
మహా నగరంలో వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో విరుచుకుపడ్డాడు.

శనివారం రాత్రి సుమారు రెండు గంటల పాటు దంచికొట్టాడు. రహదారులపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.

వాహనదారులు నరకయాతనకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో బస్తీలు, కాలనీలు జలమయంగా మారాయి. బేగంబజార్‌లో అత్యధికంగా 12.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

హుస్సేన్ సాగర్ నుంచి భారీగా వరద నీరు బయటకు ప్రవహిస్తుండటంతో కవాడిగూడ, గాంధీ నగర్, అరవింద్ నగర్, సబర్మతి నగర్ నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.




























