నెల్లూరు : బారాషహీద్ దర్గా ప్రాంగణంలో నిర్వహిస్తున్న రొట్టెల పండగకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. (Rottela Panduga 2026)
అశేషంగా వస్తున్న ప్రజానీకంతో దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. గంధ మహోత్సవం సందర్భంగా షహీదుల సమాధులకు లేవనం చేసిన గంధాన్ని అందుకునేందుకు పోటీపడ్డారు.
అనంతరం వరాల రొట్టెలను దక్కించుకునేందుకు నిరీక్షించారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన వారితో నగరంలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.
స్వర్ణాల చెరువు జనసంద్రమైంది. బారాషహీదుల సమాధులను దర్శించుకునే వారి తాకిడి పెరగడంతో గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. దర్గా ప్రాంగణంలో అన్నదానాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలను పలువురు ఏర్పాటు చేశారు.


