భూములు లాక్కుంటే కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్ | YS Jagan mohan reddy visits a ravivalasa | Sakshi
Sakshi News home page

భూములు లాక్కుంటే కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్

Oct 5 2015 4:04 PM | Updated on Jul 25 2018 4:07 PM

భూములు లాక్కుంటే కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్ - Sakshi

భూములు లాక్కుంటే కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్

ఇష్టం లేకుండా సెంటు భూమి తీసుకోవడానికి ఎవరు వచ్చిన బాధితుల తరఫున వ్యతిరేకిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

విజయనగరం : ఇష్టం లేకుండా సెంటు భూమి తీసుకోవడానికి ఎవరు వచ్చిన బాధితుల తరఫున వ్యతిరేకిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలం ఏ రావివలసలో విమానాశ్రయ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులను వైఎస్ జగన్ పరామర్శించారు. భూముల విషయంలో అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా రైతులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.

అయితే ఇదే ప్రాంతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు చెందిన భూములు ఉన్నాయని ఆయన భూములు వదిలి... కేవలం రైతుల భూములు మాత్రమే తీసుకుంటున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.  తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం తీసుకున్న భూములను వెనక్కి ఇస్తామని వైఎస్ జగన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement