
కోల్‌కతా: ఇంగ్లండ్‌తో మొదలైన టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది

బుధవారం జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు

వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు దక్కగా...అర్ష్ దీప్ , అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు





































