు పావలా వడ్డీ రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో చంద్రబాబు యూటర్న్ తీసుకుని, రీ సర్వే అద్భుతమని కేంద్రానికి లేఖలు పంపారు. తమ రాష్ట్రంలో రీ సర్వే చాలా బాగా జరిగిందని, ఇంకా జరుగుతోందని, ఇప్పటికే సగానికిపైగా గ్రామాల్లో పూర్తి చేశామని.. ఇందుకు ఆధునిక టెక్నాలజీ వాడుతున్నామని కేంద్రానికి తెలిపారు. అయితే అప్పటికే ఏపీలో జరుగుతున్న రీ సర్వేపై కేంద్రానికి స్పష్టంగా తెలిసి ఉండడంతో రీ సర్వేను ఆదర్శవంతంగా చేసినందుకు మొదటి విడతగా రూ.400 కోట్ల రాయితీని విడుదల చేసింది.దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటూ రీ సర్వే తానే చేస్తున్నానని ఎల్లో మీడియా తోడుగా డప్పు కొట్టుకుంటున్నారు. వాస్తవానికి ఆ నిధులు విడుదలయ్యే సమయానికి రాష్ట్రంలో రీ సర్వేను చంద్రబాబు నిలిపివేశారు. అది జగన్ కార్యక్రమమనే కారణంతో దాన్ని ఆపేసి రాష్ట్రంలో బురద జల్లుతూనే, ఢిల్లీలో మాత్రం దాని గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు రీ సర్వేను అరకొరగా చేస్తూ అది మొత్తం తన ఘనతేనంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. నిజానికి రీ సర్వే పేరుతో చంద్రబాబు వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవడం, పాతిన హద్దు రాళ్లను తొలగించడం మాత్రమే చేశారు. నాడు రీ సర్వే ప్రత్యేకత తెలిసేలా గ్రానైట్ హద్దు రాళ్లు రీ సర్వే చేశాక వైఎస్ జగన్ ప్రతి భూమి పార్సిల్ మ్యాప్ ప్రకారం హద్దు రాళ్లను పాతించారు. ఏ రాయి పడితే ఆ రాయి వాడితే సర్వే ప్రాధాన్యం, సర్వే చేసిన విషయం తెలియదని.. ఒక మార్క్‌గా, గుర్తుగా ఉండేలా గ్రానైట్ రాళ్లు వాడారు. దానిపై నవ రత్నాల లోగో వేశారు. రీ సర్వే ప్రత్యేకతను తెలిపేందుకు వందేళ్ల తర్వాత జరిగిన కార్యక్రమం కావడంతో దానిపై లోగోను స్పష్టంగా ముద్రించారు. దానిపై చంద్రబాబు ఇష్టానుసారం తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి రాగానే వాటిని తొలగించారు. ఇప్పటికీ ఆ ప్రచారం చేస్తూనే రీ సర్వే ప్రయోజనాలను మాత్రం తనవిగా చెప్పుకుంటున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్లు ముద్రించే విధానాన్ని తామే తీసుకువచ్చామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వేఅత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వేను ఒక మహా క్రతువులా చేయించిన వైఎస్ జగన్ ప్రభుత్వం పాస్ పుస్తకాలపై క్యూ ఆర్ కోడ్లు ముద్రించి కొత్త విధానానికి నాలుగున్నరేళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. దీని వెనుక పెద్ద టెక్నాలజీ వ్యవస్థనే అప్పట్లో వైఎస్ జగన్ ఏర్పాటు చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 70 కార్స్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇవి నిరంతరం పని చేసే శాశ్వత జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) రిసీవర్ల వ్యవస్థగా పని చేస్తాయి. ఈ స్టేషన్లు ప్రతి క్షణం ఉపగ్రహ డేటాను సేకరించి సెంట్రల్ సర్వర్కి పంపుతాయి.దీని ద్వారా భూమిపై నిర్దేశిత స్థానం కచ్చితంగా తెలుస్తుంది. సర్వేయర్లు సొంత బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోకుండానే సెంటీమీటర్ స్థాయి కచ్చితత్వంతో భూములను కొలుస్తారు. ఈ టెక్నాలజీతోనే జగన్ హయాంలో రాష్ట్రంలోని 13,500 గ్రామాలకు గానూ 6,800 గ్రామాల్లో సర్వేను అన్ని దశల్లో పూర్తి చేశారు. అక్కడ ఇప్పుడు కొత్తగా డిజిటల్ రెవెన్యూ రికార్డులు, సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఎం నంబర్లు, పాస్ పుస్తకాలపై క్యూ ఆర్ కోడ్లు, జియో హద్దులు ముద్రించారు. ఇవన్నీ గతంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన అత్యాధునిక టెక్నాలజీ ఫలితమే. దాన్ని కూడా తానే తెచ్చినట్లు చంద్రబాబు అబద్ధాలు వల్లె వేస్తున్నారు. ఇదీ రీ సర్వే స్పెషాలిటీఅత్యాధునిక టెక్నాలజీ అయిన జీపీఎస్‌ను కార్స్ (కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్) నెట్‌వర్క్‌లో ఉపయోగించి రీ సర్వే చేయించారు. ఇది 24 గంటలు పని చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రమంతా 70 కిలోమీటర్ల దూరంలో 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అంతరిక్షంలో సుమారు 150 శాటిలైట్స్ నుంచి వచ్చే రేడియో సిగ్నల్‌ని ప్రతి బేస్ స్టేషన్ స్వీకరించి జియో కో ఆర్డినేట్స్‌ను సర్వే శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ చేసిన స్టేషన్‌కు పంపుతుంది.200 వరకు డ్రోన్లు, నాలుగు హెలికాప్టర్లు, 2 విమానాలు, 3,240 జీఎన్ఎస్ఎస్ రోవర్లు సహాయంతో సర్వే చేశారు. ఇప్పుడు ఈ నెట్‌వర్క్‌ను కేంద్రం కూడా వినియోగించుకుంటోంది. జగన్ తెచ్చిన ఈ వ్యవస్థను నేషనల్ ప్లాట్‌ఫాంకు అనుసంధానించేందుకు అంగీకరిస్తూ 2024 అక్టోబర్ 18న ఏపీ సర్వే శాఖతో సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఇదీ రీ సర్వే స్పెషాలిటీ. అందుకే దాన్ని నాడు వ్యతిరేకించి అడ్డుకున్న విషయాన్ని పక్కనపెట్టి, ఇప్పుడు తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ఆరాట పడుతున్నారు.విజనరీ సీఎం జగన్ వల్లే ఏపీలో రీ సర్వేఎస్వీ సింగ్, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్2023 నవంబర్ 22న శ్రీకాకుళం జిల్లా నర్సీపట్నంలో రీ సర్వే రెండవ దశ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో అప్పటి సీఎం జగన్‌తో కలిసి, అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్వీ సింగ్ పాల్గొన్నారు. ఆ సభలో సింగ్ మాట్లాడుతూ ఒక విజనరీ సీఎం ఉండడం వల్లే దేశంలో ఇంత వరకు ఎక్కడా జరగని విధంగా ఏపీలో భూముల రీ సర్వే జరుగుతోందని స్పష్టం చేశారు. దేశంలో భూ రికార్డుల పరిస్థితి అస్థవ్యస్థంగా ఉందని, వాటిని మార్చాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నా సాధ్యం కాలేదన్నారు.కానీ జగన్ నేతృత్వంలో ఏపీలో 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో ప్రతి భూమికి మ్యాప్ తయారు చేశారని, దేశంలో ఇదొక మైలు రాయి అని చెప్పారు. దేశంలో భూ రికార్డులు సరిదిద్దిన మొదటి రాష్ట్రం ఏపీయేనని తెలిపారు. సీఎం స్వయంగా నిరంతరం పర్యవేక్షణ చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లు, విమానాలతో భూముల సర్వే చేయడం దేశంలో ఎప్పుడూ జరగలేదని, ఏపీలో మొదటిసారి జరిగిందన్నారు. ఈ మోడల్‌ను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఏపీ రీ సర్వే దేశానికి ఆదర్శంఅజయ్ తిర్కీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి2023 అక్టోబర్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ (భూ వనరుల శాఖ) కార్యదర్శి అజయ్ తిర్కీ విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో పర్యటించి భూముల రీ సర్వే క్షేత్ర స్థాయిలో ఎలా జరుగుతుందో పరిశీలించి అభినందించారు. ఏపీలో చేపట్టిన రీ సర్వే దేశానికి ఆదర్శమని కొనియాడారు. ఇతర రాష్ట్రాలకు ఇక్కడ జరుగుతున్న రికార్డుల డిజిటలైజేషన్ ఒక ఆదర్శమని, దీనివల్ల భూ వివాదాలు తగ్గుతాయని తెలిపారు.అధునాతన టెక్నాలజీ వాడడం వల్ల సర్వేలో పారదర్శకత ఏర్పడిందన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ శాఖాధికారులు ఏపీకి వచ్చి ఇక్కడ జరుగుతున్న సర్వే విధానాన్ని పరిశీలించారు. సర్వే ఎలా చేయాలో తమకు నేర్పించాలని కోరడంతో ఏపీ సర్వే శాఖాధికారులు డెహ్రాడూన్ వెళ్లి రీ సర్వే జరుగుతున్న తీరును వివరించారు. 2020–2024 మధ్యలో భూ రికార్డుల ఆధునికీకరణకు సంబంధించిన అనుమానాలు, పరిశీలనలు వంటి దేనికైనా కేంద్రం ఏపీనే సంప్రదించేది. -
చంద్రబాబు యూటర్న్.. భూముల 'రీసర్వే'పై దొంగాట
-
ఆంధ్రప్రదేశ్‌లో భూముల ‘రీ సర్వే’పై చంద్రబాబు దొంగాట... అప్పుడు దుష్ప్రచారం చేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ కోసం పాకులాట
-
బాబు యూ టర్న్ ‘రీ సర్వే’పై దొంగాట
సాక్షి, అమరావతి: తనకు సంబంధం లేని వాటిని కూడా తానే చేసినట్లు నిర్భీతిగా, నిస్సిగ్గుగా చెప్పుకునే చంద్రబాబు.. జగన్ హయాంలో ప్రారంభమైన భూముల రీ సర్వే క్రెడిట్‌ను సైతం తన ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రీ సర్వేపై అదే పనిగా దుష్ప్రచారం చేసి, దానివల్ల రైతుల భూములు కబ్జా అవుతాయని చెప్పిన నోటితోనే ఇప్పుడు దాన్ని తానే ప్రారంభించినట్లు చెప్పుకుంటూ బహిరంగంగా మరో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. లక్షల ఎకరాలను 22–ఎ జాబితాలో పెట్టిన బాబు.. ఇప్పుడు వేల ఎకరాలను 22–ఎ జాబితా నుంచి తొలగించినట్లు బరితెగించి ప్రచారం చేసుకోవడం గమనార్హం. బ్రిటీషర్ల తర్వాత ఏ రాష్ట్రంలో, ఏ పాలకుడూ తలపెట్టని అతి పెద్ద భూముల సర్వేను గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టడమే కాకుండా విజయవంతంగా నిర్వహించింది. ఇందుకోసం 15 వేల మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. దేశ చరిత్రలో అంత మంది రెవెన్యూ సిబ్బందిని నియమించడం అదే ప్రథమం. 2019కి ముందు ఒక భూమిని సర్వే చేయాలంటే సంవత్సరాలు పట్టేది. ఆ సర్వే కూడా అరకొరగా చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిని సర్వే చేసి భూ వివాదాలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ తపన పడ్డారు. పైసా ఖర్చు లేకుండా 2024 ఎన్నికల నాటికి రాష్ట్రమంతా డ్రోన్ సర్వే పూర్తి చేయగా, సుమారు 6,800 గ్రామాల్లో సర్వే అన్ని దశలు పూర్తయి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికిపైగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చారు. సర్వే చేశాక నిర్ణయించిన హద్దులో రాళ్లు పాతించారు. భూముల వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చి వేసే దీనిపై చంద్రబాబు లేనిపోని నిందలు, అభాండాలు వేశారు.సర్వే రాళ్లపై ముద్రించిన లోగోపై తప్పుడు ప్రచారంసర్వే చేసి, హద్దులు నిర్ణయించి, ఆ హద్దులో ప్రభుత్వమే రాళ్లు పాతి.. రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తే దానిపై ఇష్టానుసారం తప్పుడు ప్రచారం చేశారు. ఆ రాళ్లపై జగన్ ఫొటో ఉందని చంద్రబాబు బురదజల్లారు. నిజానికి ఆ రాళ్ల మీద ఉన్న ఫొటో నవరత్నాల వాటర్ మార్క్ లోగో. రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాల వివరాలు అందులో ఉన్నాయి. ఆ నవరత్నాల ఫొటోను 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా భావించారు. అధికారంలోకి వచ్చాక సీఎం కార్యాలయం నుంచి ప్రతి పంచాయతీ కార్యాలయంలోనూ ఆ ఫొటో పెట్టి దాని ప్రకారం పరిపాలన నడిపిన చరిత్ర జగన్‌ది. అయితే మేనిఫెస్టోలో ఉన్న ఆ ఫొటోపైనే చంద్రబాబు అండ్ గ్యాంగ్ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. నవరత్నాల కేంద్రంగానే మొత్తం పరిపాలన సాగించి, ఇచ్చిన ప్రతిని హామీని అమలు చేసి చూపిస్తే దాన్ని తప్పు పట్టిన వ్యక్తి చంద్రబాబు. అప్పుడు అడ్డుకుని.. ఇప్పుడు తనదేనని..రీ సర్వేను అడ్డుకుని, దానిపై దుష్ప్రచారం చేసి, మీ భూములు పోతాయని దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా దాన్ని తన ఖాతాలో వేసుకుంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను తెచ్చిన సంస్కరణల వల్లే రీ సర్వే జరుగుతోందని, దానికి రూ.400 కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయన డప్పు కొట్టుకుంటున్నారు. వివాదాలు లేని భూముల వ్యవస్థను తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ రీ సర్వేకు అంకురార్పణ చేసి నిర్వహించారు. సర్వే పూర్తి చేసే క్రమంలో 14 లక్షల పట్టా సబ్ డివిజన్లు, దాదాపు 10 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 3 లక్షలకు పైగా రైతుల పేర్లు తొలిసారి రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించారు. పట్టా సబ్ డివిజన్, మ్యుటేషన్ కోసం వెళితే పట్టే సమయం, ఏర్పడే తిప్పలు ఎన్నో తెలిసిందే. రీ సర్వే ద్వారా రైతుల నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఈ పనుల్ని జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. జగన్ హయాంలోనే క్యూఆర్ కోడ్.. జియో హద్దులు క్యూ ఆర్ కోడ్ ముద్రించడం ఒక్కటే కాదు.. సర్వే పూర్తయిన గ్రామాల భూ రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం అక్షాంశాలు, రేఖాంశాలుతో గత జగన్ ప్రభుత్వం జారీ చేసింది. అంటే శాటిలైట్ హద్దులన్నమాట. వాటిని మార్చడం సాధ్యం కాదు. క్షేత్ర స్థాయిలో భూమి హద్దులు మారినా శాటిలైట్ హద్దులు మాత్రం అలాగే ఉంటాయి. పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూ ఆర్ కోడ్, జియో హద్దులు ఇవ్వడం జగన్ హయాంలో వచ్చిన అతి పెద్ద భూ సంస్కరణల్లో ఒకటి. అసలు ఇవేమీ వద్దని.. వాటి ద్వారా రైతుల నుంచి భూములు లాక్కుంటారని అడ్డగోలు దుష్ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా అవన్నీ తాను తెచ్చినవేనని డప్పు కొట్టుకోవడం చూసి రెవెన్యూ యంత్రాంగం ఆశ్చర్యపోతోంది. జగన్ చేసిందాన్నే మళ్లీ చేస్తూ తనదిగా ప్రచారంరీ సర్వేలో ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూ హక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ కూడా ఇచ్చారు. వాటన్నింటితో కలిపి ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలపై రాజకీయ ముద్ర వేసి అధికారంలోకి వచ్చాక బాబు ఏకపక్షంగా రద్దు చేశారు. ఏడాదిన్నర తర్వాత తప్పుల తడకలుగా కొత్త పాస్‌పుస్తకాలు ముద్రించి గతంలో జగన్ హయాంలో ఇచ్చిన క్యూఆర్ కోడ్, జియో కోఆర్డినేట్స్నే అందులో పెట్టి అవి తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి రీ సర్వే తర్వాత జగన్ ప్రభుత్వం ప్రతి భూ కమతానికి ఆధార్ నెంబర్ మాదిరిగా ఒక విశిష్ట సంఖ్య (ఐడీ నంబర్) కూడా ఇచ్చింది. వీటన్నింటి వల్ల రికార్డుల ఆధునికీకరణ జరిగి వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేని వ్యవస్థ సృష్టించి భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేశారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించేందుకు, భూ అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ తెచ్చిన ఈ విధానంపై చంద్రబాబు జగమంత విషం కక్కారు. కానీ ఇప్పుడు తాను గతంలో చేసిన దుష్ప్రచారాన్ని మరచిపోయి అది ఘనతేనని చెప్పుకుంటున్నారు. దీన్ని చూసి ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడా ఉండదని రెవిన్యూ విభాగం నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. డ్రోన్లు.. విమానాలు.. ఆధునిక టెక్నాలజీతో రీ సర్వే రీ సర్వే కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యాధునిక సర్వే టెక్నాలజీని వినియోగించింది. 2020 డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో సర్వే ప్రారంభించింది. అప్పటి నుంచి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (సీఓఆర్ఎస్), జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) రోవర్లతో కేవలం 5 సెంటీమీటర్ల కచ్చితత్వం (తేడా)తో రైతులు సంతృప్తి చెందేలా సర్వే చేశారు. మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని డ్రోన్ల ద్వారా సర్వే (కొలిచారు) చేశారు. భూ హక్కు పత్రాల ద్వారా యజమానులకు రికార్డుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం, వారి భూముల హద్దుల్లో భూరక్ష సర్వే రాళ్లు పాతడం ద్వారా రక్షణ కల్పించడమే లక్ష్యంగా రీ సర్వే నిర్వహించారు. అభ్యంతరాలు, వినతులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మొబైల్ మేజిస్ట్రేట్లను నియమించి 40 వేల వివాదాలను పరిష్కరించారు. నిర్విరామంగా ఒక మహాయజ్ఞంలా జరిగిన రీ సర్వే కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా కూడా పాలుపంచుకుంది. కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇక్కడ జరుగుతున్న రీ సర్వే మోడల్‌పై అధ్యయనం చేసి టెక్నాలజీ సాయం కోరాయి. కేంద్ర ప్రభుత్వం ఏపీలో జరుగుతున్న రీ సర్వే అద్భుతమని కితాబిచ్చింది. సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు.. నిలిపివేసిన చంద్రబాబునాటి ప్రభుత్వంలో సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవల్ని సచివాలయాల్లోనే పొందే సౌలభ్యం కల్పించింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు సచివాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించే క్రమంలో దాన్ని నిలిపివేశారు.ఎన్నికలప్పుడేమో ఇలా విషప్రచారం.. సర్వే రాళ్లపై ఆ ఫొటో ఎందుకంటే..రీ సర్వే చేయక ముందు, చేసిన తర్వాత ఉన్న తేడా స్పష్టంగా తెలియడం కోసమే రాళ్లపై ఆ నవరత్నాల లోగోను ముద్రించారు. కేవలం సరిహద్దులు నిర్ణయించి వదిలేస్తే మళ్లీ గొడవలు వస్తాయని, ఎవరికి వారు రాళ్లు పాతుకోవాలంటే కష్టమవుతుందని, ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వమే రాళ్లు పాతించింది. ఆ రాళ్లపై నవరత్నాల లోగో ముద్రిస్తే అందులో జగన్ ఫొటో ఉందని తప్పుడు ప్రచారం చేశారు. ఆ ఫొటో ఉండడం వల్లæ తప్పేంటి? ఇప్పుడు పింఛన్ల ఫొటోల్లో చంద్రబాబు ఫొటో ఉండడం లేదా? అయిన దాంట్లో, కాని దాంట్లో తన పాంప్లెట్లపై పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్న చంద్రబాబు.. చరిత్రలో తొలిసారి సాహసోపేతంగా రీ సర్వే చేసి, హద్దు రాళ్లపై లోగోను ముద్రించడం తప్పెలా అవుతుందో చంద్రబాబుకే తెలియాలి.రీ సర్వేలో ఏపీ నంబర్ వన్ అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని కితాబుఇటీవల టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భూముల సర్వేలో ఏపీ దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. చంద్రబాబు వచ్చాక ఒక్క గ్రామంలో కూడా రీ సర్వే పూర్తి చేయలేదు. సర్వే చేయకుండానే రాష్ట్రం ఎలా నంబర్ వన్‌గా నిలిచింది? జగన్ హయాంలో ఒక యజ్ఞంలా జరిగిన రీ సర్వే వల్లే ఏపీ అందులో నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించింది. రోల్ మోడల్‌గా నిలిచిన కార్యక్రమంపై అడ్డగోలుగా అభాండాలు వేసిన చంద్రబాబు ఇప్పుడు రంగు మార్చి అది తన గొప్పేనని చెప్పుకోవడాన్ని ఏమనాలి? -
‘రీ సర్వే’పై దోబూచులాట!
