హైదరాబాద్ : రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
గచ్చిబౌలి స్టేడియంలో మొదలైన ఈ లీగ్ జూన్ 28 వరకు కొనసాగుతుంది. సినీ నటి శ్రుతి హాసన్ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా విచ్చేసి లీగ్‌ను ప్రారంభించారు.
తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హీరోస్ 21–28తో బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ చేతిలో ఓడిపోగా..రెండో మ్యాచ్‌లో ఢిల్లీ రెడ్స్ 31–21తో చెన్నై బుల్స్‌పై విజయం సాధించింది.


