కడప : వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియం ఏపీఎల్ మ్యాచ్‌లకు తొలిసారిగా వేదికగా నిలిచింది. Andhra Premier League (APL)
ఏపీఎల్ లీగ్‌లో భాగంగా బుధవారం విజయవాడ్ సన్‌షైనర్స్, తుంగభద్ర వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు అభిమానగణం పోటెత్తింది.
కడప నగర ప్రజలు తొలిసారి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్‌ను వీక్షించి పులకించిపోయారు. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాగా, మధ్యాహ్ననికే క్రీడాభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు.
ఆటకంటే ముందు సాయంత్రం 5 గంటలకు సినీ సంగీత గాయని సునీత తన పాట ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగించారు.
స్టేడియం లోపల ప్రత్యేకంగా కెమెరాలు, లైవ్, ఆటగాళ్ల హావభావాలు, ప్రేక్షకుల చప్పట్లు, వీఐపీల తాకిడి, యువకుల కేరింతలతో స్టేడియంలో కొత్త సందడి కనిపించింది.
అభిమానులు ఆట తీరును సెల్ కెమెరాలో బంధించడం, సెల్ఫీలు తీయడంతో పండగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, యువతే కాదు వృద్ధులు సైతం తరలివచ్చి ఉత్సాహంగా మ్యాచ్‌లను వీక్షించడం విశేషం.


