జగన్ అరెస్టుతో ఉద్యమం ఆగదు: వైఎస్సార్ సీపీ | ysrcp condemn jagan arrest | Sakshi
Sakshi News home page

జగన్ అరెస్టుతో ఉద్యమం ఆగదు: వైఎస్సార్ సీపీ

Feb 17 2014 6:03 PM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అరెస్టుతో ఉద్యమం ఆగదని వైఎస్సార్ సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి.

న్యూఢిల్లీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అరెస్టుతో ఉద్యమం ఆగదని వైఎస్సార్ సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా తమ అధ్యక్షుడు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఎంతమాత్రం తగదని, ప్రజా స్వామ్య పద్దతిలో నిరసన తెలుపుతున్న సమైక్యవాదులను నిలువరించడం ఎంత వరకు సబబు అని వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. సమైక్య ధర్నా ముగిసిన అనంతరం వైఎస్ జగన్ పిలుపు మేరకు సమైక్యవాదులు పార్లమెంట్ వరకు కాలినడకకు బయల్దేరిన క్రమంలో ప్రభుత్వ బలగాలు వారిని అడ్డుకున్నాయి. జగన్ ను అరెస్టు చేసి ప్రజల ఆకాంక్షను నీరుగార్చేందుకు కుటిలయత్నం చేశాయి.

 

ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడటాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఖండించాయి.  ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ కు తమను వెళ్లనివ్వకపోవడాన్నిజగన్ ఖండించారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు లో భాగమన్నారు. నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడాన్ని బదులుగా జగన్ స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. అనంతరం ప్రభుత్వ చర్యలకు నిరసనగా పార్టీ శ్రేణులు, సమైక్య వాదులు రోడ్డుపైనే బైఠాయించి నిరసనను మరింత ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement