దొంగల దాడిలో వ్యక్తి మృతి | man dies of thieves attacked | Sakshi
Sakshi News home page

దొంగల దాడిలో వ్యక్తి మృతి

Mar 25 2017 11:33 PM | Updated on Aug 28 2018 7:30 PM

దొంగల దాడిలో వ్యక్తి మృతి - Sakshi

దొంగల దాడిలో వ్యక్తి మృతి

మండలంలోని హెచ్‌.టి.హళ్లిలో గోవిందప్ప(48) అనే వ్యక్తి దొంగల రాళ్ల దాడిలో శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు.

రొళ్ల : మండలంలోని హెచ్‌.టి.హళ్లిలో గోవిందప్ప(48) అనే వ్యక్తి దొంగల రాళ్ల దాడిలో శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు. శుక్రవారం రాత్రి గోవిందప్ప తండ్రి ముద్ద రంగప్ప ఆరుబయట నిద్రిస్తుండగా దొంగలు చోరీ కోసం ఇంటి వద్దకు వచ్చారన్నారు. సరిగ్గా అదే సమయంలో తేరుకున్న రంగప్ప గట్టిగా కేకలు వేయగా, ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు గోవిందప్ప అక్కడికి వచ్చాడని చెప్పారు. అదే సమయంలో దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా, దుండగులు రాళ్లు విసరడంతో గోవిందప్పకు తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని పేర్కొన్నారు.

ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకునే సరికే దొంగలు పరారయ్యారని వివరించారు. గస్తీ పోలీసులు అటుగా రాగా, అపస్మారక స్థితిలో ఉన్న గోవిందప్పను ప్రైవేటు వాహనంలో కర్ణాటక ప్రాంతం తుమకూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని సోదరుడు రంగనాథ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement