breaking news
govindappa
-
హైకోర్టును తప్పుదారి పట్టించిన సిట్
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై గత వాదనల సందర్భంగా హైకోర్టును సిట్ తప్పుదారి పట్టించిందని సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ధర్మాసనానికి నివేదించారు. డిఫాల్ట్ బెయిల్ మంజూరు సరైనదేనని స్పష్టం చేశారు. ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్‌ను సవాలు చేస్తూ సిట్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. తమ చార్జిïÙట్లలో లోపాలను ఎత్తిచూపుతూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంను కూడా సవాలు చేసింది. మరో నిందితుడు బూనేటి చాణక్యకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయకుండా ఏసీబీ కోర్టును నిరోధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.ఈ వ్యాజ్యాలపై గత వారం విచారణ జరిపిన న్యాయమూర్తి ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంపై స్టే విధించిన విషయం తెలిసిందే. ఆఫీస్ మెమోరాండం ఆధారంగా ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్‌లోని పలు అంశాలపై కూడా స్టే ఇచ్చారు. హైకోర్టులో గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది తప్పెట నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ, ఏసీబీ కోర్టు నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 309 కింద రిమాండ్ పొడిగిస్తూ వచ్చినట్లు సిట్ న్యాయవాది హైకోర్టుకు చెప్పారని, హైకోర్టు సైతం ఆ విషయాన్ని అలాగే రికార్డ్ చేసి, దాని ఆధారంగా మద్యం తర ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. వాస్తవానికి ఏసీబీ కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 167 (2) కింద నిందితులకు రిమాండ్ పొడిగించిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. క్వాష్ పిటిషన్ చెల్లదు చాణక్య తరఫు సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, గోవిందప్ప తదితరుల డిఫాల్ట్ బెయిల్ రద్దు కోసం సిట్ దాఖలు చేసిన వ్యాజ్యాల నుంచి తమ వ్యాజ్యాన్ని వేరు చేయాలని కోరారు. ఏసీబీ కోర్టు ఆఫీస్ మెమోరాండం కొట్టేయాలని కోరుతూ సీఆర్పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని, ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదఅన్నారు. మెమోరాండం పూర్తి కార్యనిర్వాహక ఉత్తర్వు అని, దీనిని సెక్షన్ 482 కింద సవాలు చేయడానికి వీల్లేదని చెప్పారు. ఆ ఆఫీస్ మెమోరాండంను సిట్ ఎలా సవాలు చేస్తుందని ప్రశి్నంచారు. ఆఫీస్ మెమోరాండంపై హైకోర్టు స్టే విధించడం వల్ల పిటిషనర్ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉండిపోయిందన్నారు. తదుపరి విచారణ 17కు వాయిదా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఈ వ్యవహారంలో న్యాయ సంబంధిత అంశాలు ముడిపడి ఉన్నాయని, లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇరుపక్షాలు తమ తమ వాదనలతోపాటు, ఆ వాదనలను సమర్థించుకునేందుకు అనుకూలంగా ఉన్న తీర్పుల కాపీలను తమ ముందుంచాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు. -
బెడిసికొట్టిన బాబు కుట్ర..! మద్యం అక్రమ కేసులో ముగ్గురు విడుదల
-
జైలు నుంచి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ విడుదల
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో అరెస్టయిన రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇవాళ(ఆదివారం) జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, వారి విడుదలపై జైలు అధికారులు తాత్సారం చేశారు. ముగ్గురి విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిన్న(శనివారం) సాయంత్రమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇవాళ(ఆదివారం) వారిని ఆలస్యంగా విడుదల చేశారు. ఈ క్రమంలో విజయవాడ జైలు సూపరిటెండెంట్ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనుంజయరెడ్డి మండిపడ్డారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని.. మళ్లీ ఏదో కేసు పెట్టి జైల్లో బంధించాలని చూశారంటూ ధనుంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది.పాస్‌పోర్టులను ఇప్పటికే జప్తు చేయకుంటే, విడుదలైన మూడు రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది. ముగ్గురూ రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోని లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్నివేళల్లో కోర్టు విచారణలకు హాజరై తీరాలని స్పష్టం చేసింది.తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్‌ను యాక్టివ్‌లో ఉంచాలని పేర్కొంది. సాక్షులను గాని, సహ నిందితులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం తీర్పు వెలువరించారు. -
మద్యం అక్రమ కేసులో 'ముగ్గురికి బెయిల్'
ఇటీవల సుప్రీంకోర్టు రీతూ చాబ్రియా కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దర్యాప్తు పూర్తి చేయకుండానే దాఖలు చేసిన అసంపూర్ణ చార్జిషీట్... సీఆర్పీసీ సెక్షన్ 167(2) ప్రకారం నిందితుడికి లభించే డిఫాల్ట్ బెయిల్ హక్కును దూరం చేయలేదని తేలి్చచెప్పింది. డిఫాల్ట్ బెయిల్ చట్టబద్ధ హక్కు మాత్రమే కాక రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం ప్రాథమిక హక్కు కూడా అని సుప్రీం పేర్కొంది. ప్రతి నిందితుడికి వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేసి డిఫాల్ట్ బెయిల్ హక్కును అడ్డుకోవాలనుకునే తీరు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా అని తెలిపింది. ఇలాంటి చర్యలు నిందితుడి ప్రాథమిక హక్కు అయిన స్వేచ్ఛను హరిస్తాయని చెప్పింది. అసంపూర్ణ లేదా పలు భాగాలుగా చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కును కాలరాయలేరని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. – ఏసీబీ కోర్టు అనుమతులు.. ఆమోదం లేకుండా ముందుకెళ్లలేం..ప్రస్తుత కేసులో ప్రాథమిక చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్ విషయానికి వస్తే 48 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రాథమిక చార్జిషీట్‌ను 16 మందిపై మాత్రమే దాఖలు చేశారు. మరో ముగ్గురిపై అనుబంధ చార్జిషీట్ వేశారు. ఇంకా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలు రాలేదు. ఆ నివేదికల్లో ఏమున్నదో తెలియకుండా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ లేదా 19 ప్రకారం అనుమతులు, ఆమోదం పొందకుండా ప్రభుత్వ ఉద్యోగులపై కేసును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు...ప్రి కాగ్నిజెన్స్ దశలో కస్టడీ పొడిగించలేంచట్ట ప్రకారం నేరాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందే తప్ప నిందితులను కాదు. సీఆర్పీసీ సెక్షన్ 309(2) ప్రకారం నేరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిందితుల రిమాండ్ పొడిగించడం సాధ్యం కాదు. కేసు ఇంకా ప్రి కాగ్నిజెన్స్ దశలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో సెక్షన్ 167(2) ప్రకారం 90 రోజులు దాటిన తరువాత నిందితుల కస్టడీ పొడిగించడానికి అనుమతి లేదు. అందువల్ల నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ మంజూరు చేయడం తప్ప మరో మార్గం లేదు –ఏసీబీ కోర్టు తీర్పుసాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. పాస్‌పోర్టులను ఇప్పటికే జప్తు చేయకుంటే, విడుదలైన మూడు రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది. ముగ్గురూ రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోని లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్నివేళల్లో కోర్టు విచారణలకు హాజరై తీరాలని స్పష్టం చేసింది. తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్‌ను యాక్టివ్‌లో ఉంచాలని పేర్కొంది. సాక్షులను గాని, సహ నిందితులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం తీర్పు వెలువరించారు.⇒ రీతూచాబ్రియా వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తన తీర్పులో పేర్కొంది. డిఫాల్ట్ బెయిల్ రాకుండా చేసేందుకు అసంపూర్ణ చార్జిషీట్ దాఖలు చేయడం రాజ్యాంగంలోని అధికరణ 21కు విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. అంతేకాక, సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద డిఫాల్ట్ బెయిల్ అన్నది ప్రాథమిక హక్కే కాక చట్టబద్ధమైనది కూడా అని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిందని ఏసీబీ కోర్టు తెలిపింది. సంపూర్ణ చార్జిషీట్ లేకుండా 60/90 రోజులకు మించి రిమాండ్ పొడిగించడానికి వీల్లేదని కూడా సుప్రీం స్పష్టం చేసిందని పేర్కొంది.అసంపూర్ణ దర్యాప్తు ఆధారంగా దాఖలు చేసే చార్జిషీట్‌కు చట్టబద్ధత లేదు‘‘సిట్ దాఖలు చేసిన మొదటి చార్జిషీట్, తర్వాత వేసిన అనుబంధ చార్జిషీట్‌ను ఈ కోర్టు పరిశీలించింది. మొత్తం 21 లోపాలను గుర్తించి మూడు రోజుల్లో సవరించాలని ఆగస్టు 23న స్పష్టం చేశాం. చార్జిషీట్ కాపీల దాఖలు, పెన్ డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్ల జాబితా ఇవ్వడం మినహా మిగిలిన లోపాలను సిట్ సరిదిద్దలేదు. మేం లేవనెత్తిన అభ్యంతరాలనే కాక పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనల సమయంలో చార్జిషీట్లో పలు ఇతర అంశాలను ఎత్తిచూపారు. ఈ నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నదాన్ని చార్జిషీట్ దాఖలు చేశారా? లేదా? అన్న కోణంలో చూడకూడదు. దర్యాప్తు మొత్తం నిర్ణీత గడువులో పూర్తయిందా? లేదా? ఆ దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే చార్జిషీట్ దాఖలైందా? లేదా? అన్నదే పరిశీలించాల్సి ఉంటుంది. ప్రాథమిక లేదా అసంపూర్ణ దర్యాప్తు ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేయడం చట్టబద్ధం కాదు. ఇది నిందితుడు డిఫాల్ట్ బెయిల్ పొందే చట్టబద్ధ హక్కుకు అడ్డంకిగా మారకూడదు. ఇదే విషయాన్ని ఆకుల రవితేజ కేసులో హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది.⇒ ‘‘రోజువారీగా మరికొంత మంది నిందితుల విషయంలో సిట్ సోదాలు కొనసాగిస్తోంది. దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోంది. అవినీతి జరిగిన మొత్తంగా ఆరోపిస్తున్న రూ.3,570.87 కోట్లలో కేవలం రూ.40 కోట్ల వరకు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాల వివరాలు తెలియాల్సి ఉంటుంది. ఈ కారణాలతో నిందితులపై నమోదైన నేరాలను విచారణకు స్వీకరించే పరిస్థితిలో ఈ కోర్టు లేదు’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో వివరించింది.చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించనప్పుడు రిమాండ్ పొడిగించలేరు..గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు జూలై, ఆగస్టు నెలల్లో రెండుసార్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో ఇటీవల ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు వేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాదులు తప్పెట నిరంజన్‌రెడ్డి, వినోద్‌కుమార్ దేశ్‌పాండే, పాపెల్లుగారి వీరారెడ్డి, తప్పెట నాగార్జునరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, చంద్రగిరి విష్ణువర్ధన్‌లు వాదనలు వినిపించారు. సిట్ చార్జిషీట్‌పై ఏసీబీ కోర్టు పలు అభ్యంతరాలను లేవనెత్తిందని, చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించని నేపథ్యంలో పిటిషనర్లకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మరోవైపు చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించనప్పుడు సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద రిమాండ్‌ను పొడిగించే ఆస్కారం లేదని తెలిపారు. సెక్షన్ 309 ప్రకారం రిమాండ్ పొడిగింపు చట్ట విరుద్ధం అవుతుందని పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలను సిట్ అధికారులు నివృత్తి చేయలేదని తెలిపారు. అభ్యంతరాలను సరిచేయకుండా, రిమాండ్‌ను పొడిగించాలంటూ సిట్ అధికారులు యాంత్రికంగా కోర్టులో మెమోలు దాఖలు చేస్తూ వస్తున్నారని చెప్పారు. దీనిని సిట్ తోసిపుచ్చుతూ బెయిల్ ఇవ్వొద్దంటూ గట్టిగా వాదనలు వినిపించింది.100 రోజులకు పైగా జైల్లో ముగ్గురుగత ప్రభుత్వ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ నిరుడు సెప్టెంబరు 23న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఈ అక్రమ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన సిట్... రాజ్ కేసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొడ్డా సత్యప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చింది.⇒ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ విచారణ పెండింగ్‌లో ఉండగానే, సిట్ అధికారులు ఈ ఏడాది మే 13న బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు. 117 రోజులుగా ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.⇒ కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి మే 16న అరెస్టయ్యారు. వీరు 113 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మద్యం అక్రమ కేసులో ఈ ముగ్గురి పాత్రపై సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది. -
ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్, గోవిందప్పకు బెయిల్
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 13న బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేయగా ఆయన 117 రోజులుగా జైల్లో ఉన్నారు. మే 16న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అరెస్ట్ చేయగా 113 రోజులుగా జైల్లో ఉన్నారు.కాగా, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సిట్ భేతాల కథలు ఇక చెల్లవని.. కోర్టులో న్యాయమే జరుగుతుందన్నారు. ‘‘లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేక పోయింది. కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని మనోహర్‌రెడ్డి అన్నారు.బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈ రోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్‌రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. -
కోర్టును బురిడీ కొట్టించేందుకే బాబు కుట్ర
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో సోదాల పేరిట మరో ‘సెన్షేషన్’కు చంద్రబాబు సర్కారు తెరతీసింది. ఇంతకాలం ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టలేకపోయిన కూటమి ప్రభుత్వం... ఇది అక్రమ కేసేనని స్పష్టమవుతుండడంతో ఇప్పుడు మరో కుట్రకు పాల్పడుతోంది. కేసును ‘సెన్సేషన్’ చేయడానికి కొత్త డ్రామాను రక్తి కట్టిస్తోంది. ఏకంగా న్యాయస్థానాలనే తప్పుదారి పట్టించేందుకు బరితెగిస్తోంది. ఆ పక్కా పన్నాగంతోనే... బాలాజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా కోర్టును బురిడీ కొట్టించేందుకు హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో సోదాల పేరుతో కొత్త పన్నాగం పన్నుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసేనని సిట్ దర్యాప్తు తీరే స్పష్టం చేస్తోంది. టీడీపీ బాస్‌లకు అన్నింట్లోనూ ‘ఎస్’ అనే పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ దర్యాప్తులో ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయింది. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు తప్ప సాధించినదేమీ లేదన్నది తేటతెల్లమైంది. ఎల్లో మీడియా ద్వారా సాగిస్తున్న దుష్ప్రచార కుతంత్రమూ బెడిసికొడుతోంది. అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పన్నిన పన్నాగం బెడిసికొడుతుండడంతో చంద్రబాబు ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. దీంతో మరో కుతంత్రం రచించింది. బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేసి 75 రోజులైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నెలల పాటు దర్యాప్తు పేరిట రిమాండ్‌లో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. దీంతో బెయిల్ ఇవ్వాలని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్ వేశారు. బాలాజీ గోవిందప్ప తదితరులకు త్వరలో బెయిల్ ఖాయమని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. కాగా, కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని సిట్ అధికారులను కోర్టు నిలదీస్తోంది. అందుకని సాంకేతిక అంశాలతో కోర్టును తప్పుదారి పట్టించేందుకు సిట్ కొత్త ఎత్తుగడ వేసింది. ఇటీవల సమర్పించిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో బాలాజీ గోవిందప్ప, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ క్రమంలోనే బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ కొత్త పన్నాగం పన్నింది. వికాట్ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కార్యాలయం, బాలాజీ గోవిందప్ప నివాసంలో హఠాత్తుగా సోదాల డ్రామాకు తెరతీసింది. కోర్టు అనుమతి లేకుండానే 20 మందితో కూడిన సిట్ బృందం వికాట్ కంపెనీ కార్యాలయం వద్ద హంగామా చేసింది. సోదాలపై కోర్టు అనుమతి పత్రం చూపించాలన్న వికాట్ ఉద్యోగులతో సిట్ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీస్ మార్క్ గూండాగిరితో భయపెట్టేందుకు ప్రయత్నించారు.బాలాజీ గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్న వికాట్ కంపెనీ కార్యాలయంలో సిట్ సోదాలు పక్కా పన్నాగమే. ఎందుకంటే, మే 13న అక్రమంగా అరెస్టు చేసే సమయంలోనూ ఇదే రీతిలో ఆయన నివాసంలో సిట్ అధికారులు రోజంతా సోదాలు చేశారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో బాలాజీ గోవిందప్ప కుమారుడి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను జప్తు చేసి సిట్ తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించింది. ఆ వస్తువులు తనవి కావని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్ కూడా వేశారు. సీజ్ చేసిన వస్తువులు తిరిగి అప్పగించాలని, సంబంధిత వ్యక్తులకు ఇచ్చేస్తామని కోరారు. ఇక ఆయన నివాసంలో గానీ, జప్తు చేసినట్టు ప్రకటించిన ఎలక్ట్రానిక్ పరికరాల్లో గానీ సిట్ ఆధారాలు చూపలేకపోయింది. దాంతో సిట్ పన్నాగం ఫలించలేదు. 75 రోజులు రిమాండ్‌లో ఉన్నా సరే దర్యాప్తులో కనీస పురోగతి సాధించలేదు. కుంభకోణం జరిగితేనే కదా?లేని కుంభకోణం ఉన్నట్టు చూపించాలన్న సీఎం చంద్రబాబు కుట్ర క్షేత్రస్థాయిలో బెడిసికొడుతోంది. ఈ పరిణామాలన్నీ సిట్ దర్యాప్తు డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. దాంతో బాలాజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ వికాట్ కార్యాలయంలో సోదాలకు దిగింది. తద్వారా ఈ కేసు ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని చెబుతూ కోర్టును తప్పుదారి పట్టించాలన్నది సిట్ పన్నాగం. ఆ నెపంతో బాలాజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకోవాలన్నది లక్ష్యం.చెదిరిపోతున్న చంద్రబాబు కుట్రలురాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్లో 3.58 లక్షల జీబీల డేటాను వైఎస్సార్సీపీ వర్గీయులు నాశనం చేశారని... 375 పేజీల డేటాను డిలీట్ చేశారని ఈనాడు సహా ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. దీనిపై ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేశారు. ‘‘అసలు మా వద్ద అలాంటి డేటానే ఏనాడూ లేదు. మేం ఎలాంటి డేటాను డిలీట్ చేయలేదు’’ అంటూ స్వయంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలోని బెవరేజెస్ కార్పొరేషనే లిఖితపూర్వకంగా తెలిపింది. అంటే, అక్రమ కేసుపై ఎల్లో మీడియా చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని నిర్ధారణ అయింది. చంద్రబాబు, లోకేశ్ సిట్‌ను అడ్డుపెట్టుకుని కట్టుకథలు అల్లుతూ... వందల కొద్దీ ఎల్లో యూట్యూబ్ చానళ్లను సృష్టించి, టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను నిపుణులు, పాత్రికేయులుగా నమ్మిస్తూ భారీగా డబ్బులు ఎరవేసి విష ప్రచారం సాగిస్తున్నారని స్పష్టమైంది.పచ్చ గ్యాంగ్ దాదాగిరీ... పరిశ్రమలు పరార్రాజకీయ కుట్రలు, కక్షసాధింపు కుతంత్రాలు, పారిశ్రామికవేత్తల నుంచి భారీ వసూళ్లు, దీనికోసం పరిశ్రమలపై దాడులు... ఇలా చంద్రబాబు ముఠా అరాచకాల కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ధ్వంసమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలకు వేధింపులు తీవ్రమయ్యాయి. భారీగా ముడుపులు, కాంట్రాక్టుల కోసం పారిశ్రామికవేత్తలను చంద్రబాబు గ్యాంగ్ వేధిస్తోంది. దీంతో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తి వెళ్లిపోతున్నారు. » వలపు వల వేసి బడాబాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జిందాల్ స్టీల్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం వేధించింది. ఇది తట్టుకోలేక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టాలని నిర్ణయించిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలించింది.» సిమెంట్ దిగ్గజం వికాట్ గ్రూప్ యూరప్‌లో టాప్ కంపెనీల్లో ఒకటి. అంతటి ప్రతిష్ఠాత్మకఅంతర్జాతీయ కంపెనీలో బాలాజీ గోవిందప్ప పూర్తిస్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనకు ఏపీతో గానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో గానీ ఏమాత్రం సంబంధం లేదు. కేవలం రాజకీయ కుట్రతోనే వికాట్ కంపెనీని, బాలాజీ గోవిందప్పను చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు.» కాకినాడ సీ పోర్టులో వాటాలు వదిలేసుకోవాలని అరబిందో గ్రూప్‌ను కూటమి ప్రభుత్వ పెద్దలు బెదిరించారు. లేదంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని సీఐడీనీ రంగంలోకి దించారు. దీంతో అరబిందో గ్రూప్ కాకినాడ సీ పోర్టులోని మెజారిటీ వాటాను వదిలేసుకోవాల్సి వచ్చింది.» అల్ట్రాటెక్ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా కాంట్రాక్టు కోసం ఏకంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాలు పరస్పరం దాడులకు దిగి బెంబేలెత్తించాయి. దాంతో ఆ పరిశ్రమ యాజమాన్యం బెదిరిపోయింది.» పల్నాడులో భవ్య, చెట్టినాడ్ సిమెంట్ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రతి బస్తాకు ఇంత అని కప్పం కట్టాలని గూండాగిరీకి తెగబడ్డారు. దీనికి ఒప్పుకోకపోవడంతో ఓ కంపెనీ ఉత్పత్తిని 50 రోజలు, మరో కంపెనీని 30 రోజులు అడ్డుకున్నారు.» శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేసి బెంబేలెత్తించారు. » రామాయపట్నం పోర్టు నిర్మాణంలో తనకు వాటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వేధించారు. ఆ కంపెనీకి నిర్మాణ సామగ్రి సరఫరాను అడ్డుకున్నారు. » శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీపై కూటమి నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. తనకు నెలనెలా కప్పం కడితేనే బీరు ఉత్పత్తుల లోడ్ లారీలను బయటకు అనుమతిస్తానని బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తేల్చి చెప్పారు. » సత్తెనపల్లి నియోజకవర్గం మీదుగా ప్రయాణించే గ్రానైట్ లారీల నుంచి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ వర్గీయులు కప్పం వసూలు చేస్తున్నారు. షాడో ఎమ్మెల్యేగా పేరు పొందిన ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో కేడీ ట్యాక్స్ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. » శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కియా భూములను కొల్లగొట్టేందుకు ఆ జిల్లా మంత్రి, అక్కడి టీడీపీ ఎమ్మెల్యే వర్గాలు కొట్లాటకు దిగాయి.» రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడు పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. » నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ రెండో ప్లాంట్ పనుల్లో తమ నీటి ట్యాంకర్లను పెట్టుకోవడం లేదని టీడీపీ నేతలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్పనివాసంలో సిట్ సోదాలువికాట్ కార్యాలయాల్లో కూడా..2 ప్రత్యేక బృందాలతో ఐదున్నర గంటల పాటు సోదాలు సాక్షి, సిటీబ్యూరో: మద్యం అక్రమ కేసులో సిట్ అధికారులు ఏఎస్పీ స్నేహిత నేతృత్వంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వికాట్ గ్రూప్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప నివాసంలో శనివారం సోదాలు నిర్వహించారు. సిట్ గతంలోనూ సుదీర్ఘంగా సోదాలు చేసినా.. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ కోర్టులో ప్రవేశ పెట్టలేకపోయింది. మరోవైపు ఏసీబీ కోర్టులో బాలాజీ గోవిందప్ప వేసిన బెయిల్ పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుందని, దానిని అడ్డుకునేందుకే సోదాల పేరుతో సిట్ అధికారులు కొత్త నాటకానికి తెరలేపారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బంజారాహిల్స్‌లోని వికాట్ కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. డీఎస్పీ శ్రీనివాస్, ఆరుగురు పోలీసుల బృందంతో కలిసి సుమారు ఐదున్నర గంటలు సోదాలు చేశారు. బాలాజీ గోవిందప్ప చాంబర్లు, పరిసర ప్రాంతాలను సోదా చేసినట్లు తెలిపారు. కొన్ని డిజిటల్ డివైజ్‌లను సీజ్ చేశామని, వాటిలో ఏముందనేది విచారణలో తేలుస్తామని డీఎస్పీ చెప్పారు. కాగా, సోదాలు నిర్వహించేందుకు వస్తున్నామని సిట్ అధికారులు స్థానిక పోలీసు స్టేషన్లో ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఎవరు సోదాలు నిర్వహిస్తున్నారనేది బంజారాహిల్స్ ఠాణా రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. కేవలం ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు మాత్రమే... బాలాజీ గోవిందప్ప నివాసం, వికాట్ ప్రధాన కార్యాలయంలో సోదాకు వస్తున్నట్లు రికార్డులో పేర్కొన్నట్లు సమాచారం. -
గోవిందప్పతో పోలీసుల బలవంతపు సంతకాలు
-
విచారణ పేరుతో గోవిందప్ప కుటుంబంపై సిట్ వేధింపులు
-
బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి తేలుస్తాం
సాక్షి, అమరావతి: మద్యం కేసులో వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగానే ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈమేరకు స్పందించింది. గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధా్దర్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమవుతుందని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ హితవు పలికింది. కాగా అగర్వాల్ వాదనను బాలాజీ గోవిందప్ప తరఫు న్యాయవాది సిద్ధా్దర్థ దవే తీవ్రంగా వ్యతిరేకించారు. తమ వ్యాజ్యం నిరర్థకం కాదన్నారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమమని నిరూపిస్తామన్నారు. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని తెలిసి కూడా అరెస్ట్ చేశారన్నారు. దర్యాప్తు సంస్థ తీరును ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. సిద్ధార్థ దవేదీనిపై ధర్మాసనం స్పందిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి కూడా తదుపరి విచారణ సమయంలో తేలుస్తామని ప్రకటించింది. అయితే మీరు (సుప్రీంకోర్టు) ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే కింది కోర్టులో బాలాజీ గోవిందప్ప.. ఏసీబీ రిమాండ్ రిపోర్ట్‌ను వ్యతిరేకిస్తారని సిద్ధా్దర్థ అగర్వాల్ పేర్కొన్నారు. అరెస్ట్ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి రిమాండ్‌కు ఇవ్వవద్దని అడుగుతారన్నారు. అగర్వాల్ వాదనపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మీరు మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇద్దరికీ ఊరట..ఇదే సమయంలో కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. తదుపరి విచారణ వరకు వీరిద్దరిని అరెస్టు చేయరాదని ఏసీబీని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని వారిద్దరినీ ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అదే రోజు గోవిందప్ప అరెస్ట్‌తో సహా అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రకటించింది.ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలతో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఏసీబీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుకి సైతం నిరాకరించింది. ఈ నేపథ్యంలో వారు ముగ్గురూ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.సమావేశాల్లో పాల్గొంటే నిందితుడిని చేసేస్తారా...?ధనుంజయరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వికాశ్సింగ్, కృష్ణమోహన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. హైకోర్టు కనీస స్థాయిలో కూడా తమ వాదనలు వినలేదని వికాశ్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తమకు హైకోర్టు అవకాశం ఇచ్చి ఉంటే పిటిషనర్లపై ఏసీబీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని నిరూపించేవారిమన్నారు.కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రాన నిందితునిగా చేర్చడం సరికాదన్నారు. రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో ఇదే సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రాన నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని ఆ తీర్పులో పేర్కొన్నారని వికాశ్ సింగ్ నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రముఖ మద్యం తయారీ కంపెనీలను పక్కకు నెట్టేసి ఎవరికీ తెలియని కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేశారన్నారు. బాలాజీ గోవిందప్ప అక్రమ అరెస్టుకర్ణాటకలో అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలింపుసాక్షి,అమరావతి: వికాట్ గ్రూప్ భారత దేశ వ్యవహారాల డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా యలందూర్లో అక్రమంగా అరెస్టు చేశారు. ప్రకృతి వైద్యం చేయించుకుంటున్న గోవిందప్పను అదుపులోకి తీసుకుని అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకొస్తున్నారు. బుధవారం ఉదయం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తారని తెలుస్తోంది. అనంతరం బాలాజీ గోవిందప్పను న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో సోదాల పేరుతో వేధింపులు కేసు దర్యాప్తు పేరిట హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నివాసాల్లో సోదాల పేరిట సిట్ అధికారులు హల్చల్ సృష్టించి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. సిట్ బృందాలు హైదరాబాద్‌లో బాలాజీ గోవిందప్ప నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను హడలెత్తించారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలకు ప్రశ్నలతో వేధించారు.ఇంట్లో పత్రాల తనిఖీ పేరిట మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు హల్చల్ చేశారు. కృష్ణమోహన్‌రెడ్డి నివాసంలోనూ సిట్ అధికారులు సోదాల పేరిట వేధింపులకు పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి దాటేవరకు సోదాలు చేస్తూనే ఉన్నారు. మరో ప్రాంతంలో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డిని పిలిపించి మరీ ఆయనకు సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ధనుంజయ్‌రెడ్డి నివాసంలోనూ సోదాల పేరిట సిట్ అధికారులు అదే రీతిలో బెదిరింపులకు పాల్పడ్డారు. -
దొంగల దాడిలో వ్యక్తి మృతి
రొళ్ల : మండలంలోని హెచ్.టి.హళ్లిలో గోవిందప్ప(48) అనే వ్యక్తి దొంగల రాళ్ల దాడిలో శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. శుక్రవారం రాత్రి గోవిందప్ప తండ్రి ముద్ద రంగప్ప ఆరుబయట నిద్రిస్తుండగా దొంగలు చోరీ కోసం ఇంటి వద్దకు వచ్చారన్నారు. సరిగ్గా అదే సమయంలో తేరుకున్న రంగప్ప గట్టిగా కేకలు వేయగా, ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు గోవిందప్ప అక్కడికి వచ్చాడని చెప్పారు. అదే సమయంలో దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా, దుండగులు రాళ్లు విసరడంతో గోవిందప్పకు తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని పేర్కొన్నారు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకునే సరికే దొంగలు పరారయ్యారని వివరించారు. గస్తీ పోలీసులు అటుగా రాగా, అపస్మారక స్థితిలో ఉన్న గోవిందప్పను ప్రైవేటు వాహనంలో కర్ణాటక ప్రాంతం తుమకూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని సోదరుడు రంగనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గంటల వ్యవధిలోనే దంపతుల మృతి
రొళ్ల : ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న తల్లిదండ్రులు గంటల వ్యవధిలోనే తుదిశ్వాస విడిచిపెట్టడంతో ఆ కుటుంబం కకావికలమైంది. వివరాల్లోకి వెళితే... రొళ్ల మండలం హుణిసేకుంటకు చెందిన గోవిందప్ప, భార్య భాగ్యమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గోవిందప్ప గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూపించా నయంకాలేదు. రెండు రోజుల క్రితం గోవిందప్ప (42) ఇంటి వద్దే చనిపోయాడు. తన కళ్లెదుటే భర్త చనిపోవడంతో మనో వేదనకు గురైన భాగ్యమ్మ (35) కూడా శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. వారి సమాధులను కూడా పక్క పక్కనే పూడ్చిపెట్టారు. తల్లిదండ్రులిద్దరినీ ఒకే సారి కోల్పోవడంతో వారిద్దరి కుమారులు, కుమార్తె కన్నీరు మున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అనాథలైన వారికి అండగా ఉంటామని గ్రామస్తులు చెప్పారు. వారంతా కలిసే అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
హిందూపురం అర్బన్ : పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లికి చెందిన గోవిందప్ప (24) రైలుకింద పడి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల తెలిపిన మేరకు బెంగళూరులోని ఫ్యాక్టరీలో పని చేస్తున్న గోవిందప్ప ఉదయం గ్రామం నుంచి బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరి హిందూపురం వచ్చాడు. అయితే బెంగళూరు వెళ్లకుండా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మతుడి తండ్రి అశ్వర్థప్ప అక్కడికి చేరుకుని కుమారుడి శవం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.