సాక్షి, అమరావతి: భూముల తల రాతను మార్చేలా గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన భూముల రీ సర్వేను చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా చేయలేక సతమతమవుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఒక్క గ్రామంలోనూ రీ సర్వే పూర్తి చేయలేకపోయింది. గత జగన్ ప్రభుత్వం 8 వేలకుపైగా గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, అక్కడ డిజిటల్ రికార్డులను అందుబాటులోకి తెచ్చింది. అధికారంలోకి రాకముందు ఆ రీ సర్వేపై ఇష్టానుసారం ఆరోపణలు చేసి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన చంద్రబాబు, ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.రీ సర్వే మంచిదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో తాను అభాండాలు వేసిన దాన్ని రద్దు చేయలేక కొన్నాళ్లు డ్రామాలతో కాలక్షేపం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ హయాంలో జరిగిన రీ సర్వే దేశానికే రోల్ మోడల్‌గా ఉన్నట్లు చెప్పడం, రీ సర్వే చేసిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో.. రీ సర్వేలో తప్పులు సరి చేస్తామంటూ చంద్రబాబు కొత్తపాట పాడారు. మరోవైపు జగన్ హయాంలో 8 వేలకుపైగా గ్రామాల్లో పూర్తయిన రీ సర్వేను చూపించి కేంద్రం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకంగా రూ.400 కోట్ల నిధులు తెచ్చుకున్నారు. అయినా ఆ నిధులను రీ సర్వే కోసం ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించారు. కనీసం రెవెన్యూ శాఖకు కొన్ని నిధులైనా ఇవ్వాలని ఆ శాఖ కోరినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఈ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. సౌకర్యాలు లేవు.. సిబ్బందికి ఇతర పనులు రీ సర్వే చేసే బృందాలకు అవసరమైన కంప్యూటర్లు, రోవర్లు ఇవ్వకుండా రీ సర్వే చేయాలని ఒత్తిడి చేశారు. రెవెన్యూ యంత్రాంగానికి సర్వే చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించకుండానే సర్వే చేయాలంటూ మొక్కుబడి తంతు నడిపారు. మరోవైపు వీఆర్ఓలు, సర్వేయర్లకు ఇతర పనులు అప్పగించడంతో రీ సర్వే ముందుకు సాగలేదు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా నిరంతరం చేపట్టే అభిప్రాయ సేకరణ సర్వేలు, పింఛన్ల పంపిణీ తదితర పనుల కోసం వారిని పెద్ద ఎత్తున వినియోగించారు.ప్రధాని పర్యటనలు, యోగా డే ఇతర కార్యక్రమాల పనులన్నీ వారికే అప్పగించారు. ఆ పనుల్ని ఎంపీడీఓలు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో రీ సర్వే చేయాలని రెవెన్యూ శాఖ చెప్పినా దాంతో తమకు సంబంధం లేదని, తాము చెప్పిన పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. తహశీల్దార్లకు సైతం రెవెన్యూ పనులు చాలా ఉండడంతో రీ సర్వే గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఏడాదిన్నరలో ఒక్క గ్రామంలో కూడా రీ సర్వే పూర్తి చేయలేకపోయారు.రీ సర్వేలో మొదటి స్థానం ఎవరి ఘనత?గతంలో రీ సర్వే ప్రారంభమైన వెంటనే 19 నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఆయా భూములకు సంబంధించిన రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించే వారు. వారి రికార్డులు చూసేవారు. ఇప్పుడు అలా కాకుండా సర్వే అయిపోయాక రైతుల అభిప్రాయాలు తీసుకోవాలనే విధానాన్ని తెచ్చారు. దీంతో తప్పులు వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో ఇటీవలే తప్పులు సరి చేయడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో రీ సర్వేలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంతి పెమ్మసాని ప్రకటించారు.చంద్రబాబు ప్రభుత్వం ఒక్క గ్రామంలో కూడా సర్వే పూర్తి చేయకుండా ఏపీ ఎలా నంబర్ వన్‌గా నిలిచిందన్న దానికి ఆయన వద్ద సమాధానం లేదు. వైఎస్ జగన్ హయాంలో విజయవంతంగా రీ సర్వే జరగడం, 8 వేలకుపైగా గ్రామాల్లో సర్వే పూర్తయి కొత్త డిజిటల్ రికార్డులు అందుబాటులోకి రావడం వల్లే ఇది సాధ్యమైంది. రీ సర్వేకు ప్రోత్సాహకంగా వచ్చిన రూ.400 కోట్లు ఇతర అవసరాలకు ఖర్చు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం రీ సర్వేను మాత్రం వైఎస్ జగన్ ప్రభుత్వ తరహాలో విజయవంతంగా కొనసాగించలేకపోతోంది. -
గ్రామ సర్వేయర్లకు అగచాట్లు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో భూముల రీ సర్వేలో కీలకపాత్ర పోషించిన గ్రామ సర్వేయర్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తీవ్ర అగచాట్లు పడుతున్నారు. వారు చేయాల్సినవే కాకుండా అదనపు పనులు అప్పగిస్తూ ఇబ్బందులు పెడుతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మల్టిపుల్ పనులు చేసే జాబితాలో పెట్టడంతో గ్రామ సర్వేయర్లపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డుల శాఖలు పెత్తనం చేస్తున్నాయి. సర్వేయర్లపై సచివాలయ కార్యదర్శి, తహశీల్దార్, ఎంపీడీవో, మండల సర్వేయర్.. బాస్‌లుగా ఉన్నారు. ఈ నాలుగు శాఖల బాస్‌లు ఒకే సమయంలో వివిధ రకాల పనులను అప్పగిస్తున్నారు. ఏ పని చేయకపోయినా షోకాజ్ నోటీసులు, మెమోలతో హడలెత్తిస్తున్నారు. వాస్తవానికి సర్వేయర్లకు మాతృ శాఖ సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల శాఖ. వారి ప్రధాన పని భూముల రీ సర్వే చేయడమే. కానీ ఇప్పుడు ఆ పనితో పాటు పీ–4, హౌస్ హోల్డ్ తదితర సర్వేలు కూడా చేయిస్తున్నారు. ఒకే సమయంలో అన్ని పనులూ చేయాలని ఒత్తిడి చేస్తుండడంతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సర్వేయర్లు పనిచేయక తప్పడం లేదు. వారికి సంబంధించిన రీ సర్వే పని చేసినా.. ఆ తర్వాత రెవెన్యూ శాఖ చేయాల్సిన యాజమాన్య హక్కుల నిర్ధారణ (టైటిల్ కన్ఫర్మేషన్) పని కూడా వీరిపైనే పడుతోంది. రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడంతో పాత రికార్డుల్లో ఉన్న వివరాలతోనే 1బీ, అడంగల్ రికార్డులు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆ తప్పులన్నింటికీ సర్వేయర్లనే బాధ్యులుగా చేసి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే అనేక ఏళ్ల నుంచి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న తప్పులకు కూడా గ్రామ సర్వేయర్లనే బాధ్యులుగా చేస్తుండడంతో వారు లబోదిబోమంటున్నారు. ల్యాప్‌టాప్, ఇతరత్రా పరికరాలు ఇవ్వకుండానే పనులు చేయాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా.. ఉదయం సంబంధిత సచివాలయానికి వచ్చి బయోమెట్రిక్ హాజరు కచ్చితంగా వేయాలంటూనే.. మరోవైపు ఇతర ప్రాంతాల్లో పనులు అప్పగిస్తున్నారు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఇన్ని పనులు చేసినా పదోన్నతుల చానల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని పలువురు గ్రామ సర్వేయర్లు వాపోతున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దికరణలో 4,700 మందికి పైగా గ్రామ సర్వేయర్లను మిగులు సిబ్బందిగా చూపించారు. వారికి ఇతర శాఖల్లో బదిలీలకు ఆప్షన్ ఉన్నా.. అది కూడా అమలు చేయడం లేదు. -
Telangana: బోగస్ కృష్ణ‘పట్టా’!
తిరుమలగిరి (సాగర్) మండలంలోని గోడుమడకకు చెందిన ఈయన పేరు బారు శివయ్య. ఆయనకు చింతలపాలెం రెవెన్యూ శివార్లలోని సర్వే నంబర్ 14లో 4.30 గుంటల భూమి ఉంది. తాతల కాలం నుంచీ వారే ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. నేటికీ రికార్డుల్లో పేరు లేకపోవడంతో పట్టాదారు పాసుపుస్తకం అందలేదు. కానీ కొందరు ఈ భూమికి సంబంధించి అక్రమంగా పట్టాలను చేయించుకుని రైతుబంధు, రైతుబీమా పథకాలు పొందుతున్నారు. బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. భూమి తమ స్వాదీనం (కబ్జా)లో ఉన్నా.. తమకు పాస్ పుస్తకం లేక ప్రభుత్వ పథకాలు అందడం లేదని శివయ్య వాపోయారు...ఈయన ఒక్కరి భూమే కాదు. కేవలం ప్రైవేటు వ్యక్తుల అదీనంలోని స్థలాలే కాదు.. వేల ఎకరాల ప్రభుత్వ భూములను కూడా అక్రమార్కులు చెరబట్టారు. భూమిని ఏళ్లకేళ్లుగా సాగుచేసుకుంటున్నవారు పట్టాలు లేక, హక్కుల్లేక ప్రభుత్వ పథకాలకు దూరమైతే... కొందరు అవే భూములపై నకిలీ పట్టాలు సృష్టించి, ప్రభుత్వం నుంచి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల సొమ్మును కాజేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రభుత్వ భూములకే బోగస్ పట్టాలు సృష్టించేశారు. కృష్ణపట్టె ప్రాంతమైన నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలో తాజాగా బయటపడిన బాగోతమిది. అక్రమార్కులు ఈ మండలంలో 3,900 ఎకరాలకు బోగస్ పట్టాలు సృష్టించినట్టు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. తద్వారా ఏటా రూ.3.5 కోట్ల చొప్పున గత పదేళ్లలో రూ.35 కోట్లకుపైగా రైతుబంధు రూపంలోనే పొందినట్టు అధికారులు భావిస్తున్నారు. బోగస్ పట్టాలతో రైతుబీమా, బ్యాంకుల్లో రుణాలు పొందినట్టు తేల్చారు. సమీపంలోని దామరచర్ల మండలంలోనూ వేల ఎకరాల ప్రభుత్వ భూములు బోగస్ పట్టాలతో కబ్జా అయినట్టు రెవెన్యూ యంత్రాంగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ముడుపులకు అలవాటుపడిన అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ అక్రమాలు సాగాయని అంటున్నారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండసాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధరణి సమస్యలతో రైతులు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో పరిష్కార మార్గాలపై సర్కారు దృష్టి పెట్టింది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా లోని తిరుమలగిరి (సాగర్) మండలంలో నెలకొన్న పరిస్థితిని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ప్రభుత్వం తిరుమలగిరి (సాగర్) మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. భూముల సమస్య లపై విచారణ చేపట్టింది. అధికారులు ప్రాథమిక విచారణలోనే 3,900 ఎకరాలకు కొందరు బోగస్ పట్టాలు సృష్టించినట్టు గుర్తించారు. మండలంలోని చింతలపాలెం గ్రామంలోని 12, 222, 158, 162, 223 సర్వే నంబర్లలో, తిమ్మాయి పాలెం గ్రామంలోని 38, 39, 60, 70, 74 సర్వే నంబర్లలో అక్రమ పట్టాలు ఉన్నట్టు తేల్చారు. వీటితోపాటు తునికినూతల గ్రామంలో సర్వే నంబర్ 45, నెల్లికల్ గ్రామంలో 424 సర్వే నంబర్, జమ్మలకోట గ్రామంలో 28 సర్వేనంబర్లలో అక్రమంగా పట్టాలు పొందినట్టు గుర్తించారు. చింతలపాలెం, తిమ్మాయిపల్లి రెండు గ్రామాల్లోనే 2,800 ఎకరా లకు నకిలీ పట్టాలు సృష్టించినట్టు తేలడం గమనార్హం. ప్రభుత్వ భూములనూ బోగస్ పట్టాలతో చెరబట్టినట్టు గుర్తించారు. దీంతో ఈ అక్రమాలను పూర్తిస్థాయిలో నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 14 రెవెన్యూ, సర్వే బృందాల ఆధ్వర్యంలో 80 మందికిపైగా సిబ్బంది తో క్షేత్రస్థాయి సర్వేకు శ్రీకారం చుట్టింది. నకిలీ స్వాతంత్య్ర సమరయోధుల పేరిట పట్టాలు దామరచర్ల మండలంలోని సర్వే నంబర్లు 686, 691, 1100, 735, 655, 621, 690, 714తోపాటు మరో 33 సర్వే నంబర్లలో 4,542 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై కబ్జాదారు ల కన్ను పడింది. దీంతో భూబకాసురులకు.. స్వాతంత్య్ర సమరయోధులు గుర్తుకొచ్చారు. నకిలీ సమర యో ధులను సృష్టించి, తమ చేతివాటం ప్రదర్శించి, అధికారులను మచి్చక చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను దోచేశారు. వాటిపైనే ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది.60 ఏళ్లుగా సేద్యం చేస్తున్నా.. హక్కులు తొలగించారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మా గ్రామం ముంపునకు గురికావడంతో చిన్నాయిపా లెం తండాలో పునరావా సం కల్పించారు. 1962లో అప్పటి ప్రభుత్వం పట్టాలు అందజేసింది. 60 ఏళ్లుగా అక్కడే సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నాం. ధరణికి ముందు వరకు బ్యాంకులో రుణాలు పొందాం. 2016 భూప్రక్షాళన సమయంలో మా భూములను పార్ట్–బీలో చేర్చడంతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదు. అప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. బ్యాంకు రుణం తీసుకునే అవకాశం లేకుండాపోయింది. – రమావత్ హనుమ, చెన్నాయపాలెంమొత్తం రీసర్వే.. అక్రమ పట్టాల తొలగింపే లక్ష్యం తిరుమలగిరి సాగర్ మండలంలోని అన్ని భూములపై రీసర్వే చేస్తున్నాం. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. 100 ఎకరాల భూమి ఉంటే రికార్డుల్లో 200 ఎకరాలకు పేర్లు ఉన్నాయి. భూమి స్వా«దీనంలో ఉన్న వారి పేర్లు ధరణిలో లేవు. ధరణిలో పేర్లు ఉన్నవారి స్వాదీనంలో భూములు లేవు. ఎవాక్యూ ప్రాపర్టీని కబ్జా చేసి పట్టాలు సృష్టించారు. అటవీ భూముల హద్దుల సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ తేల్చి.. అర్హులకు పట్టాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఈ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మండలంలోని ప్రతి సర్వే నంబరులోనూ విస్తృత సర్వే చేస్తున్నాం. ఆ భూమి ఎవరిదని తేల్చి, నకిలీ పట్టాలను రద్దు చేసి.. కబ్జాలో ఉన్న అసలైన అర్హుల పేరిట పట్టాలు ఇచ్చి, న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాం. – నారాయణరెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ -
కేంద్రం మెచ్చిన భూ సర్వేపై చంద్రన్న విషం!
నిజం నిధానంగా తెలుస్తుందన్నది పెద్దలమాట. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన భూ సమగ్ర సర్వే వల్ల కలిగే ప్రయోజనం ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో సుస్పష్టమైంది. భూ సర్వేతో భూ వివాదాలకు పరిష్కారం లభించడంతో పాటు సర్వే పూర్తయిన రాష్ట్రాలు 50 ఏళ్ల పాటు సున్నావడ్డీ రుణాలు తీసుకునే వెసులబాటు ఉందన్నారు. ఈ ప్రకటనతో ఎన్నికల్లో భూ సర్వేపై నానాయాగీ చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు నోరు మెదపలేకపోతున్నారు. ల్యాండ్టైట్లింగ్ యాక్టును రద్దుచేసిన కూటమి ప్రభుత్వం భూ సర్వేపై యూటర్న్ తీసుకున్న తీరు ఇప్పుడు పల్లెల్లో చర్చనీయాంశంగా మారింది. నాటి ప్రభుత్వ కృషిని రైతన్నలు ప్రశంసిస్తున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రాల్లో భూ సంస్కరణలు, భూముల రీసర్వే, భూ రికార్డుల డిజిటలీకరణ అత్యావశ్యకమని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. భూముల సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు సున్నావడ్డీకి రుణాలిచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రతిపాదించారు. ప్రజలకు మేలు చేసేలా అదే సంస్కరణలను రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే.. విష ప్రచారం చేస్తూ, కూటమి నాయకులు అడ్డుకున్నారు. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన రోజునే భూసంస్కరణలకు తిలోదకాలిచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆమోదింపజేసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలనే అన్ని రాష్ట్రాలూ ఇప్పుడు అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేయడం గమనార్హం.దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపేలా..దశాబ్దాల భూసమస్యకు చెక్ పెట్టేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే ప్రక్రియను అమల్లోకి తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా రైతులు భూసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాతతండ్రుల కాలం నాటి రెవెన్యూ రికార్డుల్లో సరైన వివరాలు లేక, హద్దులు తెలియక వివాదాలు పడిన ఉదంతాలు అనేకం. ఈ నేపథ్యంలోనే గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం’ ద్వారా భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు. రీసర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితమైన రేఖాంశాలు, అక్షాంశాలు గుర్తించి హద్దులు నిర్ణయించారు. గ్రామాల సరిహద్దుల నుంచి నివాస ప్రాంతాల ఇళ్లు, ఖాళీ స్థలాల వరకు మొత్తం ఇమేజ్‌లతోపాటు హద్దులు పక్కాగా వచ్చేవి. దీనివల్ల కేంద్రం చెప్పినట్లు కొత్త డిజిటల్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి భూమికీ జియో కోఆర్డినేట్స్ హద్దులు ఏర్పర్చడం, ఐడీ నంబరు, క్యూఆర్ కోడ్ జారీ ద్వారా దేశంలో కొత్త భూవ్యవస్థను పరిచయం చేశారు. ప్రతి భూమికీ ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూహక్కు పత్రం, ప్రతి గ్రామానికీ రెవెన్యూ విలేజ్ మ్యాప్ అందించారు. కొన్ని వేల పట్టాలకు సబ్ డివిజన్లు చేశారు. భూముల హద్దులను నిర్ధారించి భూరక్ష సర్వే రాళ్లను ప్రభుత్వ ఖర్చుతో పాతించారు. మన రాష్ట్రంలో జరిగిన రీసర్వే దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం కూడా జై కొట్టింది. అలాంటి మంచి కార్యక్రమంపై చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారానికి దిగారు. రైతుల పాస్ పుస్తకాలపై నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రచారయావతో ఫొటోలు వేయించుకున్నారని, భూములన్నీ లాక్కొంటారని లేనిపోని భయాందోళనలు కలిగించారు.కోట్లాది రూపాయల ఖర్చు.. వేలాది మంది శ్రమమన్యం జిల్లాలోని 15 మండలాల్లో 965 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొదటి విడత 95, రెండో విడత 153 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారు. మూడో విడత 107 గ్రామాలు లక్ష్యంగా ప్రక్రియను ప్రారంభించారు. అది మధ్యలో ఉండగానే.. ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ముందుకు కదలలేదు. జిల్లాలో మొత్తం భూముల విస్తీర్ణం 5,78,016 ఎకరాలు కాగా.. 1,75,877 ఎకరాల్లో సర్వే పూర్తయింది. 557 గ్రామాల్లో డ్రోన్లను ఎగురవేశారు. రెండు విడతల్లో కలిపి 3,09,341 సర్వే రాళ్లను పాతారు. రీసర్వేలో రోవర్లను వినియోగించారు. సర్వే ఆఫ్ ఇండియా, గ్లోబల్ పొజిషన్ సిస్టం, డ్రోన్ టీం, హై ప్రిసన్ లెవెల్ బృందాలతోపాటు.. గ్రామ, మండల సర్వేయర్లు పని చేశారు. మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు కోట్లాది రూపాయలను వెచ్చించారు. ఇప్పుడు సర్వే ప్రక్రియను నిలిపివేయడంతో వందలాది మంది ఉద్యోగుల శ్రమ, కోట్లాది రూపాయల నిధులు వృథా అయ్యాయి.మొదటి నుంచి ఈ కార్యక్రమంపై గుర్రుగా ఉన్న కూటమి నాయకులు.. అధికారంలోకి రాగానే, దానిని నిలుపుచేస్తూ, అసెంబ్లీలో బిల్లుపెట్టి తమ వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కేవలం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మీద అక్కసుతోనే కూటమి నేతలు మోకాలడ్డారు. ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం సూచించడంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ ప్రజల్లో నడుస్తోంది.మంచి కార్యక్రమంభూముల రీసర్వే చాలా మంచి కార్యక్రమం. దశాబ్దాల నాటి భూసమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించాం. అది పూర్తయితే గ్రామాల్లో భూ సంబంధిత వివాదాలకు తావుండదు. ప్రజోపయోగకర కార్యక్రమాలను ఎవరు చేసినా హర్షించాలి. పార్టీలకతీతంగా స్వాగతించాలి. – బలగ మన్మథరావు, రైతు, పాలకొండ మండలం -
భూముల రీసర్వేకి కేంద్రం జై
సాక్షి, అమరావతి: రాష్ట్రాల్లో భూ సంస్కరణలు, భూముల రీ సర్వే, భూ రికార్డుల డిజిటలీకరణ అత్యావశ్యకమని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన రోజే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టింది. భూముల సంస్కరణలు అమలుచేసిన రాష్ట్రాలకే 50 ఏళ్లపాటు సున్నా వడ్డీకే రుణాలిచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించగా సరిగ్గా అదే సమయంలో భూ సంస్కరణలకు తిలోదకాలిచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం ఈ బిల్లు పెట్టడం విశేషం. రాజకీయ స్వార్థంతో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ఒక భూతంగా, భూముల రీ సర్వేను దారుణమైనదిగా ప్రచారం చేసి చంద్రబాబు కూటమి ఎన్నికల్లో లబ్ధిపొందింది. భూములు పోతాయని, లాగేసుకుంటారని భయపెట్టి ప్రజలకు ఎంతగానో మేలుచేసే కార్యక్రమంపై విషం కక్కారు. ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుచేస్తుండడమే కాకుండా నాలుగున్నరేళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా, దేశంలో ఎక్కడాలేని విధంగా జరిగిన భూముల రీ సర్వేను నిలిపివేశారు. కానీ, ఇప్పుడు అవే కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో జరగాలని కేంద్రం కుండబద్దలు కొట్టింది. వీటిని ఐదేళ్లలో చేసిన జగన్ ప్రభుత్వంకేంద్ర ఆర్థికమంత్రి తప్పనిసరిగా చేయాలని చెప్పిన ప్రతిపాదనలన్నింటినీ వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలోనే అమలుచేసింది. భూముల రీ సర్వే విజయవంతంగా జరగడంతోపాటు 6 వేల గ్రామాల్లో కేంద్రం చెప్పినట్లే కొత్త డిజిటల్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. అత్యంత ఆధునిక సర్వే టెక్నాలజీతో సర్వే నిర్వహించారు. ప్రతి భూమికీ జియో కోఆర్డినేట్స్ హద్దులు ఏర్పరచడం, ఐడీ నంబర్, క్యూఆర్ కోడ్ జారీ ద్వారా దేశంలో కొత్త భూ వ్యవస్థను పరిచయం చేశారు. ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూహక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ అందించారు. రీసర్వే పూర్తయిన తర్వాత కొత్త డిజిటల్ రికార్డులు రూపొందించే క్రమంలో 10 లక్షల పట్టాలకు సబ్ డివిజన్లు చేశారు. బడ్జెట్ ప్రసంగంలో సబ్ డివిజన్లు జరగాలని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. రీసర్వే చేసి 20 లక్షల మందికిపైగా రైతులకు భూ హక్కు పత్రాలు జారీచేశారు. గ్రామ కంఠాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వేచేసి ఇళ్ల యజమానులకు యాజమాన్య సర్టిఫికెట్లు జారీచేశారు. భూముల హద్దులను నిర్ధారించి భూరక్ష సర్వే రాళ్లను ప్రభుత్వ ఖర్చుతో పాతారు. రీ సర్వే కోసం ప్రత్యేకంగా 10,185 మంది గ్రామ సర్వేయర్లను నియమించారు. ఇందుకోసం మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగా గత ప్రభుత్వం ఖర్చుచేసింది. ఏపీలో జరిగిన రీ సర్వే దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. అలాంటి కార్యక్రమాన్ని కేవలం రాజకీయ స్వార్థం కోసం విజనరీగా చెప్పుకునే చంద్రబాబు రద్దుచేయడం రాష్ట్రానికి శాపమే. నిజానికి.. రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని అమలుచేసే ఉద్దేశం ఉంటే అనేక ప్రత్యామ్నాయాలు చూడొచ్చు. కానీ, జగన్ అమలుచేశారనే అక్కసుతో భూముల వ్యవస్థ స్వరూపాన్నే సమూలంగా మార్చివేసే రీసర్వేను నిలిపివేశారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దుచేస్తున్నారు. అయితే, ఇవన్నీ దేశమంతా జరగాలని కోరుకుంటూ కేంద్రం అందుకు తగ్గట్లుగా ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం విశేషం. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి చెప్పిందిదే..» పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూ సంబంధిత సంస్కరణలు అమలుచేసిన రాష్ట్రాలకు 50 ఏళ్ల వడ్డీలేని రుణాలను ప్రతిపాదించారు. » భూ పరిపాలన, ప్రణాళిక, నిర్వహణకు సంబంధించి కచ్చితమైన చర్యలుండాలని స్పష్టంచేశారు. » గ్రామీణ ప్రాంతాల్లో యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్–యూఎల్ పిన్ ఉండాలని, అన్ని భూములకు భూ ఆధార్ ఉండాలని, సర్వే సబ్ డివిజన్లు జరగాలని, భూ యాజమాన్యాన్ని కచ్చితంగా నిర్ధారించేలా సర్వే జరగాలని, ల్యాండ్ రిజిస్టర్లు రూపొందించాలని, వాటిని రైతుల రిజిస్టర్లతో లింకుచేయాలని చెప్పారు. » అర్బన్ ల్యాండ్ రికార్డులను జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా డిజిటలైజేషన్ చేయాలని చెప్పారు. » ఇవన్నీ చేసిన రాష్ట్రాలకే వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. -
సీఎం జగన్ నూజివీడు పర్యటన.. భూముల పట్టాలు పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంక్షలు, వివాదాల్లో ఇరుక్కుపోయిన భూముల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా మరో కీలక ముందడుగు వేస్తున్నారు. భూములకు సంబంధించి కొద్ది నెలలుగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను అమల్లోకి తెస్తూ శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. దళితులు, పేదల జీవితాలు పూర్తిగా మారిపోయే అత్యంత కీలకమైన 12 అంశాలు ఇందులో ఉన్నాయి. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలతోపాటు చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, దళిత వాడలకు శ్మశాన వాటికలు కేటాయిస్తూ పత్రాలు ఇవ్వడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించనున్నారు. 46 వేల ఎకరాలకుపైగా పంపిణీ రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత భూముల పంపిణీని ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా మెరుగైన స్థితికి చేర్చడమే లక్ష్యంగా భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలుగా ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇప్పటికే పంపిణీకి అసైన్మెంట్ కమిటీల ఆమోదం తీసుకున్నారు. డీకేటీ పట్టాలతోపాటు ఎఫ్ఎంబీ, అడంగల్ కాపీలు కూడా జారీ అయ్యాయి. వాటిని అర్హులకు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. లంక భూములకు పట్టాలు దశాబ్దాల నాటి లంక భూముల సమస్యను పరిష్కరించి అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వనున్నారు. ఏళ్ల తరబడి వీటిని సాగు చేసుకుంటున్నా పత్రాలు లేకపోవడంతో రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా లాంటి ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. ఎనిమిది జిల్లాల్లో విస్తరించిన లంక గ్రామాల్లోని 9,064 ఎకరాలు 17,768 మంది రైతుల సాగులో ఉన్నట్లు ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా గుర్తించారు. ఏ, బీ కేటగిరీ లంక భూములకు డీకేటీ పట్టాలతోపాటు సీ కేటగిరీ భూములకు లీజు పట్టాల పంపిణీని సీఎం ప్రారంభించనున్నారు. సర్వీస్ ఈనాం భూములపై ఆంక్షల తొలగింపు ఏళ్ల తరబడి గ్రామాల్లో వివాదాస్పదంగా ఉన్న సర్వీస్ ఈనాం భూముల సమస్యను సైతం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పరిష్కరించింది. 1,61,584 మంది రైతులకు సంబంధించి 1,58,113 ఎకరాలను నిషేదిత జాబితా నుంచి తొలగించారు. గతంలో ఈనాం చట్టం ప్రకారం దేవదాయ భూములను 22 ఏ జాబితాలో పొందుపరచినప్పుడు కుల వృత్తులు చేసుకునే వారికిచ్చిన సర్వీస్ ఈనాం భూములు కూడా పొరపాటున అందులో చేరిపోయాయి. అప్పటి నుంచి వాటిపై ఆంక్షలు తొలగించకపోవడంతో లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కుమ్మరి, కమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణులు తదితర వృత్తుల వారికి కేటాయించిన సర్వీస్ ఈనాం భూములపై ఆంక్షలు తొలగిపోయాయి. దళిత వాడలకు శ్మశాన వాటికలు శ్మశాన వాటికలు లేని దళిత వాడలు ఉండరాదనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని శ్మశాన వాటికల కోసం కేటాయించారు. ఈ భూమిని ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగించారు. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి గత సర్కారు తప్పిదాలతో వివాదాస్పదంగా మారిన చుక్కల భూముల సమస్యను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. ఒకేసారి 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. తద్వారా సంబంధిత రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభించాయి. ఈ సమస్య పరిష్కారంతో చాలా ఏళ్లుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. పంట రుణాలు కూడా వస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో లక్షల ఎకరాల భూములకు విముక్తి కల్పించడం ఇదే తొలిసారి. వాటిని రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు కల్పించడంతోపాటు రుణాలు పొందేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. షరతుల పట్టా భూముల సమస్యకు పరిష్కారం సమస్యాత్మకంగా మారిన షరతుల గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతుల గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి రైతులకు మేలు చేకూర్చింది. బ్రిటీష్ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను టీడీపీ పాలనలో 22 ఏ కేటగిరీలో చేర్చారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దుతూ నిబంధనల ప్రకారమే వాటిని ఆ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. 17,730 సర్వే నెంబర్లకు సంబంధించి 33 వేలకుపైగా ఎకరాలను 22ఏ జాబితా నుంచి తీసివేసింది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తొలగించడం గమనార్హం. భూమి కొనుగోలు పథకం భూములకు హక్కులు భూమి లేని నిరుపేద దళితులకు భూమి కొనుగోలు పథకం ద్వారా ఇచ్చిన భూములపైనా అమలులో ఉన్న ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. ఆ భూములు ఎస్సీ కార్పొరేషన్ తనఖాలో ఉండడంతో వాటిని నిషేధిత జాబితాలో చేర్చారు. దీనికి సంబంధించి 22,837 ఎకరాలకు ఇప్పుడు విముక్తి లభించడంతో 22,346 మంది దళితులకు మేలు జరిగింది. సీఎం వైఎస్ జగన్ ఈ సమస్య తన దృష్టికి రాగానే సత్వరమే పరిష్కరించారు. అసైన్డ్ భూములపై హక్కులు రాష్ట్రంలో తొలిసారిగా అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు వాటిని 22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్నారు. భూములున్నా వాటికి విలువ లేకుండాపోవడంతో హక్కులు కల్పించాలని దీర్ఘకాలంగా దళిత, పేద రైతులు కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విస్తృత అధ్యయనం, ఇతర రాష్ట్రాల్లో విధానాలపై ప్రజాప్రతినిధుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అసైన్మెంట్ జరిగి 20 ఏళ్లు పైబడిన భూములపై పేదలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు చట్ట సవరణ చేసింది. ఒరిజినల్‌గా భూముల పొందిన రైతులకు హక్కులు ఇవ్వాలని నిర్ణయించి అమలు చేయడం ప్రారంభించింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 15,21,160 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద రైతులు తమకు అసైన్ అయిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు పొందనున్నారు. ఆ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించారు. నేడు నూజివీడుకు సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారీ భూ పంపిణీ కార్యక్రమానికి నేడు నూజివీడు వేదికగా సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించనున్నారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేయనున్నారు. శుక్రవారం సీఎం జగన్ నూజివీడు రాక సందర్భంగా హెలీప్యాడ్, బహిరంగ సభ వద్ద భద్రతా ఏర్పాట్లను ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు, కలెక్టర్ వై.ప్రసన్న వెంకటేష్, ఎస్పీ డి.మేరిప్రశాంతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం పర్యటన ఇలా.. ► ఉదయం 10.25 గంటలకు నూజివీడులోని హెలీప్యాడ్‌కు చేరుకుని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో మాట్లాడతారు. ► 10.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ► 11.10 నుంచి 12.25 గంటల వరకు భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పట్టాలు పంపిణీ చేసి సభలో ప్రసంగిస్తారు. ► 12.50 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని స్థానిక నాయకులు, ప్రజలను కలుసుకుంటారు. అనంతరం 1.55 గంటలకు తాడేపల్లి పయనం కానున్నారు. గోడు విన్నారు.. పోడు భూములిచ్చారు సాక్షి, అమరావతి: గిరిజనుల గోడును ఆలకించి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోడు భూములకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం(ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్) ద్వారా పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు. గిరిజనులకు పోడు భూముల పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా నిలిపారు. 2008 నుంచి 2019 వరకు గత ప్రభుత్వాలు 95,649 గిరిజన కుటుంబాలకు 2,33,410 ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చాయి. వీటిల్లో గత పదకొండేళ్లలో ఇచ్చిన మొత్తం పట్టాల్లో అత్యదికంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంపిణీ చేసినవే కావడం గమనార్హం. వాస్తవానికి పోడు భూములకు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్సారే. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత నాలుగున్నరేళ్లలో ఏకంగా మొత్తం 1,30,368 కుటుంబాలకు 2,87,710 ఎకరాలకు పట్టాలిచ్చి పేదలకు మేలు చేయడంలో తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని నిరూపించుకున్నారు. వీటిలో 1,29,842 మందికి 2,19,763 ఎకరాలు, 526 సామూహిక(కమ్యూనిటీ) టైటిల్స్ ద్వారా 67,947 ఎకరాల పోడు భూములకు పట్టాలుగా పంపిణీ చేయడం విశేషం. డీకేటీ పట్టాల పంపిణీ.. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని (రిజర్వ్ ఫారెస్ట్ కాని భూమి) వారు సాగు చేసుకొని జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం డీకేటీ పట్టాల రూపంలో పంపిణీ చేస్తుంది. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఈ కార్యక్రమం ద్వారా 26,287 మంది గిరిజనులకు 39,272 ఎకరాల భూమిని పంపిణీ చేయడం గమనార్హం. పునర్విచారణతో లబ్ధి అడవులు, గ్రామ పొలిమేర (సరిహద్దు) భూములు తదితర కారణాలతో గత ప్రభుత్వాల హయాంలో 73,469 మంది గిరిజనుల దరఖాస్తులను తిరస్కరించారు. తమకు పట్టాలివ్వాలని గిరిజనులు గోడు వెళ్లబోసుకోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పునర్విచారణ చేసి పట్టాలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో సుమారు 25,380 దరఖాస్తులపై పునర్విచారణ జరిపి 40,930 ఎకరాలను పట్టాలుగా ఇచ్చారు. గతంలో తిరస్కరణకు గురైన పోలవరం ముంపు గ్రామాలకు చెందిన దరఖాస్తులను సైతం పునఃపరిశీలించి 2,372 గిరిజన కుటుంబాలకు 6,407 ఎకరాలను పోడు వ్యవసాయం కోసం పట్టాలుగా ఇచ్చారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై పునర్విచారణ జరిపి అర్హత ఉన్న వారికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడం గమనార్హం. పెద్దమనసు చాటుకున్న జగన్ అటవీ భూములకు హక్కు పత్రాల పంపిణీలో మన రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 2005 డిసెంబర్ 13కు ముందు సాగులో ఉన్న అటవీ భూమిపై మాత్రమే పోడు భూమి హక్కులను గుర్తించేలా చట్టం ఉంది. పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టిన 2008 జనవరి 1 నుంచి ఆ చట్టాన్ని పొడిగించాలని, దానివల్ల ఎక్కువ మంది గిరిజనులకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం జగన్ లేఖ రాశారు. ఇది పేద గిరిజనులపై సీఎం జగన్‌కు ఉన్న ప్రేమ, పెద్దమనసుకు నిదర్శనం. ఏజెన్సీ ప్రాంతంలో పట్టా భూములు, సొంత భూముల సాగులో గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో 3,40,043 మంది గిరిజన రైతులకు రైతు భరోసా పథకం ద్వారా సుమారు రూ.484.02 కోట్లు వారి ఖాతాలకే జమ చేసి అండగా నిలిచారు. రైతు భరోసా అందుకునే గిరిజన రైతుల సంఖ్య 2019–20లో 2,82,871 మంది కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 3,40,043కు పెరిగింది. ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చాలన్నదే సీఎం జగన్ ఉద్దేశం. –పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి రీ సర్వే మహాయజ్ఞం రాష్ట్రంలో వివాదరహితంగా భూ యాజమాన్య హక్కులు, క్లియర్ టైటిలింగ్ వ్యవస్థ అమలు కోసం నిర్వహిస్తున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం విజయవంతంగా అమలు జరుగుతోంది. దీనిద్వారా ప్రభుత్వ హామీతో శాశ్వత ఆస్తి హక్కు పత్రాన్ని భూ యజమానికి ఇస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం 10,185 మంది గ్రామ సర్వేయర్లు, 2688 మంది వీఆర్ఓలు, 5417 మంది పంచాయతీ కార్యదర్శులు, 3786 మంది ప్లానింగ్ కార్యదర్శులు, 679 మంది మొబైలు మేజిస్ట్రేట్ల సేవలను ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో నాలుగు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తయింది. ఆయా గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. 42.6 లక్షల ఎకరాల భూముల రీ సర్వే పూర్తి కాగా 4.8 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. సరిహద్దు వివాదాలకు సంబంధించి 45 వేల కేసులను పరిష్కరించారు. 17.53 లక్షల భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. భూముల సరిహద్దులు గుర్తిస్తూ 49.04 లక్షల రాళ్లు పాతారు. మూడో విడతలో మరో 2 వేల గ్రామాల్లో సర్వేను వచ్చే ఏడాది జనవరి 31కి పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. -
భూముల రీ సర్వేకు జాతీయ స్థాయిలో ప్రశంసలు
-
ఏపీలో ముమ్మరంగా భూముల రీ సర్వే
-
సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఎం నంబర్లు
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేతో రాష్ట్రంలోని భూమి రికార్డుల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లు కనుమరుగై, వాటి స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎ) నంబర్లు రానున్నాయి. ఇప్పటికే సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో ఎల్పీఎం నంబర్లతోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు కూడా కొత్త నంబర్లతోనే జరగనున్నాయి. బ్రిటిష్ కాలంలో భూములను సర్వే చేసి ఇచ్చిన నంబర్లే ఇప్పటికీ రికార్డుల్లో ఉన్నాయి. ఒక సర్వే నంబరులో 2 నుంచి 10 అంతకంటె ఎక్కువ మంది భూయజమానులు ఉన్నారు. ఒక సర్వే నంబరులో 30 ఎకరాల భూమి ఉంటే అందులో 10, 15 మంది పేర్లు కూడా ఉన్నాయి. దీనివల్ల లెక్కలేనన్ని భూ సమస్యలు, వివాదాలు ఏర్పడ్డాయి. భూముల రీ సర్వే ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపింది. ప్రతి భూ కమతానికి ఎల్పీఎం నంబరు, ప్రతి యజమానికి ఆధార్ తరహాలో ఒక ఐడీ నంబరు ఇస్తోంది. మారనున్న 1.96 కోట్ల సర్వే నంబర్లు రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు, వాటి పరిధిలో 90 లక్షల మంది పట్టాదారులు (భూ యజమానులు) ఉన్నారు. ఈ పట్టాదారులకు చెందిన 2.26 కోట్ల ఎకరాల భూమి 1.96 కోట్ల సర్వే నంబర్లుగా రికార్డుల్లో విభజించి ఉంది. రీ సర్వేలో ఈ మొత్తం విస్తీర్ణాన్ని డ్రోన్, ఏరియల్ సర్వే, అవి చేయలేని చోట డీజీపీఎస్ సర్వే ద్వారా కొలుస్తున్నారు. కొలిచిన తర్వాత ప్రతి ల్యాండ్ పార్సిల్‌కు ఎల్పీఎం నంబరు, ఆధార్ మాదిరిగానే భూదార్ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్య, జియో కోఆర్డినేట్స్‌ను ప్రభుత్వం కేటాయిస్తోంది. సర్వే అనంతరం ప్రతి రైతుకి ప్రభుత్వం ఇచ్చే భూ హక్కుపత్రంలో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్, యజమాని ఫొటో, క్యూఆర్ కోడ్ ఉంటాయి. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ రైతుకు సంబంధించిన భూమి కొలతలు, భూ విస్తీర్ణం వంటి వివరాలన్నీ కనపడతాయి. ఈ ఎల్ï³ఎం నంబర్ల ప్రకారమే క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్లు జరుగుతాయి. దీనివల్ల మోసపూరిత రిజిస్ట్రేషన్లకు, రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. వెబ్‌ల్యాండ్–2లో ఎల్పీఎం నంబర్లు రీ సర్వే ద్వారా కొత్తగా తయారు చేస్తున్న డిజిటల్ రెవెన్యూ రికార్డుల్లో ఇకపై ఎల్పీఎం నంబర్లే ఉంటాయి. సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులన్నీ ఇప్పటికే ఎల్పీఎం నంబర్లతో అప్డేట్ చేశారు. ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు వీటి ద్వారానే నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖ రీ సర్వే పూర్తయిన గ్రామాల వివరాలతో ఇప్పటికే వెబ్‌ల్యాండ్–2 ఆన్లైన్ పోర్టల్‌ను అందబాటులోకి తెచ్చింది. ఆ రికార్డుల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. సర్వే పూర్తయ్యే గ్రామాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఆ గ్రామాల్లో ఎల్పీఎం ఆధారిత రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో మరో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తవుతోంది. ఆ గ్రామాలను కూడా వెబ్‌ల్యాండ్–2కి మార్చనున్నారు. ఇలా విడతల వారీగా రాష్ట్రమంతా వెబ్‌ల్యాండ్–2కి మారిపోతుంది. భవిష్యత్తులో ఎల్పీఎం నంబర్ల ద్వారానే భూముల్ని గుర్తిస్తారు. -
4 వేల గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి
సాక్షి, అమరావతి: భూముల రీసర్వేలో రాష్ట్ర ప్రభుత్వం మరో మైలు రాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయింది. ఈ గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు నెంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీచేయడంతో అక్కడ కొత్త రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు దేశంలోని ఏ గ్రామంలోనూ పూర్తిస్థాయి రీ సర్వే జరగలేదు. ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లోని గ్రామాలు, పట్టణాల్లో బ్రిటీష్ వాళ్లు రూపొందించిన రెవెన్యూ రికార్డులే ఉన్నాయి. తొలిసారిగా మన రాష్ట్రంలోనే నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తవడంతో అక్కడ డిజిటల్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త రికార్డుల ఆధారంగానే ఇకపై భూముల వ్యవహారాలు జరగనున్నాయి. రీసర్వేలో భాగంగా ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్‌లు (గ్రామాల ఫొటోలు) తయారుచేయడానికి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్న తొలి రాష్ట్రం కూడా మనదే. 2020 డిసెంబర్లో ప్రాజెక్టు ప్రారంభం పూర్వపు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని 2020 డిసెంబర్ 21న ప్రారంభించారు. ఆ తర్వాత కరోనా రావడంతో కొంత ఆలస్యమైనా ఆ తర్వాత శరవేగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్లు, రోవర్ల వంటి అత్యాధునిక సర్వే టెక్నాలజీలను ఉపయోగించి దాదాపు వందేళ్ల తర్వాత సమగ్ర రీ సర్వేను చేపట్టారు. సర్వే తర్వాత రైతులకు భూ హక్కు పత్రాలివ్వడం.. ఆ భూములకు భద్రత నిర్ధారించడం, భూ రక్ష సర్వే రాళ్లు నాటడం ద్వారా సరిహద్దు భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. భూరక్ష సర్వే రాళ్ల ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రీ సర్వే వల్ల ప్రయోజనాలు.. ► సర్వే తర్వాత భూముల రికార్డులను 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో కొలిచి తయారుచేస్తారు. ► భూ యజమానులకు భూ కమత పటం, గ్రామ పటం, భూ హక్కు పత్రం వంటి రికార్డులను జీపీఎస్ కో–ఆర్డినేట్లు, ఐడీ నెంబర్, క్యూఆర్ కోడ్‌తో ఇస్తారు. ► గ్రామంలోని స్థలాలు, అర్బన్ ప్రాంతాల్లోని భూములను కూడా మొదటిసారి సర్వేచేసి యజమానులకు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు కూడా జారీచేస్తున్నారు. ► భూమి రికార్డులు ట్యాంపరింగ్‌కి అవకాశం ఉండదు. భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డులో ఏ మార్పులు జరిగే అవకాశం ఉండదు. డబుల్ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉండదు. ► గ్రామ సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు భూమి రికార్డులు అప్డేట్ అవుతాయి. ► రిజిస్ట్రేషన్‌కు ముందే మ్యుటేషన్, పట్టా సబ్ డివిజన్ జరుగుతుంది. ► రీ సర్వేకు హాజరుకాలేని వారికి వాట్సాప్ వీడియో కాల్, జూమ్ ఇతర వీడియో ఇంటరాక్టివ్ టెక్నాలజీల ద్వారా రీసర్వే బృందాలు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నాయి. భూ సంబంధిత సేవలన్నీ ఏకీకృతమయ్యాయి రీ సర్వే విజయవంతంగా జరుగుతోంది. భూమికి సంబంధించిన అన్ని సేవలు ఏకీకృతమై ఒకే డెస్క్ వ్యవస్థలోకి వస్తున్నాయి. గ్రామ సచివాలయంలో సమీకృత సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలను దేశంలోనే మొదటిసారి అందిస్తున్నాం. మన రీ సర్వే ప్రాజెక్టు అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మన అధికారులతో ఇతర రాష్ట్రాల్లో రీసర్వే శిక్షణలు ఏర్పాటుచేస్తోంది. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే, సెటిల్మెంట్ శాఖ -
రెండోదశ రీ సర్వే గ్రామాల్లో 2.69 లక్షల మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో క్లిష్టతరమైన అంశాలు కూడా తేలిగ్గా పరిష్కారమవుతున్నాయి. రెవెన్యూ వ్యవస్థలో తమ భూములకు సంబంధించి మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు చేయించుకోవడం ఎంత కష్టమైన వ్యవహారమో అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ పనుల్ని చాలా సులభతరంగా మార్చింది. రీ సర్వేలో రైతులు అడగకుండానే అవసరమైతే మ్యుటేషన్, సబ్ డివిజన్ చేస్తున్నారు. అలా ఇప్పటివరకు రెండేళ్లలో లక్షల సంఖ్యలో మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు జరిగాయి. ప్రస్తుతం రెండోదశగా రెండువేల గ్రామాల్లో రీ సర్వే జరుగుతున్న క్రమంలో 2.69 లక్షల మ్యుటేషన్లు, 4.4 లక్షల సబ్ డివిజన్లు చేశారు. తొలిదశ రీ సర్వే పూర్తయిన రెండువేల గ్రామాల్లో గతంలోనే రెండులక్షల మ్యుటేషన్లు, 4.3 లక్షల సబ్ డివిజన్లు చేశారు. మొత్తం ఈ నాలుగువేల గ్రామాల్లో ఇప్పటివరకు 4.69 లక్షల మ్యుటేషన్లు, 8.7 లక్షల సబ్ డివిజన్లు చేయడం గమనార్హం. అదే రైతులు చేయించుకుంటే రూ.80 కోట్లు కట్టాలి మామూలుగా అయితే పట్టా సబ్ డివిజ న్, మ్యుటేషన్ కోసం రైతులు దరఖాస్తు చేసుకుని ఫీజు కట్టాలి. సబ్ డివిజన్‌కి రూ.600, మ్యుటేషన్‌కి రూ.100 చెల్లించాలి. దానికి గతంలో ఎక్కువ సమయం పట్టేది. దాంతోపాటు అనేక సమస్యలు. తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సివచ్చేది. మధ్యలో లంచావతారులు. ఇప్పుడు రీ సర్వేలో ఇవేమీ లేకుండానే ప్రభుత్వం రైతుల భూమిని కొలిచి వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వడం, డిజిటల్ రికార్డులు రూపొందించడంతోపాటు అవసరమైతే సొంత ఖర్చులతో మ్యుటేషన్, సబ్ డివిజన్లు కూడా చేసేస్తోంది. నాలుగువేల గ్రామాల్లో చేసిన మ్యుటేషన్లు, సబ్ డివిజన్లకు రైతులు ఫీజు చెల్లిస్తే.. రూ.80 కోట్లకుపైనే కట్టాలి. కానీ ప్రభుత్వమే ఉచితంగా చేసి రైతులకు వాటిని బహుమానంగా ఇస్తోంది. అది కూడా రికార్డు సమయంలో లక్షల మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు పూర్తిచేస్తోంది. రెండేళ్లలో ఇన్ని లక్షల మ్యుటేషన్లు జరగడం సాధారణ విషయం కాదని నిపుణులు సైతం చెబుతున్నారు. -
శరవేగంగా భూముల రీ సర్వే.. దేశంలోనే ప్రప్రథమంగా డిజిటల్ రికార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే శరవేగంగా జరుగుతోంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పటికే అనేక మైలురాళ్లు అధిగమించింది. తొలి దశలో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, దేశంలోనే ప్రప్రథమంగా ఆ గ్రామాలకు డిజిటల్ రికార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఒక్క గ్రామంలో కూడా భూముల రీ సర్వే పూర్తి చేయలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ బ్రిటిష్ కాలం నాటి భూమి రికార్డులే ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి. వాటి ఆధారంగానే భూముల కార్యకలాపాలు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి కొత్త భూముల రికార్డులను డిజిటల్ రూపంలో తయారు చేసింది. ఆ గ్రామాల్లోనే గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రైతుల భూముల హద్దులను అక్షాంశ, రేఖాంశాలతో సహా ఎవరూ అక్రమ పద్ధతుల్లో మార్చలేని విధంగా నిర్ధారించింది. ప్రతి భూ కమతానికి ఒక విశిష్ట సంఖ్యను కూడా కేటాయించింది. ఏపీలో రూపొందుతున్న డిజిటల్ భూ రికార్డులు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు సైతం మోడల్‌గా నిలిచాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు మన మోడల్‌పై అధ్యయనం చేశాయి. రీ సర్వే ఎలా చేయాలనే అంశంపై ఏపీ సర్వే అధికారులతో ఆ రాష్ట్రాల అధికారులకు శిక్షణ కూడా ఇప్పిస్తున్నాయి. ఉత్తరాఖండ్, పాండిచ్చేరిలో ఈ శిక్షణ తరగతులు జరగ్గా, మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో ఉన్నాయి. క్షేత్ర స్థాయి నిజనిర్ధారణలోనూ దూకుడు ఇప్పటివరకు అందిన ఓఆర్ఐలతో క్షేత్రస్థాయి నిజ నిర్ధారణను వేగంగా చేపడుతున్నారు. రైతులు చూపించే వాస్తవ సరిహద్దులను డ్రోన్ చిత్రాలతో పోల్చి చూసే అతి ముఖ్యమైన నిజనిర్ధారణ 4,283 గ్రామాల్లో 57 లక్షలకుపైగా ఎకరాల్లో పూర్తయింది. దీంతో ఆయా గ్రామాల్లోని భూముల కమతాలకు సర్వే నంబర్లకు బదులుగా ఇచ్చే ల్యాండ్ పార్సిల్ మ్యాప్(ఎల్పీఎం)లు 43.42 లక్షలు జారీ చేశారు. మిగిలిన 2,246 గ్రామాల్లో నిజనిర్ధారణ జరుగుతోంది. ఆ తర్వాత మరోసారి రైతుల సమక్షంలో జరిగే గ్రౌండ్ వాలిడేషన్ (క్షేత్ర స్థాయి ధ్రువీకరణ) 3,428 గ్రామాల్లో (37.39 లక్షల ఎకరాలు) పూర్తవగా 855 గ్రామాల్లో జరుగుతోంది. ఇప్పటివరకు 3,092 గ్రామాల్లో (28.33 లక్షల ఎకరాలు) సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ లెక్కలనుబట్టి రీ సర్వే ఎంత శాస్త్రీయంగా, పక్కాగా వేగంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. 1.08 లక్షల చదరపు కిలోమీటర్లలో డ్రోన్, ఏరియల్ సర్వే పూర్తి రాష్ట్రంలో అత్యంత ఆధునిక పద్ధతుల్లో రీ సర్వే జరుగుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన డ్రోన్, ఏరియల్ సర్వేలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కొలవాల్సివుండగా 1.08 లక్షల చదరపు కిలోమీటర్లను ఈ సర్వే ద్వారా ప్రభుత్వం కొలిచింది. 17,460 గ్రామాలకుగాను 12,230 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. ఈ గ్రామాల్లో డ్రోన్లు, విమానాల ద్వారా 1.8 కోట్ల ఎకరాల కొలతలను పూర్తి చేశారు. అతి త్వరలో మిగిలిన గ్రామాల్లోనూ ఈ సర్వే పూర్తికానుంది. డ్రోన్, ఏరియల్ సర్వే ద్వారా తీసిన చిత్రాలను అభివృద్ధి చేసి 6,529 గ్రామాల ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ (ఓఆర్ఐ) లను సర్వే బృందాలకు అందించారు. మిగిలిన గ్రామాల ఓఆర్‌ఐలను నిర్ణీత సమయంలో సర్వే బృందాలకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. -
Andhra Pradesh:భూ చిక్కుముడులకు చెక్
22(ఏ) చెర నుంచి విముక్తి గుంటూరు జిల్లా కుర్నూతల గ్రామంలోని జాస్తి వీరయ్య, ఆయన ఇద్దరు సోదరులు, చెల్లెళ్లకు కలిపి సర్వే నంబర్ 159లో 6.60 ఎకరాల భూమి ఉంది. ఆయన సోదరి.. తన కుమార్తె పెళ్లికి కొంత భూమిని పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నిస్తే కాలేదు. 2016 నుంచి దానిపై వారు పోరాడుతూనే ఉన్నారు. ఈ పొలం రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆ కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రీ సర్వే మొదలైంది. సర్వే నంబర్ 159లోని మొత్తం 25.69 ఎకరాలు 19 మంది రైతుల పేరు మీద ఉంది. అందులో ముగ్గురు రైతులకు చెందిన 3.25 ఎకరాలను 2016లో దేవదాయ శాఖ తన భూమిగా పేర్కొంది. దీంతో ఆ సర్వే నంబర్ మొత్తాన్ని 22 (ఏ)1 (సి)లో నమోదు చేయడంతో మిగిలిన 16 మంది రైతుల భూమి కూడా వివాదంగా మారింది. ఇప్పుడు రీ సర్వేలో సబ్ డివిజన్ ద్వారా 16 మంది రైతులకు, దేవదాయ శాఖగా చెప్పిన భూమికి ప్రత్యేకంగా ఎల్పీఎం నంబర్లు రావడంతో సమస్య పరిష్కారమైంది. ప్రతి గ్రామంలో నిత్యం భూ తగాదాలు.. ఏ కోర్టుకు వెళ్లినా దాదాపు సగం కేసులు భూ సమస్యలే. భూ పంపకాలు చేసుకోవాలన్నా, పిల్లల పెళ్లిళ్లు.. చదువుల కోసం విక్రయించాలన్నా, తుదకు దానమివ్వాలన్నా కూడా సమస్యే. ఈ సమస్యలన్నింటికీ ఒకే సమాధానం భూముల రీ సర్వే. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో జరిగింది. ఆ తర్వాత దేశంలోనే ఎవరూ అంత ధైర్యం చేయలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ ఎంతో దూర దృష్టితో ఆలోచించి ఈ సాహసానికి పూనుకున్నారు. ఒక్క కలం పోటుతో రీ సర్వేకు ఆదేశించారు. వెరసి లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరిస్తూ వారి రాతలు తిరగరాస్తున్నారు. బొల్లికొండ ఫణికుమార్, సాక్షి ప్రతినిధి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేతో లక్షల సంఖ్యలో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు, నిషేధిత ఆస్తులు, వారసత్వ అంశాలు వంటి ఎన్నో చిక్కు ముడులను విప్పుతూ రీ సర్వే సమాధానం చూపుతోంది. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని వందలాది పనులను రీ సర్వే బృందాలు ప్రతి గ్రామంలో కొలిక్కి తెస్తున్నాయి. రీ సర్వే జరిగిన తీరు, రైతులకు కలిగిన ప్రయోజనాలను ‘సాక్షి’ బృందం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల, గారపాడు, యామర్రు, అనంతవరప్పాడు గ్రామాల్లో ప్రత్యక్షంగా పరిశీలించింది. ప్రతిచోటా భూ వివాదాలు, సమస్యలు పరిష్కారమైనట్లు స్పష్టమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పేరుతో జరుగుతున్న రీ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాల్లో పూర్తయింది. ఆ గ్రామాల్లో తాజా వివరాలతో డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి భూ కమతాన్ని కొలిచి అక్షాంశ, రేఖాంశాలతో హద్దులు నిర్ణయించారు. ఆ హద్దుల్లో ప్రభుత్వ ఖర్చులతోనే సర్వే రాళ్లు పాతారు. ప్రతి రైతుకు భూ హక్కు పత్రం ఇచ్చారు. వారి భూ కమతానికి సంబంధించి ఆధార్ మాదిరిగా ఒక విశిష్ట సంఖ్య (యునిక్ కోడ్) కేటాయించారు. పట్టాదార్ పాస్ పుస్తకంలోనే క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని స్కాన్ చేసి భూమి వివరాలను ఎప్పుడైనా చూసుకునే అవకాశం కల్పించారు. ఇవన్నీ చేయడానికి ముందే రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేశారు. సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో ప్రయోజనాలు ► 2 వేల గ్రామాల తుది ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్)లు సిద్ధం ► 7.8 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు జారీ ► హద్దుల్లో 25.8 లక్షల సర్వే రాళ్లు పాతారు ► 2 లక్షల మ్యుటేషన్లు, 4.3 లక్షల సర్వే సబ్ డివిజన్లు చేయడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం ► 1.08 లక్షల మంది రైతుల పేర్లు తొలిసారి రికార్డుల్లోకి ఎక్కాయి ► 2 వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ► 4 లక్షలకుపైగా సరిహద్దు వివాదాలు పరిష్కారం ► 18.3 లక్షల ల్యాండ్ పార్సిల్ మ్యాప్స్ (ఎల్పీఎం) జారీ.. (సర్వే నంబర్లు) ల్యాండ్ కన్వర్షన్ సమస్యకు పరిష్కారం కుర్నూతల గ్రామానికి చెందిన దూపాటి శివనాగేంద్రం దంపతులకు సర్వే నంబర్ 151, 152లో 4 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయ భూమిగా ఉన్న వారి భూమిని వ్యవసాయేతర భూమిగా (గజాల్లో) నమోదు చేయడంతో ఆ భూమి విలువ ఉన్న దాని కంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అదే సర్వే నంబర్లో ఉన్న మరో రైతు తన అవసరాల కోసం తన వాటా భూమిని వ్యవసాయేతర భూమిగా (ల్యాండ్ కన్వర్షన్) మార్చుకున్నారు. సబ్ డివిజన్ జరక్కపోవడంతో మొత్తం ఆ సర్వే నంబర్లోని భూమి అంతా వ్యవసాయేతర భూమిగా నమోదైంది. దీంతో మిగిలిన రైతులు తమ భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేయాలంటే దాని విలువ ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారింది. రీ సర్వేలో సబ్ డివిజన్ జరిగి ప్రతి భూ కమతానికి ప్రత్యేకంగా ఎల్పీఎం నంబర్ ఇవ్వడంతో శివనాగేంద్రం కుటుంబంతోపాటు చాలా మంది రైతులకు మేలు జరిగింది. కాలువ పోరంబోకుగా నమోదైన భూమికి విముక్తి వట్టిచెరుకూరు మండలం గారపాడుకు చెందిన బొడ్డపాటి నర్సారెడ్డికి ఉన్న 3.3 ఎకరాలను కాలువ పోరంబోకు భూమిగా చూపుతూ నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారు. సర్వే నంబర్ 115లో నర్సారెడ్డి భూమితోపాటు కాలువ పోరంబోకు భూమి కూడా ఉంది. కాలువ భూమి ప్రభుత్వ పోరంబోకు కావడం, ఆ సర్వే నంబర్లోని భూములు సబ్ డివిజన్ కాకపోవడంతో నర్సారెడ్డి భూమి 22 (ఏ)1 (బీ)లో నమోదైంది. రీ సర్వేలో ప్రతి భూమికి సబ్ డివిజన్ జరిగి నర్సారెడ్డి భూమికి ప్రత్యేకంగా ఎల్పీఎం నంబర్‌ను ఇచ్చి వెబ్‌ల్యాండ్–2లో నమోదు చేశారు. దీంతో నిషేధిత జాబితా నుంచి విముక్తి లభించింది. 50 ఏళ్ల సమస్యకు పరిష్కారం వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన రాయపాటి ఇస్సాకుకు 0.37 సెంట్ల భూమి ఉంది. తన తండ్రి 50 ఏళ్ల క్రితం ఆ భూమిని కొనుగోలు చేశాడు. అప్పట్లో స్టాంప్ పేపర్ మీద ఈ భూమి కొన్నట్లు రాయించుకున్నారు. అప్పటి నుంచి వారి ఆధీనంలోనే ఆ భూమి ఉన్నా, రిజిస్టర్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అనేక సంవత్సరాలుగా అలాగే వదిలేశారు. రీ సర్వేలో సాదాబైనామా కేసుల పరిష్కారంలో భాగంగా రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఇస్సాకు పేరును అడంగల్‌లో నమోదు చేశారు. పట్టాదార్ పాస్‌బుక్ కూడా జారీ అయింది. వారసత్వంగా వచ్చిన ఆస్తికి మ్యుటేషన్ వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామానికి చెందిన యామర్తి వెంకట నాగదుర్గా శ్రీలక్ష్మికి వారసత్వంగా 75 సెంట్ల భూమి వచ్చింది. 50 ఏళ్ల నుంచి ఆమె కుటుంబం చేతిలోనే ఆ భూమి ఉంది. ఆమె తాత నరసింహారావు, ఆ తర్వాత ఆయన కొడుకు సీతారామాంజనేయుల నుంచి ఆమెకు భూమి వచ్చింది. కానీ దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు. పాత రెవెన్యూ రికార్డుల్లో నరసింహారావు పేరు తప్ప ఇతర వివరాలు లేవు. అనారోగ్య కారణాలతో ఆ భూమిని అమ్ముకుందామని శ్రీలక్ష్మి తండ్రి ప్రయత్నిస్తే ఆన్లైన్లో ఎక్కలేదు కాబట్టి కుదరదన్నారు. రీ సర్వేలో విచారించి ఎవరి నుంచి అభ్యంతరాలు లేకపోవడం, భూమి వారి ఆ«దీనంలో ఉండడంతో ఇటీవలే ఆమె పేరుతో మ్యుటేషన్ చేశారు. ఏపీ రీ సర్వే దేశానికి రోల్ మోడల్ దేశంలో వందేళ్ల తర్వాత ఏపీలో మాత్రమే జరుగుతున్న రీ సర్వే కార్యక్రమం విజయవంతమైంది. మన రీ సర్వేను ఇతర రాష్ట్రాలు మోడల్‌గా తీసుకుంటున్నాయి. ఈ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాం. రాష్ట్రంలోని మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికిగాను డ్రోన్లు, విమానాలతో ఇప్పటికి 1.06 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సర్వే చేశాం. త్వరలో డ్రోన్, ఏరియల్ సర్వే పూర్తవుతుంది. 2 వేల గ్రామాల్లో అన్ని దశల రీ సర్వే పూర్తయి ఆ గ్రామాల ఆర్‌ఓఆర్‌లు సిద్ధమయ్యాయి. రీ సర్వే ప్రతి దశలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన లక్షలాది భూ సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతున్నాయి. ఇప్పటి వరకు 23 వేలకుపైగా వివాదాలను మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు, కొత్త ఎంట్రీలు.. వంటివి లక్షల్లో జరుగుతున్నాయి. భావితరాలకు సైతం తమ భూముల గురించి తెలిసేలా డిజిటల్ రికార్డులు రూపొందుతున్నాయి. రీసర్వేలో వాటికి భద్రత ఏర్పడుతుంది. టాంపరింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. గ్రామ స్థాయిలోనే భూముల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. – సిద్ధార్ధ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ -
రోజుకు 50 వేల సర్వే రాళ్లు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో సర్వే రాళ్లు పాతే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. రైతులపై పైసా భారం లేకుండా ప్రభుత్వ ఖర్చుతోనే సర్వే చేసిన భూముల్లో రాళ్లు పాతుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, నంద్యాల, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ కార్యక్రమం వంద శాతం పూర్తయింది. మిగతా జిల్లాల్లోనూ వేగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజుకు 50 వేల రాళ్లు పాతడమే లక్ష్యంగా సర్వే సెటిల్మెంట్, రెవెన్యూ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఈ నెల 18వ తేదీన 54,538 రాళ్లను రైతుల భూముల సరిహద్దుల్లో పాతారు. ఆరోజు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 8 వేలకుపైగా రాళ్లను పాతారు. ఆ తర్వాత నుంచి ప్రతి రోజూ 50 వేలకు తగ్గకుండా రాళ్లను పాతుతున్నారు. ఇందుకోసం జిల్లాలవారీగా షెడ్యూల్‌ను రూపొందించారు. దాని ప్రకారం రోజూ రాళ్లు పాతుతున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. ఒకేసారి భారీగా సర్వే రాళ్లు పాతుతుండడంతో ఉన్న రోవర్లు సరిపోవడంలేదు. దీంతో సర్వే శాఖ అదనంగా వెయ్యి రోవర్లను సమకూర్చుకుంది. వచ్చే నెల 20లోగా సర్వే పూర్తయిన గ్రామాలన్నింటిలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ గ్రామాల్లో 25.80 లక్షల రాళ్లు పాతాల్సి ఉండగా ఇప్పటివరకు 14 లక్షలకుపైగా రాళ్లు పాతారు. రికార్డు స్థాయిలో సర్వే రాళ్లు పాతే కార్యక్రమం నడుస్తోందని సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లోని రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ చివరి దశకు వచ్చిందని చెప్పారు. రాళ్లు కూడా పాతడం పూర్తయితే రీ సర్వే ప్రాజెక్టులో ఈ గ్రామాలు మోడల్‌గా ఉంటాయని తెలిపారు. కోటీ ఇరవై ఐదు లక్షల సర్వే రాళ్లు అవసరం సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా కోటీ ఇరవై ఐదు లక్షల సర్వే రాళ్లు అవసరమవుతాయని అంచనా. అన్ని రాళ్లను సమకూర్చే సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీలు రాష్ట్రంలో, సమీప రాష్ట్రాల్లోనూ లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే 4 సర్వే రాళ్ల కర్మాగారాలు ఏర్పాటు చేసి రాళ్లు ఉత్పత్తి చేస్తోంది. సర్వే రాళ్లు తయారు చేయడానికి అవసరమైన గ్రానైట్ రాళ్లను గనుల శాఖ ఈ ఫ్యాక్టరీలకు సమకూరుస్తోంది. వాటిని 2 సైజుల్లో తయారు చేసి సర్వే శాఖకు అప్పగిస్తున్నారు. -
81 శాతం భూరికార్డుల స్వచ్ఛీకరణ
సాక్షి, అమరావతి: భూముల రీసర్వే నేపథ్యంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల స్వచ్చికరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్) రాష్ట్రవ్యాప్తంగా 81 శాతం పూర్తయింది. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూహక్కు పథకం పేరుతో నిర్వహిస్తున్న రీసర్వేలో రికార్డుల ప్రక్షాళన అత్యంత కీలకంగా మారింది. రీసర్వే ప్రారంభించాలంటే రికార్డులను అప్డేట్ చేయడం తప్పనిసరి. వెబ్‌ల్యాండ్ అడంగల్‌లను ఆర్ఎస్ఆర్తో పోల్చి చూడడం, అడంగల్‌లో పట్టాదారు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం, పట్టాదారు, అనుభవదారుల వివరాల కరెక్షన్, అప్డేషన్, పట్టాదారు డేటాబేస్‌ను అప్డేట్ చేయడం వంటివన్నీ కచ్చితంగా పూర్తిచేయాల్సి ఉంది. రెవెన్యూ యంత్రాంగం ఇవన్నీ పూర్తిచేసిన తర్వాతే సర్వే బృందాలు రీసర్వే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే రికార్డుల స్వచ్చికరణపై ప్రత్యేకదృష్టి సారించి చేస్తున్నారు. 26 జిల్లాల్లోని 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేపట్టారు. ఇప్పటివరకు 14,235 గ్రామాల్లో (81 శాతం) పూర్తయింది. అల్లూరి జిల్లాలో 25 శాతం మాత్రమే అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణను పూర్తిచేశారు. అనంతపురం జిల్లాలో 504 గ్రామాలకు 504, కర్నూలు జిల్లాలో 472కి 472, నంద్యాల జిల్లాలో 441కి 441 గ్రామాల్లో స్వచ్చికరణ పూర్తయింది. చిత్తూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 99 శాతం స్వచ్చికరణ పూర్తయింది. ఈ జిల్లాల్లో రెండేసి గ్రామాల్లో మాత్రమే ఇంకా పూర్తికావాల్సి ఉంది. సత్యసాయి, తూర్పుగోదావరి, ప శ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో 98 శాతం స్వచ్ఛీకరణ పూర్తయింది. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 25 శాతం స్వచ్ఛీకరణనే పూర్తిచేయగలిగారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో 44 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61 శాతం స్వచ్చికరణ పూర్తయింది. రెండునెలల్లో అన్ని జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణ పూర్తిచేసేందుకు రెవెన్యూశాఖ ప్రణాళిక రూపొందించి పనిచేస్తోంది. -
65శాతం గ్రామాల్లో.. డ్రోన్ సర్వే పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేలో మొదటి ఘట్టమైన డ్రోన్ సర్వే దాదాపు 65 శాతం గ్రామాల్లో పూర్తయింది. రాష్ట్రంలోని 17,460 గ్రామాలకుగాను 13,481 గ్రామాల్లో ఈ డ్రోన్ సర్వే చేయాల్సి వుండగా.. ఇప్పటివరకు 8,804 గ్రామాల్లో పూర్తయింది. విస్తీర్ణపరంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా 1,12,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలను సర్వే చేయాల్సి వుండగా ఇప్పటివరకూ 65,866 చ.కి.మీ.లలో (59 శాతం) ఈ సర్వే పూర్తయింది. డ్రోన్లు, విమానాలు, హెలీకాప్టర్లతో దేశంలో ఏ రాష్ట్రం ఎప్పుడూ చేయని విధంగా రాష్ట్రంలో ఈ డ్రోన్ సర్వేను నిర్వహిస్తున్నారు. మిగిలిన 4,677 గ్రామాల్లో (46,134 చ.కి.మీ.) ఏప్రిల్ 23కల్లా పూర్తిచేయడానికి సర్వే, రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రెండు నెలల వ్యవధిలోనే 1,500 గ్రామాల్లో దీనిని పూర్తిచేయగలిగారు. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆ స్థాయిలో సర్వే పూర్తిచేయడాన్ని బట్టి ఎంత వేగంగా జరుగుతుందో అర్థంచేసుకోవచ్చు. అత్యాధునికంగా.. శరవేగంగా.. డ్రోన్ సర్వేను తొలుత సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించారు. సర్వేను అనుకున్న గడువులోపు పూర్తిచేయాలన్న లక్ష్యంతో మళ్లీ ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించి వాటితో చేయిస్తున్నారు. దీంతోపాటు సర్వే, సెటిల్మెంట్ శాఖ సైతం స్వయంగా ఈ సర్వే చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసింది. తమ సర్వేయర్లకే డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇప్పించి మరీ సర్వే చేయిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలు, ప్రభుత్వం కలిసి శరవేగంగా ఈ డ్రోన్ సర్వే నిర్వహిస్తున్నాయి. అక్కడక్కడా ఆలస్యమవుతుందనుకున్న ప్రాంతాల్లో ఏరియల్‌గా (విమానాలు, హెలీకాప్టర్లతో) చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని మొత్తం భూముల రీసర్వే చేయడం దేశంలో ఇదే మొదటిసారి దీన్నికూడా ఇంత అత్యాధునికంగా, పెద్దఎత్తున డ్రోన్లు, విమానాలతో చేస్తుండడాన్ని మిగిలిన రాష్ట్రాలు ఆశ్చర్యంతో పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర బృందాలు రాష్ట్రానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న భూముల సర్వే, డ్రోన్ సర్వే తీరును పరిశీలించి వెళ్లాయి. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఏప్రిల్ నాటికి డ్రోన్లతో సర్వే పూర్తికి రెవెన్యూ, సర్వే శాఖలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. 2,079 గ్రామాల్లో తుది రెవెన్యూ రికార్డులు రెడీ.. ఇక డ్రోన్ సర్వే పూర్తిచేసిన తర్వాత ఆయా గ్రామాలకు సంబంధించిన డ్రోన్ చిత్రాలను సర్వే యంత్రాంగానికి ఇవ్వాల్సి వుంటుంది. ఇప్పటివరకు డ్రోన్ సర్వే పూర్తిచేసిన 8,804 గ్రామాలకుగాను 5,264 గ్రామాల డ్రోన్ చిత్రాలను సర్వే బృందాలకు అందాయి. 4,006 గ్రామాలకు చెందిన ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లను జారీచేశారు. వీటిని క్షేత్రస్థాయిలో భూమితో పోల్చి నిజనిర్థారణ (గ్రౌండ్ ట్రూతింగ్) సర్వే చేయాలి. ఇప్పటివరకు 3,191 గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వేను పూర్తిచేశారు. 2,464 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్‌ను పూర్తిచేయగా, 2,242 గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయింది. 2,079 గ్రామాలకు సంబంధించిన తుది రెవెన్యూ రికార్డుల తయారీ పూర్తయింది. -
భూముల రీ సర్వే: క్లరికల్ తప్పిదాలు సరిచేసేందుకు 4 ఆప్షన్లు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే ప్రక్రియ తర్వాత భూ యజమానులకు జారీచేసే భూ హక్కు పత్రాల్లో ఎలాంటి తప్పుల్లేకుండా చూసేందుకు రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. తొలిదశలో సర్వే పూర్తయిన రెండువేల గ్రామాల్లో జారీచేస్తున్న పత్రాల్లో కొన్నిచోట్ల క్లరికల్ తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసేందుకు వెబ్‌ల్యాండ్‌లో కొత్తగా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. పట్టాదారు మృతిచెందడం, ల్యాండ్ పార్సిల్ నంబర్ సంబంధిత ఖాతాకు సరిపోకపోవడం, పాత సర్వే నెంబరు తప్పుపడడం, ఆర్ఓఆర్, షేప్ ఫైల్లో విస్తీర్ణం సరిపోకపోవడం వంటి వాటి కారణంగా తప్పుగా నమోదైనట్లు తహసీల్దార్లు గుర్తించారు. దీంతో ఈ నాలుగు ఆప్షన్లు ప్రత్యేకంగా ఇచ్చి క్లరికల్ తప్పులను సరిదిద్దే అవకాశం కలి్పంచారు. ఈ తప్పులన్నీ సరిదిద్దిన తర్వాతే ఆయా గ్రామాల్లో తుది ఆర్ఓఆర్ను అప్డేట్ చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రెవెన్యూ యంత్రాంగానికి నిర్దేశించారు. ఏ జిల్లాల్లో ఎన్ని తప్పులు వచ్చాయి?ఎన్ని సరిదిద్దారనే అంశాలను కూడా కమిషనర్ సమీక్షించి ఆర్ఓఆర్ పక్కాగా రూపొందేలా చర్యలు తీసుకుంటున్నారు. తుది ఆర్ఓఆర్ను ఖరారుచేయడానికి ముందు పట్టాదారుల వ్యక్తిగత సమాచారం, ఫొటో వంటి వివరాలన్నీ మరోసారి పరిశీలించాలని తహసీల్దార్లకు ఆదేశాలిచ్చారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత తుది ఆర్ఓఆర్ రూపొందించి భూ హక్కు పత్రాలు జారీచేయాలని స్పష్టంచేశారు. భూహక్కు పత్రాలను ఈనెల మొదటి వారంలోనే జారీచేయాలని నిర్దేశించారు. -
8,421 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వేలో డ్రోన్లతో భూమిని కొలిచే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 8,421 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయ్యింది. 15 రోజుల్లోనే 700 గ్రామాల్లో సర్వేను పూర్తి చేయడం విశేషం. సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డ్రోన్లు 4,769 గ్రామాల్లో సర్వే పూర్తి చేయగా.. ప్రైవేటు ఏజెన్సీల డ్రోన్లు 3,652 గ్రామాల్లో సర్వేను పూర్తి చేశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 807 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయ్యింది. మిగిలిన గ్రామాల్లో డ్రోన్, ఏరియల్ సర్వే చేసేందుకు.. సర్వే బృందాలు విస్తృతంగా పని చేస్తున్నాయి. మరోవైపు డ్రోన్ సర్వే పూర్తయిన 4,006 గ్రామాల ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్(చాయాచిత్రాలు)ను ఇప్పటికే విడుదల చేశారు. వీటితోనే సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. డ్రోన్ చిత్రాల ఆధారంగా ఇప్పటికే 3,031 గ్రామాల్లో క్షేత్రస్థాయి నిజ నిర్థారణ(గ్రౌండ్ ట్రూతింగ్)ను పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లోని 3.58 లక్షల ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయ్యింది. 975 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రస్తుతం జరుగుతోంది. చివరిగా నిర్వహించే గ్రౌండ్ వ్యాలిడేషన్‌ను కూడా 2,409 గ్రామాల్లో పూర్తి చేశారు. 622 గ్రామాల్లో ఈ ప్రక్రియ జరుగుతోంది. గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తయిన గ్రామాల్లో 19,355 అభ్యంతరాలు రాగా.. వాటిలో 19,299 అభ్యంతరాలను మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. మొత్తంగా ఇప్పటివరకు అన్ని దశల్లో రీ సర్తే పూర్తయిన గ్రామాలు 2,913 ఉన్నాయి. ఈ గ్రామాలకు సంబంధించి సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంకా 1,800 గ్రామాల్లో కూడా నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో మరో 2 వేల గ్రామాల్లో సర్వేను పూర్తి చేసి భూ హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ యంత్రాంగం కృషి చేస్తోంది. -
ముమ్మరంగా రీ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ముమ్మరంగా జరుగుతోంది. కీలకమైన డ్రోన్ సర్వే, ఆ తర్వాత దశల్లో జరిగే క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ, గ్రౌండ్ వాలిడేషన్ వంటి పనులన్నీ చకచకా ముందుకు సాగుతున్నాయి. డ్రోన్ సర్వేను 7,744 గ్రామాల్లో పూర్తిచేశారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 766 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తికాగా, శ్రీకాకుళం జిల్లాలో 758 గ్రామాలు, విజయనగరం జిల్లాలో 737, తిరుపతి జిల్లాలో 726, అనకాపల్లి జిల్లాలో 604 గ్రామాల్లో ఈ సర్వేను పూర్తిచేశారు. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం రెండు గ్రామాల్లో మాత్రమే డ్రోన్ సర్వే పూర్తయింది. ఆ జిల్లా అంతా కొండ ప్రాంతాలతో నిండి ఉండడంతో సర్వే సాధ్యం కావడంలేదు. దీంతో అక్కడ డీజీపీఎస్ సర్వే నిర్వహిస్తున్నారు. నంద్యాల, తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు జిల్లాల్లోనూ డ్రోన్ సర్వే ఆశించిన స్థాయిలో జరగడంలేదని గుర్తించారు. దీంతో ఏరియల్ సర్వే ద్వారా ఈ ప్రాంతాల్లో వేగంగా సర్వే చేపడుతున్నారు. 47 లక్షల ఎకరాలకు ఓఆర్‌ఐల జారీ డ్రోన్ సర్వే నిర్వహిస్తేనే మిగిలిన దశల సర్వే పూర్తిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. డ్రోన్ కెమెరాల ద్వారా తీసిన ఫొటోలను అభివృద్ధి చేసి ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లు జారీచేస్తారు. వాటిని బట్టి క్షేత్రస్థాయిలో సర్వే బృందాలు నిజ నిర్ధారణ, రైతుల సమక్షంలో గ్రౌండ్ వాలిడేషన్ చేపడతాయి. ఇప్పటివరకు 47,33,454 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 4,006 గ్రామాలకు ఓఆర్‌ఐలు జారీ అయ్యాయి. అవి సర్వే బృందాలకు చేరడంతో వాటిని బట్టి 2,790 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ)ను పూర్తిచేశారు. ఈ గ్రామాల్లోని భూముల విస్తీర్ణం 32,40,618 ఎకరాలు కాగా.. ఈ ప్రాంతం మొత్తం గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయింది. 18,717 వినతులకు పరిష్కారం ఇక చివరిగా.. రైతుల సమక్షంలో చేసే గ్రౌండ్ వాలిడేషన్‌ను 2,325 గ్రామాల్లో పూర్తిచేశారు. ఈ గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు 18,855 వినతులు, అభ్యంతరాలు రాగా వాటిలో 18,717 వినతుల్ని మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. ఇన్ని దశల తర్వాత చివరిగా రీ సర్వే పూర్తయినట్లు ప్రకటించే నెంబర్–13 నోటిఫికేషన్లను 2,119 గ్రామాల్లో పబ్లిష్ చేశారు. ఆ గ్రామాల్లోని రెండువేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాల జారీ ప్రక్రియ నడుస్తోంది. వచ్చే రెండు నెలల్లో మరో రెండువేల గ్రామాల్లో అన్ని దశల సర్వేను పూర్తిచేసి భూహక్కు పత్రాల జారీకి రెవెన్యూ శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. -
సర్వేతో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: దేశంలో వందేళ్ల తర్వాత నిర్వహిస్తున్న భూముల సర్వేతో కొత్త చరిత్రను లిఖిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రీ సర్వే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, ఈ మహాయజ్ఞం ఫలాలు ప్రజలకు కచ్చితంగా అందాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే) పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. తొలివిడత గ్రామాల్లో జనవరికి పత్రాలు ‘రీ సర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం. వందేళ్ల తర్వాత మళ్లీ సర్వే చేస్తున్నాం అంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లే. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంత మంది సర్వేయర్లు, సిబ్బంది మన వద్ద అందుబాటులో ఉన్నందున వేగంగా చేయగలుగుతున్నాం. తొలివిడత సర్వే పూర్తైన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం జనవరి నాటికి పూర్తి కావాలి’ అని సీఎం సూచించారు. మరో 2 వేల గ్రామాల్లో.. సర్వే పూర్తైన రెండు వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యుటేషన్లు, 92 వేల ఫస్ట్ టైం ఎంట్రీస్ జరిగాయని, 7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామని అధికారులు తెలిపారు. 4.30 లక్షల సబ్ డివిజన్లు పూర్తి కాగా 19 వేల భూ వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. ఫలితంగా ప్రజలకు రూ.37.57 కోట్ల మేర డబ్బు ఆదా అయిందని వెల్లడించారు. మరో 2 వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను అధికారులు సీఎంకు తెలియచేశారు. 2023 ఫిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేసి అదే నెల చివరికల్లా భూహక్కు పత్రాలను కూడా అందజేస్తామని చెప్పారు. గ్రామ సచివాలయం యూనిట్‌గా.. సమగ్ర సర్వేను సకాలంలో పూర్తి చేసేందుకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ సూచించారు. గ్రామ సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకుని కావల్సినంత మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో తగినంత సిబ్బందిని సమకూర్చుకుని ఖాళీలున్న చోట వెంటనే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కారమైన లబ్ధిదారులకు వ్యక్తిగత లేఖలు.. ‘ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ‘22 ఏ’ భూములు, ఇతర సమస్యలను పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలి. వారికి జరిగిన మేలును వివరిస్తూ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత లేఖలు పంపాలి. సర్వే రాళ్ల ఉత్పత్తి వేగాన్ని పెంచాలి. రాళ్ల తయారీ వేగం పెరిగేలా భూగర్భ గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇందులో ఎలాంటి జాప్యానికి తావుండరాదు’ అని సీఎం జగన్ స్పష్టం చేయగా మార్చి కల్లా సర్వేకు అవసరమైన రాళ్లు సిద్ధంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ ప్రాంతాల్లో సర్వేపై.. అర్బన్ ప్రాంతాల్లోనూ భూముల సర్వేను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 4,119 వార్డు సచివాలయాల్లో సర్వే బృందాల ఏర్పాటు, శిక్షణ ఇప్పటికే పూర్తైందని అధికారులు తెలిపారు. హద్దుల మార్కింగ్, రోవర్ల సహాయంతో జీసీపీ ఐడెంటిఫికేషన్ ప్రక్రియను 2023 జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 1,16,685 ప్రభుత్వ, పోరంబోకు ల్యాండ్ పార్సిల్స్‌కు సంబంధించి 3,37,702 ఎకరాలను గుర్తించినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. 2023 జూలై నాటికి పట్టణ ప్రాంతాల్లో సమగ్ర సర్వే హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మైనింగ్ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ సర్కార్ కొత్త చరిత్ర.. మీ భూమి మా హామీ
సాక్షి, అమరావతి: అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సాకారం చేసి కొత్త చరిత్రను లిఖిస్తోంది. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వేను ఎన్నో ఆటంకాలు, వ్యయ ప్రయాసలను అధిగమించి తొలిదశలో 2 వేల గ్రామాల్లో పూర్తి చేసింది. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించనున్నారు. పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ సర్వే పూర్తైన గ్రామాల భూ రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం జియో కో–ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు)తో జారీ చేయనుంది. ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూహక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ జారీ చేయనున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ నెంబర్ తరహాలో ఒక విశిష్ట సంఖ్య (ఐడీ నెంబర్), క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో పొందుపరిచే ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు లభ్యమవుతాయి. రీ సర్వే తర్వాత జారీ చేసే డిజిటల్ రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం సాధ్యపడదు. భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డుల్లో మార్పు చేయడం అసాధ్యం. డబుల్ రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఉండదు. రీ సర్వే ద్వారా భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కానుంది. అత్యంత పకడ్బందీగా భూముల కొత్త రికార్డు తయారవుతోంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలు పరిష్కారమవుతాయి. భూ అక్రమాలకు తావుండదు. ఉచితంగా.. రికార్డు వేగంతో తొలిదశ కింద రీ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో 4.3 లక్షల పట్టా సబ్ డివిజన్లు చేశారు. 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. సాధారణంగా పట్టా సబ్ డివిజన్, మ్యుటేషన్ కోసం పట్టే సమయం, తిప్పలు అందరికీ తెలిసిందే. అయితే రీ సర్వే ద్వారా రైతుల నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఈ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తోంది. పట్టా సబ్ డివిజన్ కోసం సచివాలయం, మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూ.600 చెల్లించాలి. మ్యుటేషన్ కోసం అయితే రూ.100 కట్టాలి. ఈ లెక్కన 4.3 లక్షల పట్టా సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లను రైతులు సొంతంగా చేసుకోవాలంటే రూ.37.57 కోట్లు ఖర్చవుతుంది. రీసర్వే ద్వారా ప్రభుత్వమే ఉచితంగా ఈ పనుల్ని చేపట్టి రైతులకు డబ్బులు మిగల్చడంతోపాటు వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించింది. 2 వేల గ్రామాల్లో రీ సర్వేను కేవలం 8–9 నెలల్లోనే పూర్తి చేయడం రికార్డు. మరో 15 రోజుల్లో ఈ గ్రామాల్లో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డ్రోన్లు.. విమానాలు.. ఆధునిక టెక్నాలజీతో 2020 డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అత్యంత ఆధునిక సర్వే టెక్నాలజీతో విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (సీఓఆర్ఎస్), జీఎన్ఎస్ఎస్ రోవర్లతో కేవలం 5 సెంటీమీటర్ల కచ్చితత్వం (తేడా)తో రైతులు సంతృప్తి చెందేలా సర్వేను నిర్వహిస్తున్నారు. భూహక్కు పత్రాల ద్వారా యజమానులకు రికార్డుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం, వారి భూముల హద్దుల్లో భూరక్ష సర్వే రాళ్లు పాతడం ద్వారా రక్షణ కల్పించడం రీ సర్వే ప్రధాన లక్ష్యం. ప్రతి భూమికీ జియో కో–ఆర్డినేట్స్‌తో హద్దులు ఏర్పరచడం, ఐడీ నెంబర్, క్యూఆర్ కోడ్ జారీ ద్వారా దేశంలో నవ శకానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాంది పలికింది. రూ.1,000 కోట్ల అంచనా వ్యయం 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక రీ సర్వే నిర్వహణకు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూముల హద్దులను నిర్థారించి భూరక్ష సర్వే రాళ్లను ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి ఇళ్ల యజమానులకు ఓనర్షిప్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. దేశంలోనే మొదటిసారిగా భూములకు సంబంధించిన అన్ని సేవలను సింగిల్ డెస్క్ విధానంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి తెచ్చారు. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవల్ని పొందే సౌలభ్యం కల్పించారు. నిర్విరామంగా మహాయజ్ఞం రీ సర్వే మహాయజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, ఉద్యోగులు అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఆధునిక సర్వే టెక్నాలజీలపై సర్వే సెటిల్మెంట్ శాఖ నియమించిన 10,185 మంది గ్రామ సర్వేయర్లకు 70కిపైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రీ సర్వేలో అందే అభ్యంతరాలు, వినతులను పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలను నియమించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మండల మొబైల్ మేజిస్ట్రేట్లను నియమించారు. 2,797 మంది వీఆర్ఓలు, 7,033 మంది పంచాయతీ కార్యదర్శులు, 3,664 మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులు రీసర్వేలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్లను సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తైంది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించి 7,29,381 మంది రైతుల భూహక్కు పత్రాలు జారీ అయ్యాయి. హక్కు పత్రాల పంపిణీ ద్వారా రీ సర్వే మహా యజ్ఞ ఫలాలను సీఎం జగన్ రైతులకు అందించనున్నారు. ప్రతి దశలో రైతుల భాగస్వామ్యం రీ సర్వే ప్రతి దశలోనూ రైతులను భాగస్వాముల్ని చేస్తున్నాం. భూరక్ష, భూహక్కు కల్పిస్తున్నాం. సర్వే తర్వాత కూడా ఏమైనా తప్పులుంటే రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సరిచేస్తాం. సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 4.5 లక్షల సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. ఇవన్నీ 8 నెలల్లోనే చేశాం. – జి సాయిప్రసాద్, సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అత్యంత వేగంగా రీ సర్వే తక్కువ సమయంలో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశాం. దేశంలో ఇంత తక్కువ సమయంలో సర్వే చేయడం ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. కొత్త రెవెన్యూ రికార్డులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుంది. లక్షల మంది పేర్లను రెవెన్యూ రికార్డుల్లో చేర్చడం, పెద్ద ఎత్తున మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు చేయడం గొప్ప విషయం. రీసర్వే తర్వాత కూడా రైతులు ఎప్పుడైనా తమ రికార్డులను అప్డేట్ చేసుకోవచ్చు. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ -
Vizianagaram: భూముల రీసర్వేలో కొత్త అంకం ప్రారంభం
బొబ్బిలి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమం కింద విజయనగరం జిల్లాలో జోరుగా సాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో కొత్త అంకానికి జిల్లా అధికార యంత్రాంగం తెరతీసింది. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ నెలాఖరులోగా భూహక్కు పత్రాల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. పాస్ పుస్తకాలను ఇప్పటికే రెవెన్యూ డివిజనల్ కేంద్రాలకు సరఫరా చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు వీటిని రైతులకు అందజేయనుంది. సర్వే ఇలా... జిల్లాలో 983 గ్రామాల్లోని భూములను రీసర్వే చేయాల్సి ఉంది. తొలుత రామభద్రపురం మండలం మర్రి వలసలో సర్వే ప్రక్రియను పాలకులు ప్రారంభించారు. అధునాతన పరికరాలతో డ్రోన్ సర్వే చేపట్టి, తరువాత క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, సర్వే సిబ్బంది హద్దులు నిర్ణయిస్తున్నారు. రైతుల సమక్షంలో వివాదాలు లేకుండా సర్వే పూర్తిచేస్తున్నారు. విస్తీర్ణంను పక్కాగా నిర్ధారిస్తున్నారు. గ్రామ సభల్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి భూముల వివరాలను స్కానింగ్, కంప్యూటరైజ్డ్ చేస్తున్నారు. 179 గ్రామాల్లో సర్వే పూర్తి... జిల్లాలోని 4.84 లక్షల చదరపు కిమీల పరిధిలో రీసర్వే చేయాల్సి ఉంది. నేటి వరకు సర్వే, రెవెన్యూ అధికారులు 179 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. అందులో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో రీసర్వే పూర్తయింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం తదితర డివిజన్లలో ఒక్కో డివిజన్లో ఐదేసి గ్రామాల చొప్పున ముందుగా జగనన్న భూ హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ మేరకు ఆయా డివిజన్లకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేసింది. వివాదాలకు తావులేకుండా... జగనన్న సంపూర్ణ భూ హక్కు పత్రాల్లో క్యూర్ కోడ్, మ్యాపుల ఫొటోలు, విస్తీర్ణం, సర్వే నంబర్లతో సహా అన్ని వివరాలూ ముద్రించారు. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే రైతు తమ భూముల సమస్త వివరాలనూ తెలుసుకోవచ్చు. భూ యజమాని, రైతులకు సంబంధించిన అన్ని వివరాలూ ఇందులో ఉన్నాయి. రైతులు, యజమానులు ఎటువంటి ఆందోళన, సందేహాలకు గురికానవసరం లేదు. అన్ని వివరాలతో ఉన్న హక్కు పత్రాలను పొందేలా అధికారులు ఈ హక్కు పత్రాలను సిద్ధం చేశారు. విడతల వారీగా రైతులకు ఈ పత్రాలు అందజేయనున్నారు. పొరపాట్లు దొర్లితే మ్యుటేషన్‌కు అవకాశం.. అత్యధిక గ్రామాల్లో ఒకే సారి హద్దుల గుర్తింపు, విస్తీర్ణం, రీసర్వే ప్రాంతాలు ఒకే సారి చేపట్టడం వల్ల ఎక్కడైనా చిన్న తప్పులు దొర్లితే దానిని మ్యుటేషన్ ద్వారా సరిదిద్దుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూముల రీ సర్వేలో 480 సర్వే సిబ్బంది నిమగ్నమయ్యారు. త్వరలోనే పంపిణీ చేస్తాం రీసర్వేకు సంబంధించిన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్న గ్రామాల భూ హక్కు పత్రాలు ముద్రించి కార్యాలయానికి వచ్చాయి. అన్ని డివిజన్ కార్యాలయాలకూ ఈ హక్కు పత్రాలు వెళ్లాయి. ఉన్నతాధికారులు తేదీ నిర్ణయిస్తే వాటిని రైతులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. – పి.శేషశైలజ, ఆర్డీఓ, బొబ్బిలి -
మరింత జాగ్రత్తగా రికార్డుల అప్డేట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూముల రీసర్వే చురుగ్గా సాగుతోంది. ప్రతిదశలోను రైతులు, భూయజమానులకు భాగస్వామ్యం కల్పిస్తూ పారదర్శకంగా అమలవుతోంది. రీసర్వే ద్వారా రికార్డులు అప్డేట్ చేసే ప్రక్రియ మరింత జాగ్రత్తగా అమలయ్యేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. రీసర్వే పూర్తయి తుది నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత కూడా రైతులు, భూయజమానులు రికార్డుల్లో తమ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు, సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. దీన్ని వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. రీసర్వేలో భూయజమానుల భాగస్వామ్యం ఉండేలా రూపొందిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) ప్రకారం ప్రతిదశను పటిష్టంగా అమలు చేస్తున్నారు. రీసర్వే జరిగినప్పుడు వివిధ కారణాల వల్ల అందులో పాల్గొనని భూయజమానులు సర్వే పూర్తయ్యాక ఆర్వోఆర్ ప్రక్రియలో తమ రికార్డులను అప్డేట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఏపీ సర్వే అండ్ బౌండరీ యాక్టు ప్రకారం సర్వే ముగిశాక అప్పీల్‌కు గడువు పూర్తయినా రైతులు, భూయజమానులు అప్పీల్ చేస్తే వాటిని స్వీకరించి విచారిస్తున్నారు. ఒకవేళ వారు సర్వే సమయంలో గ్రామంలో లేకపోతే వీడియో కాన్ఫరెన్స్, వాట్సాప్ వీడియోకాల్, జూమ్ వీడియోకాల్ వంటివాటి ద్వారా వారి స్టేట్మెంట్ తీసుకునే వెసులుబాటు ఉంది. విచారణ సమయంలో మొబైల్ మేజిస్ట్రేట్లు ఈ స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం నిర్దేశించింది. సర్వే పూర్తయినట్లు 13 నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత తమ హద్దులపై సంతృప్తి చెందకపోతే భూయజమానులు మధ్యవర్తిత్వం కోరే అవకాశం ఉంది. గ్రామసభలో తుది ఆర్వోఆర్ ప్రచురించిన తర్వాత కూడా ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ చట్టం ప్రకారం రికార్డుల్లో నమోదైన వివరాలను సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ ప్రచురించిన ఒక సంవత్సరం తర్వాత దిద్దుబాటు కోసం తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. తహశీల్దార్ ఇచ్చే ఆర్డర్‌పై 90 రోజుల్లో ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చు. మరింత పక్కాగా అమలు చేయాలని సీసీఎల్ఏ సర్క్యులర్ రీసర్వేలో ప్రతిదశలోను రైతులు, భూయజమానుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండలా చూడాలనే మార్గదర్శకాలతో భూపరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సర్క్యులర్ జారీచేశారు. ప్రతిదశలో రైతులు, భూస్వాములు వారి అవకాశాలను వినియోగించుకునేలా చేయాలని సూచించారు. ఈ అవకాశాల గురించి అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్దేశించారు. సర్వే ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను కూడా ప్రత్యేక ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేలా చూడాలని సూచించారు. సర్వే జరుగుతున్న గ్రామాల్లో నెలలో 15 రోజులు మొబైల్ మేజిస్ట్రేట్లు పర్యటించి పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ చేసేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇలా వచ్చే వినతులను గ్రామాల వారీగా జాబితాలు రూపొందించాలని సూచించారు. రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలు ఈ దరఖాస్తులు నిర్దిష్ట గడువులోపు పరిష్కారమవుతున్నాయో లేదో పరిశీలిస్తాయని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం, ఆర్డీవోకి అప్పీలు వంటి వాటికోసం ప్రత్యేక ఐటీ అప్లికేషన్లు తీసుకురానున్నట్లు సర్క్యులర్‌లో తెలిపారు. -
సీఎం వైఎస్ జగన్ అవనిగడ్డ పర్యటన (ఫొటోలు)
-
రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారం: సీఎం జగన్
సాక్షి, అవనిగడ్డ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, భూములకు సంబంధించి పక్కాగా సరిహద్దులు, కచ్చితమైన రికార్డులు లేకపోవడం వల్ల రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో మనందరికీ తెలుసని, ఇవాళ ఆ సమస్యలన్నింటినీ రీ సర్వే ద్వారా పరిష్కరిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. భూ యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ఎంతో మంది ఇన్నాళ్లూ ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు, నిరాహార దీక్షలు సైతం చేస్తున్నప్పటికీ సమస్యలు కొలిక్కి రాలేదన్నారు. ఈ సమస్యపై గత పాలకులెవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మనందరి ప్రభుత్వం.. ఈ సమస్యపై దృష్టి సారించి.. పరిష్కార మార్గం చూపుతోందని స్పష్టం చేశారు. గురువారం ఆయన 22ఏ–1 నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంద సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో భూముల రీ సర్వే చేపట్టి ఒక మహాయజ్ఞంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 వేల మంది సర్వేయర్లను నియమించామని, కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీ.. కోర్స్(కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టం) బేస్ సిస్టంను తీసుకొచ్చి.. విమానాలను, హెలికాప్టర్లను సైతం ఉపయోగిస్తున్నామని.. డ్రోన్లను, రోవర్లను కొనుగోలు చేసి వాటినీ వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఒక యజ్ఞంలా రీ సర్వే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పరికరాలను కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసి, ఉపయోగిస్తున్నాం. వంద సంవత్సరాలకు పూర్వం జరిగిన సర్వేకు మళ్లీ రీ సర్వే చేయించి, హద్దులను మళ్లీ పూర్తిగా మార్కు చేసి, రికార్డులు అన్నింటినీ పూర్తిగా అప్డేట్ చేయిస్తున్నాం. సబ్డివిజన్లు, మ్యుటేషన్స్ అన్నీ పక్కాగా చేపట్టి, ఇటువంటి సమస్యలున్న చోట అంటే షరతులు గల పట్టాలు, చుక్కల భూములు, అనాధీనం భూములు ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న అనేక భూములకు ఒక పరిష్కారం చూపాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దీక్షగా, ఒక యజ్ఞంలా చేస్తున్నాం. గ్రామాలతో పాటు పట్టణాలలో కూడా రీసర్వే చేసి భూములు, స్థిరాస్తుల యజమానులకు స్పష్టంగా సరిహద్దులు చూపడంతోపాటు, ఈ మహాయజ్ఞంలో భాగంగా హక్కు పత్రాలను కూడా ఇవ్వబోతున్నాం. నవంబర్‌లో 1,500 గ్రామాలలో.. 17 వేల పై చిలుకు గ్రామాలకు గాను, నవంబరు నెలలో 1,500 గ్రామాలలో సర్వే పూర్తి చేసి, హద్దులు రీ మార్క్ చేసి, అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించి అందరికీ భూ హక్కు పత్రాలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఇవన్నీ పూర్తి చేసి, ఆయా గ్రామాల్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉండేటట్టుగా అడుగులు వేస్తున్నాం. మన గ్రామంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటే మన భూములు వేరే వాళ్ల పేరు మీదకు మార్చి, తిక్క తిక్క చేష్టలు చేస్తే వెంటనే మనకు తెలిసిపోతుంది. అటువంటి వాటిని మనం వెంటనే అడ్డుకోగలుగుతాం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప యజ్ఞంగా భావించాం. నవంబరు నుంచి 1500 గ్రామాలతో మొదలు పెట్టి.. ప్రతి నెలా కొన్ని వందల గ్రామాలను యాడ్ చేసుకుంటూ వెళతాం. వచ్చే ఏడాది (2023) చివరి నాటికి మొత్తం 17 వేల పై చిలుకు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ దిశలో మరో అడుగే ఈ రోజు మనం తీసుకుంటున్న నిర్ణయం. షరతులుగల పట్టా పేరుతో నిషేధిత జాబితాలో అంటే 22ఏ–1 లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరిస్తూ.. రైతులకు క్లియరెన్స్ పత్రాలను జారీ చేస్తున్నాం. రైతు మనసు తెలిసిన ప్రభుత్వమిది ఇవాళ మన ప్రభుత్వంలో జరిగిన మంచి ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన చెడు ఏంటి? అన్నది ఆలోచించాలి. గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది గతంలో దివంగత నేత వైఎస్సార్ అయితే, ఇవాళ మీ జగనన్న ప్రభుత్వం. అసైన్డ్ గాని, ఆర్వోఎఫ్ఆర్ కానీ, ఆలయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నది మన అందరి ప్రభుత్వం. అసైన్డ్ భూముల విషయంలో గత ప్రభుత్వం వంచిస్తే.. ఈరోజు మంచి చేసింది మన ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతుల భూములను ఎలా దోచుకోవాలని ఆలోచిస్తే, అవి రైతులకు ఎలా ఇవ్వాలని ఆరాటపడుతూ, ఆలోచన చేస్తున్నది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం రైతు మనసు తెలిసిన ప్రభుత్వం. పేదవాడి బాగోగులు మనసులో పెట్టుకుని అడుగులు వేస్తున్న ప్రభుత్వం. ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అందిస్తున్న ప్రభుత్వం మనది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను ఖురాన్‌గా, బైబిల్‌గా, భగవద్గీతగా భావించి 98 శాతం హామీలను 3 ఏళ్ల 4 నెలల కాలంలోనే నెరవేర్చిన ప్రభుత్వం మనది. 22 వేల మంది రైతులకు హక్కు పత్రాలు... ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాలలో 22ఏ–1 నిషేధిత జాబితాలో ఉన్న 18,889 సర్వే నంబర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం చూపినట్టవుతుంది. దీనివల్ల ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్న 22,042 మంది రైతులకు, వారి భూమి మీద వారికి హక్కు కల్పించే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. వేలాది మంది రైతులకు ఇబ్బందిగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఇవాళ అడుగులు పడుతున్నాయి. ఇలాంటి వారంతా ఇక రెవెన్యూ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. 22ఏ–1 కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఈ భూముల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తూ.. వాటిని డీనోటిఫై చేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఈ నిర్ణయం వల్ల ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలో మాత్రమే 10,119 మంది రైతన్నలకు 15,791 ఎకరాలకు సంబంధించి ప్రయోజనం కలుగుతోంది. వీరందిరకీ యాజమాన్య హక్కులు అందుతాయి. ఇకపై ఆ రైతులు వాళ్ల భూములు అమ్ముకోవచ్చు. మరొకరు కొనుక్కోవచ్చు. లేదా ఆ రైతన్నలు ఆ భూములను వాళ్ల పిల్లలకు బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. వారికి పక్కాగా హక్కు పత్రాలను కూడా ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. గత ప్రభుత్వ నిర్వాకం.. దేశంలో భూముల అమ్మకాలు, కొనుగోలు ప్రక్రియ అంతా 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారమే జరుగుతుంది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో 1930 వరకు షరతుగల భూముల పట్టాల పేరుతో వివిధ వర్గాలకు భూ కేటాయింపులు జరిగాయి. వాటిని రకరకాల కేటగిరీ భూములు.. మెట్ట, తరి, సాగులో ఉన్న మెట్ట భూములు, డొంక, వంక, వాగు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు.. ఇలా అనేక రకాల కేటగిరీల్లో 1932 నుంచి 1934 మధ్యలో రికార్డులన్నీ రీసెటిల్మెంట్ బుక్స్‌లో చేర్చారు. పట్టా దారుల భూముల వివరాలను, సర్వే నంబర్లను ఈ పుస్తకాల్లో నమోదు చేశారు. అటువంటి భూములను 1932–34 నుంచి రైతన్నలు వారి తరాలు, వారి పిల్లల తరాలు, తర్వాత వారి మనవళ్ల తరాలు అనుభవిస్తున్నారు. 2016 వరకు రిజిస్ట్రేషన్, టైటిల్ డీడ్స్ ఇలా ఈ భూములకు సంబంధించిన అన్ని లావాదేవీలు కొనసాగాయి. పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వడం వల్ల వారికి పంట రుణాలతో పాటు ఇతర రుణాలు కూడా అందేవి. కానీ 2016 మే నెలలో గత ప్రభుత్వం జిల్లాల వారీగా ఈ భూములు అన్నింటినీ నిషేధిత జాబితా 22–ఎ లో చేర్చుతూ.. రకరకాల జీవోలు జారీ చేసింది. అప్పటి నుంచి రైతన్నలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకే ఆ భూములు అన్నింటినీ డీ నోటిఫై చేసి, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసి, ఆ రైతన్నలకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. వివాదాలన్నింటికీ ముగింపు పలికి.. అనాధీన భూములు, చుక్కల భూములు, ఇనాం భూముల సమస్యలన్నింటికీ గ్రామ స్థాయిలోనే పరిష్కారం చూపిస్తున్నాం. భూముల రిజిస్ట్రేషన్, ల్యాండ్ రికార్డుల నిర్వహణలో దేశానికే ఒక మోడల్‌గా నిలిచేలా రీసర్వే చేపట్టాం. రైతుల సమస్యలు తెలిసిన మారాజు జగనన్న మా తాత నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. 2017లో మా అమ్మాయి పెళ్లికి లోను తీసుకుందామని బ్యాంకుకు వెళితే రెండు ఎకరాలు నిషేధిత జాబితాలో ఉందని, లోను ఇవ్వం అని చెప్పారు. తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయంతో మా లాంటి రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. నిజంగా ఈ రోజు మా రైతులందరికీ పండుగ రోజు. – కొండవీటి వీర వెంకట నారాయణ, విశ్వనాథపల్లి, కోడూరు మండలం జగనన్న రుణం తీర్చుకుంటాం తండ్రి వారసత్వంగా నాకు వచ్చిన ఐదు ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్లింది. పిల్లలను చదివించుకునేందుకు లోను కావాలని బ్యాంకుల చుట్టూ తిరిగితే ఇవ్వం అని చెప్పారు. నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గతంలో ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో భూ సమస్య తొలగిపోయింది. – రేపల్లె రాజయ్య, వి.కొత్తపాలెం, కోడూరు మండలం -
సర్వేశ్వర నేత్రం.. పరిష్కారం కానున్న భూ వివాదాలు
సాక్షి, నరసరావుపేట: దశాబ్దాలుగా అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రక్షాళించి, రైతులకు సంపూర్ణ భూహక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష రీసర్వే పల్నాడు జిల్లాలో జోరుగా సాగుతోంది. చెదలు పట్టిన భూ రికార్డులు, ఎవరి భూములు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితిలో అడ్డూఅదుపూలేని అక్రమాలు ఓ వైపు, న్యాయపరమైన చిక్కులు మరోవైపు. వీటన్నింటికీ పరిష్కారం చూపి రైతులు భూవివాదాల నుంచి బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం భూ స్వచ్ఛీకరణకు రీ సర్వే ద్వారా శ్రీకారం చుట్టింది. సర్వే తర్వాత ప్రతి రైతుకూ హద్దులు నిర్ణయించడంతోపాటు రాళ్లను పాతి ప్రత్యేక నంబర్లను కేటాయించనుంది. 1904 తర్వాత... ఆంగ్లేయుల పాలనలో 1904లో చివరి సారిగా పూర్తి స్థాయిలో భూ సర్వే జరిపి రికార్డులు పొందుపరిచారు. ప్రతి 30 ఏళ్లకు ఓసారి సర్వే అండ్ రీ సెటిల్మెంట్ జరగాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో చేయలేదు. రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టేలా రికార్డుల స్వచ్ఛీకరణతోపాటు భూ రీసర్వేకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడంతో దశాబ్దాలుగా ఉన్న భూ చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. డ్రోన్ల ద్వారా సర్వే.. రాళ్లతో హద్దులు సర్వే చేపడుతున్న గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రికార్డులను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మొదటగా డ్రోన్ కెమెరాలతో పాయింట్లను గుర్తిస్తున్నారు. ఆ పాయింట్లు, రోవర్ ఆధారంగా పొలాల్లోకి దిగి మాన్యువల్ సర్వే చేపడుతున్నారు. ప్రతి సర్వే నంబర్‌కు హద్దులు గుర్తించి రాళ్లు పాతుతున్నారు. ప్రస్తుతం 10 వేల హద్దు రాళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని అక్టోబర్ 15నాటికి పాతనున్నారు. 26 గ్రామాల్లో కొత్త హక్కుపత్రాలు జిల్లాలో ల్యాండ్ అండ్ సర్వే అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు సమన్వయంతో సర్వే ప్రక్రియ చేపడుతున్నారు. మొదటి దశలో జిల్లాలో 81 రెవెన్యూ గ్రామాల్లో 1,98,680 ఎకరాలను క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,38,024 ఎకరాల సర్వే పూర్తయింది. తొలివిడతగా 26 గ్రామాల్లోని 7,145 మంది రైతులకు అక్టోబర్ 2 నుంచి కొత్త హక్కు పత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో రెండు డ్రోన్లు, 51 రోవర్ల సహాయంతో రీ సర్వే జరుగుతోంది. 300 మంది విలేజ్ సర్వేయర్లను పది బృందాలుగా ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికీ ఓ సర్వేయర్, ముగ్గురు డెప్యూటీ సర్వేయర్లు పనిచేస్తున్నారు. పూర్తిస్థాయిలో స్వచ్ఛీకరణ వందేళ్ల తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో భూముల రీ సర్వే జరుగుతోంది. ఎవరు సాగు చేస్తున్నారు, హద్దులేంటి, ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అన్న విషయాలను సమగ్రంగా పరిశీలించి రికార్డులను స్వచ్ఛీకరిస్తున్నాం. పూర్తి పాదర్శకంగా, వివాదాలు పరిష్కారమయ్యేలా సర్వే జరుగుతోంది. ఒక్కో రెవెన్యూ గ్రామంలో భూ సర్వే పూర్తికావడానికి 3, 4 నెలలు పడుతోంది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్టోబర్ 2 నుంచి క్యూఆర్ కోడ్ కలిగిన భూహక్కు పత్రాలు, మ్యాప్‌లను రైతులకు అందజేయనున్నాం. ఆయా గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లోనే భూముల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. – శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్, పల్నాడు జిల్లా -
సంక్షేమం, అభివృద్ధి పనులను పూర్తిచేస్తాం
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అధికార్లతో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తిచేస్తామని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ గురువారం సచివాలయం నుంచి స్పందన, రీసర్వే కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షలో కలెక్టరేట్ నుంచి శివశంకర్ పాల్గొన్నారు. భూముల రీసర్వే గురించి జిల్లాలో జరుగుతున్న పనుల వివరాలను సీఎస్‌కు వివరిస్తూ వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. సర్వే సిబ్బంది డ్రోన్ల రోవర్లు, అదనపు సిబ్బంది సహకారంతో పూర్తిస్థాయిలో లక్ష్యం చేరుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులతో పడుతున్న వర్షాల కారణంగా కార్యక్రమంలో కొంత జాప్య మేర్పడిందని, అయినప్పటికీ త్వరితంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎ.శ్యాంప్రసాదు, ప్రత్యేక కలెక్టర్ వసంతబాబు, డీడీవో మహాలక్ష్మి హాజరయ్యారు. -
2,783 గ్రామాల్లో డీజీపీఎస్ పరికరాలతో రీ సర్వే
సాక్షి, అమరావతి: జీపీఆర్ఎస్ సిగ్నల్స్ అందని 2,783 గ్రామాల్లో ప్రభుత్వం డీజీపీఎస్ పరికరాల ద్వారా భూముల రీ సర్వే చేపట్టింది. కొన్ని గ్రామాల్లో ఈ సర్వే మొదలైంది. డ్రోన్లు, జీఎన్ఎస్ఎస్ రోవర్ల ద్వారా అత్యంత ఆధునికమైన హైబ్రిడ్ టెక్నాలజీతో సర్వే సెటిల్మెంట్ శాఖ రీ సర్వేలో భాగంగా భూములను కొలుస్తోంది. ఇందుకోసం జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా 70 సీవోఆర్‌ఎస్ (కంటిన్యుయస్లీ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్) బేస్‌స్టేషన్లను శాశ్వతపద్ధతిలో ఏర్పాటు చేసింది. శాటిలైట్ల ద్వారా వచ్చే జీపీఆర్ఎస్ సిగ్నల్స్ ఆధారంగా జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా ఈ కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. కానీ కొండలు, దట్టమైన అటవీప్రాంతాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల సీవోఆర్‌ఎస్ నెట్వర్క్ ద్వారా రోవర్లు సరిగా పనిచేయడంలేదు. ఇలాంటి ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా రేడియో మోడ్‌లో రీ సర్వే చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 189 మండలాల్లో 2,783 గ్రామాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ సరిగా రావడంలేదని గుర్తించారు. ఈ గ్రామాల్లో 28.50 లక్షల ఎకరాలను రీ సర్వే చేయాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 1,809 గ్రామాల్లో సిగ్నల్స్ అందడంలేదని గుర్తించారు. మొత్తం 2,783 గ్రామాల్లో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా డీజీపీఎస్ ద్వారా రీ సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ గ్రామాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. అత్యధిక గ్రామాలున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్యాకేజీ–1కి టెండర్ల ప్రక్రియ ముగిసింది. విశాఖకు చెందిన జియోకాన్ సర్వేస్, విశాఖకు చెందిన సిల్వర్ టెక్నో సొల్యూషన్స్ కంపెనీలు ఈ టెండరు దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని ఆరుగ్రామాల్లో కొద్దిరోజుల కిందట ప్రయోగాత్మక సర్వేని విజయవంతంగా నిర్వహించాయి. రెండురోజుల కిందట ఈ గ్రామాల్లో డీజీపీఎస్ సర్వేను ప్రారంభించాయి. మిగిలిన మూడు ప్యాకేజీలకు త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నారు. -
సమర్థంగా పట్టణ భూ రీ సర్వే
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యుత్తమ పరిపాలనా సంస్కరణలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకారం చుట్టారని, అందులో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూరక్ష పథకం ఒకటని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. వందేళ్ల తర్వాత పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ బృహత్తర సర్వేను అధికారులు సమర్థంగా పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు, ఇతర సిబ్బందికి పట్టణ భూ రీ సర్వే, శాశ్వత హక్కుపై అవగాహన సదస్సు బుధవారం విజయవాడలో నిర్వహించారు. డీటీసీపీ విద్యుల్లత, సీసీఎల్ఏ అదనపు కమిషనర్ అహ్మద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ఈ సర్వే ద్వారా ఎంతో కాలంగా ఉన్న భూ, ఆస్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఎవరి ఆస్తులు ఏ సర్వే నంబర్లో ఉన్నాయో పక్కాగా తెలుసుకోవడంతోపాటు హక్కుపత్రం కూడా పొందుతారని తెలిపారు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్‌లో ఒకటి ఉంటే.. వాస్తవంగా మరొకటి ఉంటుందని, ఒకరి స్థలం మరొకరి పేరుతో ఉన్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయన్నారు. రీ సర్వే తర్వాత ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్లతో పట్టణ భూ సర్వే ప్రాజెక్టు చేపట్టిందని, ఈ చారిత్రక ఘట్టంలో మున్సిపల్ అధికారులు భాగమవ్వాలని పిలుపునిచ్చారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆరు నెలలపాటు పట్టణ భూ సర్వేకు పనిచేయాలన్నారు. మొదట సమర్థులైన వారిని మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని, వారికి సామర్లకోటలోని ఏపీ సర్వే అకాడమీలో శిక్షణనిస్తామని చెప్పారు. వీరి ద్వారా యూఎల్బీల్లో అవసరమైనంత మంది సిబ్బందికి శిక్షణనిచ్చి పని ప్రారంభించాలని సూచించారు. సచివాలయాల సిబ్బంది, ప్రజలను భాగస్వాములను చేయాలి నగర, పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నప్పటికీ, ఆ ఆస్తుల యాజమాన్యాలపై దృష్టి పెట్టలేదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. టాక్స్ అసెస్మెంట్ నంబర్లున్న ఆస్తులు ఏ సర్వే నంబర్లో ఉన్నాయో అధికారులకు కూడా అవగాహన లేదన్నారు. తొలుత స్థానికంగా సమావేశాలు నిర్వహించాలని, ఇందులో వార్డు సచివాలయాల సిబ్బందిని, ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. రెవెన్యూ రికార్డు ప్రకారం ఆస్తికి సంబంధించి అన్ని అంశాలపై సర్వే చేయాలని తెలిపారు. అనంతరం డ్రోన్ ఆధారంగా ఆస్తులను సర్వే చేయడంపై అవగాహన కల్పించారు. -
సర్వే రికార్డే ఇక ఆర్ఎస్ఆర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రీసర్వే ల్యాండ్ రిజిస్టర్నే ఆర్‌ఎస్‌ఆర్‌గా పరిగణించేలా ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ రూల్స్‌కు సవరణలు ప్రతిపాదిస్తూ ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రీసర్వేలో భాగంగా రెవెన్యూ శాఖ ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్)లో ఫారమ్–1 తయారు చేయాలి. అందుకోసం ఆర్ఓఆర్ ప్రక్రియ అంతటినీ అనుసరించాల్సి ఉంటుంది. ఇందుకోసం 80 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. సర్వే శాఖ రీసర్వే పూర్తి చేసిన తర్వాత దీన్ని రెవెన్యూ శాఖ చేపడుతుంది. సర్వే శాఖ కొన్ని రోజులు, ఆ తర్వాత రెవెన్యూ శాఖ మరికొన్ని రోజులు ఇదే ప్రక్రియను చేయడం వల్ల సమయం వృథా అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సర్వే శాఖ ఇప్పటికే రీసర్వే ద్వారా భూములను కొలిచి తయారు చేసే రికార్డును (రీసర్వే ల్యాండ్ రిజిస్టర్) ఆర్‌ఎస్‌ఆర్‌గా చూడాలని ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ రూల్స్‌కు సవరణ చేయనున్నారు. సర్వే శాఖ భూముల్ని కొలిస్తే దానికి ఎవరు యజమాని అనే విషయాన్ని రెవెన్యూ శాఖ నిర్ధారిస్తుంది. ఇప్పుడు సర్వే సమయంలోనే రెండు పనులు అయ్యేలా నిబంధనల్ని సవరిస్తున్నారు. రీసర్వే పూర్తయినట్లు గ్రామాల్లో ఫారమ్–13 నోటిఫికేషన్ ఇవ్వకముందు తయారు చేసే రీసర్వే ల్యాండ్ రిజిస్టర్నే ఆర్‌ఎస్‌ఆర్‌గా పరిగణిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంటే సర్వే రికార్డునే ఆర్‌ఎస్‌ఆర్‌గా పరిగణిస్తారు. ఆ తర్వాత పూర్తి వివరాలతో ఫామ్–1బీ తయారు చేస్తారు. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతున్న భూముల రీసర్వే దీనివల్ల వేగం పుంజుకుంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన 12 రోజుల తర్వాత సవరణలు అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అందులో పేర్కొన్నారు. -
గ్రామకంఠం భూములకు యాజమాన్య హక్కు పత్రాలు
సాక్షి, అమరావతి: గ్రామకంఠం భూములకు యాజమాన్యహక్కు పత్రాలు జారీచేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. రీసర్వే తర్వాత గ్రామకంఠం భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తేలాక గ్రామకంఠం భూహక్కు రిజిస్టర్, వ్యక్తిగత గ్రామకంఠం భూహక్కు రిజిస్టర్ తయారు చేసి వాటి ప్రకారం భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ రికార్డ్ ఆఫ్ రైట్స్ (గ్రామకంఠం భూముల యాజమాన్యహక్కు పత్రాలు)రూల్స్–2022 పేరుతో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సోమవారం తుది నోటిఫికేషన్ జారీచేశారు. గతేడాది జూన్‌లో దీనికి సంబంధించి 1971 ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. తాజా నోటిఫికేషన్ ద్వారా దాని అమలుకు విధివిధానాలు జారీచేసింది. వీటి ప్రకారం రీసర్వే తర్వాత గ్రామాల్లోని గ్రామకంఠం భూములకు తహశీల్దార్లు భూయాజమాన్యహక్కు పత్రాలు జారీచేస్తారు. ఇప్పటివరకు అనుభవ హక్కే.. ఇప్పటివరకు గ్రామకంఠం భూములున్న వారికి వాటిని అనుభవించడం తప్ప వాటిపై హక్కు లేదు. తాతలు, తండ్రుల నుంచి వచ్చినా హక్కు పత్రాలు లేకపోవడం వల్ల వారికి వాటిపై ఎలాంటి రుణాలు వచ్చేవి కావు. అమ్ముకునేందుకు హక్కు ఉండేది కాదు. 2006లో వాటిని ప్రైవేటు భూములుగా పరిగణించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా వాటిని నిషేధిత భూముల జాబితాలోనే కొనసాగించారు. తాజాగా ఇటీవలే గ్రామకంఠాలను ప్రైవేటు భూములని స్పష్టం చేసి నిషేధిత భూముల జాబితా నుంచి పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రస్తుతం భూముల రీసర్వే జరుగుతుండడంతో గ్రామకంఠంలోని భూములను కొలుస్తున్నారు. సర్వే తర్వాత ఆ భూముల్లో ఎవరు ఉన్నారో నిర్థారించి వారికి భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వనున్నారు. అప్పటి నుంచి వాటిపై రుణాలు తెచ్చుకోవడంతోపాటు వారికి అమ్ముకునేందుకు, ఇతర హక్కులు వస్తాయి. రికార్డింగ్ అథారిటీ.. భూ యాజమాన్యహక్కు పత్రాలు ఎలా ఇవ్వాలి, విచారణ ఎలా చేయాలి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎన్నాళ్లకు గ్రామసభ పెట్టాలనే అంశాలపై నోటిఫికేషన్లో మార్గదర్శకాలు ఇచ్చారు. రీసర్వేలో గ్రామకంఠం ముసాయిదా భూహక్కు రిజిస్టర్‌ను తయారు చేస్తారు. దాని ఆధారంగా ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) తయారవుతుంది. ఆ తర్వాత గ్రామంలో అందరికీ నోటీసులిచ్చి గ్రామసభ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఆయా గ్రామాలకు రికార్డింగ్ అథారిటీని నియమిస్తారు. ఆ అధికారి గ్రామకంఠం స్థలాలపై గ్రామసభలో విచారణ చేసి అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తారు. వాటి ప్రకారం రికార్డు తయారు చేసి ఇస్తారు. వాటి ఆధారంగా తహశీల్దార్ ఆయా గ్రామాల్లో మళ్లీ గ్రామసభలు పెట్టి భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇస్తారు. వీటికోసం కార్యాలయాల చుట్టూ తిరక్కుండా మీ సేవ కేంద్రాల ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. గ్రామకంఠం భూములకు భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వడం చరిత్రలో ఇదే ప్రథమం. దీనివల్ల అనేక భూ సమస్యలు పరిష్కారమవుతాయి. -
సర్వే సెటిల్మెంట్ శాఖ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: 50 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల శాఖను ప్రభుత్వం పునర్వ్యస్థీకరించింది. కింది నుంచి పైస్థాయి వరకు కేడర్ పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేయడంతోపాటు పలు విభాగాలకు సంబంధించి కీలకమైన మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 1971లో సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి నుంచి పదోన్నతుల ఛానల్ లేకపోవడంతో నియమితులైన వారంతా ఒకే కేడర్‌లో ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్ అవుతున్నారు. తాజాగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా భూముల రీసర్వేను చేపట్టడంతో సర్వే శాఖ ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగి పని విధానం పూర్తిగా మారిపోయింది. మరోవైపు.. గ్రామ సచివాలయ వ్యవస్థలో 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించడంతో సర్వే శాఖ మరింత క్రియాశీలకంగా మారింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పేరుతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న భూముల రీ సర్వే, వాటి సేవల స్వరూపం పూర్తిగా మారిపోవడం, సర్వే అవసరాలు పెరగడం, భూసేకరణ, భూముల సబ్ డివిజన్ వంటి పనులు గతం కంటే పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో సర్వే శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ, తనిఖీ వ్యవస్థ ఉండేలా పునర్వ్యవస్థీకరించింది. పర్యవేక్షణాధికారులుగా మండల సర్వేయర్లు మండల స్థాయి నుంచి డివిజన్, డివిజన్ నుంచి జిల్లా, జిల్లా నుంచి రీజినల్ స్థాయి వరకు 410 పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్ పోస్టు ఉండేది. దాన్ని డిప్యూటీ డైరెక్టర్ హోదాకు పెంచారు. రీజినల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను జాయింట్ డైరెక్టర్ హోదాకు పెంచారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేశారు. మండల స్థాయిలో కొద్దికాలం క్రితం వరకు మండల సర్వేయర్లే ప్రారంభ ఉద్యోగులు. గ్రామ సర్వేయర్లు రావడంతో ఇప్పుడు వారు ప్రారంభ ఉద్యోగులయ్యారు. దీంతో మండల సర్వేయర్ పోస్టు పర్యవేక్షణాధికారి పోస్టుగా మారింది. గతంలో మండల సర్వేయర్లను పర్యవేక్షించేందుకు డివిజన్ స్థాయిలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఉండేవారు. ఇప్పుడు గ్రామ సర్వేయర్లందరికీ మండల సర్వేయర్ పర్యవేక్షణాధికారిగా మారారు. దీనికి అనుగుణంగా మండల సర్వేయర్ పోస్టును మండల ల్యాండ్ సర్వే అధికారిగా మార్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సర్వేయర్లు, అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఏపీ సర్వే శిక్షణ అకాడమీని ఏపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో డెశీ అండ్ జియో ఇన్ఫర్‌మ్యాటిక్స్‌గా మార్చారు. సెంట్రల్ సర్వే కార్యాలయాన్ని సెంట్రల్ సర్వే ఆఫీస్ అండ్ జియో స్పేషియల్ వింగ్‌గా మారుస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. -
రాష్ట్రంలో 4 సర్వేరాళ్ల ఫ్యాక్టరీలు
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వే అవసరాలకోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సర్వేరాళ్ల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తోంది. రీసర్వే తర్వాత నిర్ణయించిన కొత్త సరిహద్దుల ప్రకారం పాతేందుకు అవసరమైన రాళ్ల కోసం వీటిని సిద్ధం చేస్తోంది. రెండు, మూడురోజుల్లో ఒక దాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీసర్వే నేపథ్యంలో రాష్ట్రంలో 1.25 కోట్ల సర్వేరాళ్లు అవసరమవుతాయని సర్వే, సెటిల్మెంట్శాఖ అంచనా వేసింది. అన్ని రాళ్లను సమకూర్చే సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీలు రాష్ట్రంలోను, సమీప రాష్ట్రాల్లోను లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొత్తగా సర్వేరాళ్ల కర్మాగారాలు ఏర్పాటు చేసి రాళ్లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించింది. ఆ సంస్థ రాష్ట్రంలోని ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఫ్యాక్టరీల నిర్మాణ పనులు చేపట్టింది. ఒక్కో ఫ్యాక్టరీకి రూ.12.25 కోట్ల చొప్పున రూ.49 కోట్లతో వీటి నిర్మాణం మొదలుపెట్టింది. రోజుకు ఒక్కో ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం 4,500 రాళ్లు ఒక్కో ఫ్యాక్టరీని రోజుకు 4,500 రాళ్లను తయారుచేసే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప్రకాశం జిల్లా బల్లికురువలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయింది. అతి త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. మే నెలాఖరుకల్లా మిగిలిన యూనిట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇందుకు సంబంధించి స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు ఏపీఎండీసీ ఎండీ, గనులశాఖ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి తెలిపారు. -
మా హామీ!
చిత్తూరు కలెక్టరేట్: ‘భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. పచ్చని గ్రామాల మధ్య కక్షలు, కార్పణ్యాలకు తావులేకుండా చూడాలి. అన్నదాతల మధ్య అనుబంధాన్ని నెలకొల్పాలి. సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసి వారి భూములకు సర్వహక్కులు కల్పించాలి. ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇవ్వాలి. రికార్డులను సైతం సమూలంగా మార్పు చేయాలి’.. అన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న భూ రక్ష– శాశ్వత భూ హక్కు పథకానికి శ్రీకారం చుట్టింది. వందేళ్ల తర్వాత దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సమగ్ర భూ రీ సర్వేని ప్రారంభించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదటి దశ సర్వేను దిగ్విజయంగా పూర్తి చేసి.. రెండో దశ సర్వేకు శ్రీకారం చుట్టింది. 27 రెవెన్యూ గ్రామాల్లో రెండో దశ ఉమ్మడి జిల్లాలో చంద్రగిరి, గుడిపాల, జీడీనెల్లూరు, వాల్మీకిపురం మండలాల్లోని నరసింగాపురం, ముత్తుకూరుపల్లె, అగరమంగళం, జమ్మాలపల్లెల్లో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు కింద భూ రీసర్వే పూర్తిచేశారు. ప్రస్తుతం రెండో దశలో 27 రెవెన్యూ గ్రామాల్లో సర్వే ప్రారంభించగా, ఇప్పటికి ఆరు గ్రామాల్లో పూర్తిచేశారు. రోవర్లకు సంబంధించి జిల్లాలో 7 కార్స్బేస్ స్టేషన్లు అనుసంధానం చేశారు. 2023 డిసెంబర్ నాటికి సచివాలయాల్లో రికార్డులు, సేవలు అందుబాటులోకి రావడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నారు. మొదటి దశలో పూర్తి చేసిన భూ రికార్డులను గత జనవరి 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అంకితం చేశారు. అత్యాధునిక సాంకేతికత భూ రీ సర్వేకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్‌కోడ్‌తో కూడిన భూ కమత పటాన్ని జారీచేస్తారు. గ్రామ స్థాయిలో భూ రికార్డులను క్రోడీకరించి, మ్యాప్‌లు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు గ్రామాల్లోనే అందుబాటులో ఉంచనున్నారు. మీ భూమి మా హామీ (మహాయజ్ఞాన్ని) చేపట్టి భూములు, ఆస్తుల రక్షణకు చర్యలు చేపడుతున్నారు. ప్రయోజనం ఇలా... శాశ్వత భూహక్కు: సింగిల్ విండో పద్ధతిలో ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం జారీచేస్తారు. భూ లావాదేవీలు, బ్యాంకు రుణాలు సులభం అవుతాయి. భూ రక్ష : ప్రతి భూ కమతానికి ఉచితంగా భూ రక్ష హద్దు రాళ్లు వేస్తారు. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు తావుండదు. దళారీ వ్యవస్థ కనుమరుగు అవుతుంది. లంచాలకు చోటుఉండదు. భద్రత : నకిలీ పత్రాలకు ఇక తావు ఉండదు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులకు వీలుపడదు. అవసరమైన చోట సబ్ డివిజన్ మార్పులు చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు. పారదర్శకత : సర్వే ప్రతి అడుగులో భూ యజమానుల భాగస్వామ్యం, మండల మొబైల్ మేజిస్ట్రేట్ బృందాల ద్వారా అభ్యంతరాల పరిష్కారం, తొలిసారిగా గ్రామ కంఠాల్లోని స్థిరాస్తులు సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. గ్రామాల చెంతకే సేవలు : ఇకపై గ్రామ సర్వేయర్ల ద్వారానే ఎఫ్‌లైన్ దరఖాస్తులు 15 రోజుల్లో, పట్టా, సబ్‌డివిజన్ దరఖాస్తులు 30 రోజుల్లో పరిష్కరించనున్నారు.గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్లు భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా పొందవచ్చు. గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఇక తీరినట్లే. రీ సర్వే బృహత్తర పథకం జగనన్న శాశ్వత భూ హక్కు– భూరక్ష పథకం రాష్ట్ర చరిత్రలో వందేళ్ల తర్వాత చేపట్టిన ఒక బృహత్తర పథకం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. రైతులకు శాశ్వత భూ హక్కుతో పాటు వారి భూములకు రక్షణ కల్పించే పథకం ఇది. ఈ సర్వేని మూడు దశల్లో 1/3 వంతు గ్రామాల్లో నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం. – హరినారాయణన్, కలెక్టర్ నాలుగు బృందాల ద్వారా సర్వే గుడిపాల మండలం, పాపసముద్రం గ్రామంలో నాలుగు బృందాలు రీ సర్వే చేస్తున్నాయి. రోజుకు కనీసం ఒక బృందం 20 ఎకరాలు రీ సర్వే చేయాల్సి ఉంటుంది. సరిహద్దు రాళ్లు నాటడం, వాటిలో గ్రామ సరిహద్దులు తెలిపే విధంగా, గ్రామాల కూడలి అయితే సరిహద్దు తెలిపే విధంగా మూడు సరిహద్దు రాళ్లు నాటి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ భూమి, పట్టా భూమి, కాలువలు, చెరువులు గుర్తింపు చేసి సంబం«ధిత శాఖకు సమాచారం అందిస్తున్నాం. – కిరణ్‌కుమార్, సర్వేయర్, పాపసముద్రం, గుడిపాల మండలం. -
Andhra Pradesh: భూమికి భరోసా
ప్రతి గ్రామంలోనూ భూముల సమగ్ర సర్వే చేపట్టి భవిష్యత్తులో వివాదాలకు తావు లేకుండా పరిష్కరిస్తాం. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలలో మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కాకుండా.. ఏకంగా మీ గ్రామంలోనే, మీ ఇంటికి అతి దగ్గరలోనే మీ ఆస్తుల లావాదేవీలు కళ్లెదుటే మీకు కనిపించే విధంగా రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాం. ఎవరో, ఎక్కడో మీకు తెలియకుండా మీ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితులకు ఫుల్స్టాప్ పెడుతున్నాం. ఇదొక పెద్ద సంస్కరణ. – సీఎం వైఎస్ జగన్ కష్టార్జితం వివాదాల్లో చిక్కుకుంటే.. రూపాయి రూపాయి దాచుకుని.. రాత్రనకా పగలనకా కష్టపడి కొనుక్కున్న ఒక ప్లాటో, ఇల్లో భూ వివాదాల్లోకి వెళ్లిపోతే ఎంత బాధగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ పరిస్థితులను నివారించి ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే తపనతో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. త్వరలోనే అన్ని గ్రామ సచివాలయాలకు విస్తరిస్తాం. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం ద్వారా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే అతిపెద్ద సంస్కరణ కార్యక్రమమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 37 గ్రామాల్లో తొలిదశగా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని, వచ్చే మూడు వారాల్లో మరో 14 చోట్ల ప్రారంభమవుతాయని చెప్పారు. సర్వే పూర్తి అయ్యాక దశలవారీగా అన్ని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సదుపాయాన్ని కల్పిస్తామని ప్రకటించారు. సమగ్ర భూముల సర్వే కింద మొదటి దశలో 51 గ్రామాలలో రీ సర్వే, అభ్యంతరాల పరిష్కారం, భూ రికార్డులు ప్రజలకు అంకితం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. స్వతంత్ర భారతంలో తొలిసారిగా.. దేవుడి దయతో దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో అత్యంత శాస్త్రీయ విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన తొలిదశ సమగ్ర భూసర్వేని 51 గ్రామాలలో పూర్తి చేశాం. 37 గ్రామ సచివాలయాల్లో ఇవాళ్టి నుంచే భూములు, స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియచేసేలా ఈ రోజు మొట్టమొదటి అడుగు వేస్తున్నాం. వందే?ళ్ల తర్వాత సమగ్ర సర్వే.. దేశంలో సుమారు 100 ఏళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సమగ్ర సర్వే జరిగింది. 1983 వరకు జమాబందీ విధానంలోనే భూములకు సంబంధించిన అభ్యంతరాలను పరిష్కరించారు. ఆ తర్వాత కరణాల వ్యవస్ధ రద్దు కావడం, సరైన ప్రత్యామ్నాయం లేక జమాబందీ కార్యక్రమాలు ఆగిపోయాయి. మన భూమిని మన కళ్లెదుటే ఇతరుల పేరిట రాసుకుంటున్నారు. ట్యాంపరింగ్ జరుగుతోందని తెలుస్తున్నా అడ్డుకోలేని నిస్సహాయ స్థితి నెలకొంది. నా పాదయాత్ర సమయంలో 13 జిల్లాలోనూ ప్రజలు ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య వ్యత్యాసాలు సివిల్ వివాదాలకు దారి తీస్తున్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన భూమి విస్తీర్ణాన్ని కొలత వేస్తే కొన్నిసార్లు ఎక్కువగా ఉంటోంది, మరికొన్నిసార్లు తక్కువగా చూపిస్తోంది. శాశ్వత భూహక్కు–భూరక్ష రిజిస్టేషన్లను ప్రారంభించి అధికారులతో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ సబ్ డివిజన్ కావట్లేదు.. భూ వివాదాలాన్నీ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఓ సర్వే నంబర్లో అమ్మకాలు జరిగిపోతాయి కానీ సబ్ డివిజన్ మాత్రం ఉండదు. పట్టాదారు పాస్ పుస్తకాల వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరడం లేదు. నిర్దిష్ట హద్దులు, శాశ్వత హక్కులు లేకపోవడం వల్ల రికార్డుల్లో తమ భూముల వివరాలు తారుమారు అయ్యాయనే ఫిర్యాదులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సింహభాగం సివిల్ వివాదాలే.. సివిల్ వివాదాల్లో దాదాపు 80 – 90 శాతం కేసులు భూమి తగాదాలకు సంబంధించినవే కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. సరైన వ్యవస్థ లేకపోవడం, ట్యాంపరింగ్, ఇతరత్రా లోపాల వల్ల కష్టపడి సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన సంపద చేజారిపోయే పరిస్థితి రావడం ఎవరికైనా బాధాకరమే. ప్రతి కమతానికి ఐడెంటిఫికేషన్ నంబర్ సివిల్ వివాదాలకు ముగింపు పలికేలా భూములన్నీ కొలత వేసి అక్షాంశాలు, రేఖాంశాలు (లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్) ఆధారంగా మార్కింగ్ చేయడమే కాకుండా ప్రతి కమతానికి నిర్దిష్టంగా ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయిస్తున్నాం. ప్రతి కమతాన్ని డిజిటల్‌గా నిర్ణయించి క్యూఆర్ కోడ్‌తో ల్యాండ్ మ్యాప్ ఇస్తున్నాం. సరిహద్దు రాళ్లు పాతి మరీ ఇస్తున్నాం. దీనివల్ల భూ వివాదాలు ఉండవు. ఎవరైనా ఆక్రమించుకుంటారనే భయం తొలగిపోతుంది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు, లంచాలకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఇది సాకారం కావాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు –భూరక్ష పథకాన్ని దాదాపు 13 నెలల క్రితం ప్రారంభించాం. 2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్కరి భూమిని 2023 కల్లా ఆధునిక పద్ధతుల్లో సమగ్రంగా రీసర్వే చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రీసర్వే చేయడమే కాకుండా యూనిక్ ఐడీ క్రియేట్ చేయడం, డేటా మొత్తం సబ్డివిజన్లతో పూర్తిగా అప్డేట్ చేస్తున్నాం. ఆ తర్వాత పక్కాగా పట్టా డాక్యుమెంట్స్ భూ యజమానుల చేతుల్లో పెడతాం. రూ.1,000 కోట్ల వ్యయంతో 2020 డిసెంబరు 21న భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టాం. కార్స్, డ్రోన్స్ టెక్నాలజీ లాంటి 50 అంశాలపై 10,158 మందికి సర్వే కోసం శిక్షణ ఇచ్చాం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4,500 సర్వే బృందాలను నియమించాం. 2 వేల రోవర్లు, 75 కార్స్ బేస్ స్టేషన్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాం. తొలిదశలో... సమగ్ర సర్వే తొలిదశ 51 గ్రామాలలో 12,776 మంది భూ యజమానులకు చెందిన 21,404 భూ కమతాలకు సంబంధించి 29,563 ఎకరాల రీసర్వే పూర్తైంది. 3,304 అభ్యంతరాలు, సివిల్ వివాదాలను పరిష్కరించాం. హద్దులు మార్పు చేసి మ్యాపులు, యూనిక్ ఐడీ క్రియేట్ చేయడం, క్యూఆర్ కోడ్‌లో భద్రపరచడంతో పాటు భూముల రికార్డులన్నీ పర్మినెంట్ టైటిల్స్‌తో భూ యజమానుల చేతుల్లో పెడుతున్నాం. అందరి సమక్షంలో.. భూముల సమగ్ర సర్వే వల్ల నకిలీ పత్రాలకు తావుండదు. భూ యజమానికి తెలియకుండా రికార్డులను మార్చే అవకాశం ఉండదు. ఆస్తులు అమ్ముకున్నా సబ్‌డివిజన్ చేసిన తర్వాతే ఆ లావాదేవీల ఆధారంగా మాత్రమే భూ రికార్డుల్లో మార్పులు జరుగుతాయి. ఇతరుల ఆస్తిని కాజేసేందుకు ఆస్కారం ఉండదు. సర్వే చేసేటప్పుడు ప్రతి అడుగులోనూ భూయజమానులను భాగస్వాములుగా చేస్తున్నాం. వారి సమక్షంలోనే మంచి చేస్తున్నాం. అభ్యంతరాలను మండల స్ధాయిలో మొబైల్ మెజిస్ట్రేట్ బృందాల ద్వారా అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం. గ్రామ కంఠాలకు కూడా.. తొలిసారిగా గ్రామకంఠాల్లోని ఇళ్లు, స్ధిరాస్తులను కూడా సర్వే చేసి యాజమాన్య ధృవీకరణ పత్రాలు అందచేస్తున్నాం. అవసరమైతే అమ్ముకునే స్వేచ్ఛ కూడా అన్ని రకాలుగా కల్పిస్తున్నాం. గ్రామ సర్వేయర్ల ద్వారా ఫీల్డ్ లైన్ దరఖాస్తులను 15 రోజుల్లో, పట్టా సబ్‌డివిజన్ దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని గడువు విధించాం. సబ్‌డివిజన్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలని ఇదే వేదిక నుంచి అధికారులను ఆదేశిస్తున్నాం. సింగిల్ విండో విధానంలో... సింగిల్ విండో విధానంలో ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూహక్కు పత్రం అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. మనం ఏర్పాటు చేస్తున్న ఈ వ్యవస్ధ ద్వారా ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా భూ సమాచారాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.లక్ష్మి,పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ(సర్వే, సెటిల్మెంట్స్) కమిషనర్ సిద్ధార్ధ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ డైరక్టర్ ఎంఎం నాయక్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ వి.రామకృష్ణ, ఏపీఎండీసీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జ్యుడిషియల్ ప్రివ్యూకు భూ రీసర్వే టెండర్
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం’ కింద చేపట్టిన భూ రీసర్వే పనులకు సంబంధించిన టెండర్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూకు సమర్పించినట్లు సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. డ్రోన్లు, ఏరియల్ ఫొటోగ్రఫీ ద్వారా సర్వే చేసేందుకు అవసరమైన పరికరాల కోసం ఈ టెండర్లను పిలుస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్షా 26 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అన్ని రకాల భూములను, వాటి విస్తీర్ణ ప్రాంతాలను హైబ్రిడ్ మెథడాలజీ విధానంలో డ్రోన్లు, కార్స్ నెట్వర్క్, జీఎన్ఎస్ఎస్ రిసీవర్లతో రీసర్వే చేస్తామని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లు, ఆసక్తి కలిగిన బిడ్డర్లు, సాధారణ ప్రజలకు వీటికి సంబంధించి సూచనలు, సలహాలు, రిమార్కులు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే జ్యుడిషియల్ ప్రివ్యూకు సెప్టెంబర్ 7వ తేదీలోపు సమర్పించాలని కోరారు. -
మీ భూమి రక్షణకు.. మాది హామీ: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: దొంగ రికార్డులు సృష్టించి భూములు కాజేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. ‘భూ హక్కు- భూ రక్ష’ పథకానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్సార్– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 16 వేల మంది సర్వేయర్లతో భూ రీసర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వేయర్లందరికీ అత్యాధునిక టెక్నాలజీతో సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణా అందించామన్నారు. చదవండి: ఏపీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం ‘భూములపై వివాదాలు, సృష్టించే బ్రోకర్లు, రౌడీల నుంచి రక్షణ అవసరం. పాదయాత్రలో అనేకమంది బాధితుల కష్టాలు విన్నా. సూమారు వందేళ్ల తర్వాత మళ్లీ సమగ్ర భూ సర్వే చేపడుతున్నాం. మీ భూమి రక్షణకు.. మా ప్రభుత్వం రక్షణ ఇస్తుంది. భూ రీసర్వేపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకే భూహక్కు-భూరక్ష పథకం. భూమిపై మీ హక్కును ఎవరూ మార్చలేరు. రైతులకు మరింత భద్రత కలగాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ హామీతో కూడిన భూహక్కు పత్రాన్ని యజమానికి అందిస్తాం. భూమి విస్తీర్ణంతో కూడిన ల్యాండ్ మ్యాప్‌ను కూడా అందిస్తాం. ప్రతి గ్రామానికి సర్వే మ్యాప్ ఉంటుంది. గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. (రాష్ట్రానికి ఆదర్శం.. తక్కెళ్లపాడు) పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే తక్కెళ్లపాడులో భూ రీసర్వే చేశాం. భూ రీసర్వే కోసం అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వ నిధులతోనే సర్వే రాళ్లను కూడా వేస్తారు. ప్రతి భూమికి ఐడీ నంబర్ ఇస్తాం: సీఎం జగన్. డ్రోన్, రోవర్ ద్వారా అక్షాంశ, రేఖాంశాలతో కూడిన సర్వే. అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సక్రమంగా చేస్తాం. 2023 నాటికి భూ రీసర్వే పూర్తి చేస్తాం. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడుతుంది.’ అని పేర్కొన్నారు. కాగా ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది. మొదటి దశలో 5వేల గ్రామాల్లో భూ రీసర్వే ప్రారంభం కానుంది. రెండో దశలో 6,500 గ్రామాలు, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు. (జనం ఆస్తికి అధికారిక ముద్ర) -
ఏపీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
సాక్షి, జగ్గయ్యపేట : మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్సార్– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. అనంతరం రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ప్రారంభించి, సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది. మొదటి దశలో 5వేల గ్రామాల్లో భూ రీసర్వే ప్రారంభం కానుంది. రెండో దశలో 6,500 గ్రామాలు, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు. (జనం ఆస్తికి అధికారిక ముద్ర) సాహసోపేత నిర్ణయం ఎంతో కాలంగా పల్లె నుంచి పట్టణాల వరకు భూ వివాదాలు.. గట్టు వద్ద రైతన్నలు తరుచూ కీచులాటలు.. ఏళ్ల తరబడి సర్వే చేసే నాథుడే కనిపించలేదు. అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. భూమి ఒకరిదైతే మరొకరు ఆక్రమించుకుని దౌర్జన్యం చేసిన ఘటనలు అనేకం. భూ వివాదాలను చెరిపేందుకు సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వందేళ్ల తర్వాత రాష్ట్ర చరిత్రలో ఒక బృహత్తర కార్యక్రమం మొదలైంది.


