పద్మావతి భర్తగా ఆయన ఫిక్స్ అయినట్టే! | Vicky Kaushal to play Deepika Padukone husband in the new Bhansali film | Sakshi
Sakshi News home page

పద్మావతి భర్తగా ఆయన ఫిక్స్ అయినట్టే!

Jul 18 2016 5:10 PM | Updated on Sep 4 2017 5:16 AM

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ..

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ.. ’బ్లాక్’, ’రామ్ లీలా’,, ‘బాజీరావు మస్తానీ’  వంటి భారీ చిత్రాల తర్వాత ఆయన తెరకెక్కించిన బోతున్న అప్‌కమింగ్ మూవీ పద్మావతి. మేవాడ రాణి పద్మావతి జీవిత ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పద్మావతిగా మరోసారి దీపికా పదుకొణే నటిస్తుండగా.. ఆమె భర్తగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించే అవకాశముందని తెలుస్తోంది.


‘రామన్ రాఘవ్‌ 2.0’ సినిమాతో నటుడిగా ప్రశంసలు అందుకున్న విక్కీ కౌశల్‌ ఈ పాత్ర కోసం నిర్వహిస్తున్న ఆడిషన్స్‌లో పాల్గొన్నట్టు తెలిసింది. అతను ఆడిషన్‌లో పాల్గొన్నప్పటికీ.. భర్త పాత్రకు అతన్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదని చిత్రవర్గాలు పీటీఐకి తెలిపాయి.

బాలీవుడ్‌లో ఇప్పటివరకు రెండు సినిమాల్లో నటించిన విక్కీ నటుడిగా తానెంటో నిరూపించుకున్నాడు. మసాన్ సినిమాలో మంచి మనస్సున్న వారణాసి యువకుడిగా అతని నటనకు ఉత్తమ తొలి సినిమా నటుడిగా ఐఫా అవార్డు లభించింది. ‘రమన్ రాఘవ’లో డ్రగ్ అడిక్ట్ పోలీసుగా మెప్పించాడు. బన్సాలీ సినిమాలో అతనికి చాన్స్ వస్తే విక్కీ కెరీర్ మరింత దూసుకుపోయే అవకాశముంది. బన్సాలీ ‘పద్మావతి’ సినిమాలో ప్రేమికులుగా మరోసారి దీపికా పదుకొనే, రణ్‌బీర్ సింగ్ నటించబోతున్నారు. వీరిద్దరు బన్సాలీ గత సినిమాలైన ’రామ్ లీలా’, ’బాజీరావు మస్తానీ’ సినిమాలోనూ కలిసి నటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement