ఘోర పరాజయం.. యూపీలో తొలి వికెట్‌! | UPCC president offers to resign | Sakshi
Sakshi News home page

ఘోర పరాజయం.. యూపీలో తొలి వికెట్‌!

Mar 15 2017 2:06 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఘోర పరాజయం.. యూపీలో తొలి వికెట్‌! - Sakshi

ఘోర పరాజయం.. యూపీలో తొలి వికెట్‌!

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్‌లో ఆంతర్మథనం మొదలైంది.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్‌లో ఆంతర్మథనం మొదలైంది. ఈ పరాభవంతో పార్టీ అధినాయకత్వంపై సీనియర్‌ నేతలు నిరసనగళాలను విప్పుతున్నారు. ఇప్పటికే సత్యవ్రత చతుర్వేది లాంటి సీనియర్‌ నేతలు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నాయకత్వ పటిమపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. అసలైన సమయంలో చర్యలు తీసుకోకుండా.. ఇప్పుడు మథనపడుతూ కూర్చుంటే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు.

యూపీ, ఉత్తరాఖండ్‌ ఎన్నికల పరాజయాల్లో రాహుల్‌గాంధీ పాత్ర ఏమీ లేదని గులాం నబీ ఆజాద్‌ లాంటి సీనియర్‌ నేతలు వెనుకేసుకొస్తుండగా.. చతుర్వేది లాంటి సీనియర్లు మాత్రం మండిపడుతున్నారు. నేరుగా రాహుల్‌ నాయకత్వాన్నే పలువురు కాంగ్రెస్‌ నేతలు అంతర్గతంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ఎన్నికల పరాభవం నేపథ్యంలో యూపీ కాంగ్రెస్‌లో తొలి వికెట్‌ పడింది. ఎన్నికల సందర్భంగా యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రముఖ సినీ నటుడు రాజ్‌ బబ్బర్‌ తాజాగా తన పదవికి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement