
ఎత్తులకు చేరడమే లక్ష్యం..! దానికి నేనే సాక్ష్యం...!! (ఫొటో: చక్రపాణి కందుల, విజయవాడ)

చేతుల్లో తీసుకెళ్తున్నా.. నీ ఓటు అటో మరి ఇటో..!! (ఫొటో : రాజు, ఖమ్మం)

బాసూ పోలీసులు ప్రత్యేకమా..! ప్రమాదానికి మీరంటే భయమా..!! (ఫొటో: చక్రపాణి కందుల, విజయవాడ)

తక్షణ సహాయక చర్యల్లో రక్షక భటులు..! (ఫొటో: అరుణ్‌గౌడ్, కామారెడ్డి)

జస్ట్ ట్రయల్ రన్.. అసలు పరుగు మరికాసేపట్లో..!! (ఫొటో : మహ్మద్ రఫి, తిరుపతి)

ఇక్కడ ‘ఆరోగ్యం’ పాడుబడ్డది. ఇంకోచోటైనా మెరుగ్గా ఉందో..!! (ఫొటో: అజీజ్, మచిలీపట్నం)

అంధులమైనా పాటల బంధులమే.. చల్లని చూపులతో ఆదరించండి..!! (ఫొటో: అజీజ్, మచిలీపట్నం)

వెంకయ్య అయ్యారు.. వైద్యయ్య..!! (ఫొటో: చక్రపాణి కందుల, విజయవాడ)

నమ్మండి సార్లూ.. చేతికొచ్చిన శనగ చావుబాటపట్టింది..!! (ఫొటో: హుస్సేన్, కర్నూలు)

అమ్మా మీరు మా తోడుండగా.. ఇంకెక్కడిది వైకల్యం (ఫొటో: హుస్సేన్, కర్నూలు)

అలంకరణలన్నీ పూర్తి.. వెలిగిస్తే దీపాలు అదే మాకు తృప్తి..!! (ఫొటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

‘కాపు’గాసిన నాట్య విన్యాసాలు.. అయిదుగురి అభినయం అదుర్స్...! (ఫొటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

మా నాయకుడి ఓక్కో మాట.. ఓటరు గుండెను తాకుతది..!! (ఫొటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

వంచనపై గర్జనలో వరప్రసాద్ గర్జించారు..!! (ఫొటో : గరగ ప్రసాద్, రాజమండ్రి)

చిన్నారి చేతుల్లో కార్తీక దీపం..!! (ఫొటో : గరగ ప్రసాద్, రాజమండ్రి)

టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో ఫిష్ వెంకట్..! (ఫొటో : జె.మురళీమోహన్, మహబూబాబాద్)

లేచిన కాడ్నుంచి మీ దగ్గరే ఉంటా.. మీ సేవ చేస్కుంటా..!! (ఫొటో : జె.మురళీమోహన్, మహబూబాబాద్)

మేం సగం కాదు.. మీకంటే ఎక్కువే..!! (ఫొటో : జె.మురళీమోహన్, మహబూబాబాద్)

కార్తీకానికి చేతులెత్తిన బాల వికాసం..!! (ఫొటో : కిశోర్, విజయవాడ)

మెగా వైద్య శిభిరం.. దంత పరీక్షలకై బయలుదేరిన కిశోరం..!! (ఫొటో : కిశోర్, విజయవాడ)

కొత్త ప్రభుత్వాసుపత్రి అనే పేరేనా..? ఇక్కడా వసతుల కరువేనా..? (ఫొటో : కిశోర్, విజయవాడ)

సంధ్యారాగపు సరిగమల్లో పిచ్చుక రేరాజును పిల్తుస్నుట్టు లేదూ..!! (ఫొటో : మహ్మద్ రఫి, తిరుపతి)

సత్తువనంతా ధారపోసి దుమికా..! సాధ్యమైనంత ఎక్కువే అడుగేశా..!! (ఫొటో : మహ్మద్ రఫి, తిరుపతి)

ఓసార్లూ.. ఓ సారిటు చూడండి..! చంటోళ్లకు ఏందీ పెచ్చుల గొడవ..!! (ఫొటో : మోహన్‌కృష్ణ, తిరుమల)

కారుకు దన్నుగా పొట్టేలు సవారి..!! (ఫొటో : రాజు, ఖమ్మం)

స్ఫూర్తి మంత్రం..! ఓటర్లందరూ ఫాలో అయితే మంచి ప్రభుత్వం తథ్యం..!! (ఫొటో : నర్సయ్య, మంచిర్యాల)

అమ్మ తోడుగా.. చంటిపాప చదువు వేడుక..!! (ఫొటో : రూబెన్, విజయవాడ)

నాట్యాభినయ కాంతుల హోరు.. గింగిరాలు తిరుగుతూ.. నింగిని చేరగా..(ఫొటో : రూబెన్, విజయవాడ)

కెరటాలను చీల్చుకుంటూ.. సముద్రాన్ని వేటాడేస్తాం..!! (ఫొటో : సత్యనారాయణ, విజయనగరం)

తుమ్మిళ్ల జలాలతో కేసీఆర్‌కు అభిషేకం..!! (ఫొటో : వి.శ్రీనివాసులు, కర్నూలు)

‘రావాలి జగన్.. కావాలి జగన్’లో ఎమ్మెల్యే గౌరు దంపతులకు సాదర స్వాగతం..!! (ఫొటో : వి.శ్రీనివాసులు, కర్నూలు)

అసలే కోతి.. ఆపై చుక్కేసింది.. ఎవరినైనా రక్కేస్తుందా..!! (ఫొటో: విజయకృష్ణ, అమరావతి)

పక్షులు ఊరు చేరాయి.. పస్తులతో కొందరు కాడు చేరారు..!! (ఫొటో: విజయకృష్ణ, అమరావతి)

ప్రభువు దీవెనలతో.. మీ జీవితాల్లో సదా వెలుగు నిండుగాక..!! (ఫొటో : విశాల్, విజయవాడ)