న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
ఫలితంగా 136 ఏళ్ల చరిత్రలో భారత జట్టు పేరిట ఓ అత్యంత చెత్త రికార్డు నమోదైంది
బెంగళూరులో భారత్- న్యూజిలాండ్ మధ్య బుధవారం మొదలు కావాల్సిన తొలి టెస్టు వర్షం వల్ల తొలిరోజు బంతిపడకుండానే ముగిసిపోయింది
ఈ క్రమంలో గురువారం ఆట మొదలుపెట్టగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది
ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 13, కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులకే నిష్క్రమించారు
ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన విరాట్ కోహ్లి 0, సర్ఫరాజ్ ఖాన్ 0, రిషభ్ పంత్ 20, కేఎల్ రాహుల్ 0, రవీంద్ర జడేజా 0, రవిచంద్రన్ అశ్విన్ 0, కుల్దీప్ యాదవ్ 2, జస్‌ప్రీత్ బుమ్రా 1, మహ్మద్ సిరాజ్ 4(నాటౌట్) పరుగులు చేశారు
1888 తర్వాత ఇలా ఓ జట్టులోని టాప్-8 బ్యాటర్లలో ఐదుగురు డకౌట్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి
1888లొ ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఇలాగే టాప్ బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది
మళ్లీ టీమిండియా దానిని పునరావృతం చేసింది. అంతేకాదు.. ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న తొలి ఆసియా జట్టుగానూ నిలిచింది.
ఇక టీమిండియా వికెట్ల పతనానికి కారణమైన కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు, విలియం రూర్కీ నాలుగు, టిమ్ సౌతీ ఒక వికెట్ తీశారు.


