తమిళనాట ఉద్రిక్తత: శబరిమలకు స్పెషల్ సెక్యురిటీ | Tamil Nadu tension: Special security at Sabarimala | Sakshi
Sakshi News home page

తమిళనాట ఉద్రిక్తత: శబరిమలకు స్పెషల్ సెక్యురిటీ

Dec 5 2016 6:41 PM | Updated on Sep 4 2017 9:59 PM

అమ్మ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తల నేపథ్యంలో తమిళనాట పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి. అమ్మ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ తమిళనాడు నుంచి భక్తులు శబరిమలకు పోటెత్తుతున్నారు.

తిరువనంతపురం : అమ్మ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తల నేపథ్యంలో తమిళనాట పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి. అమ్మ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ తమిళనాడు నుంచి భక్తులు శబరిమలకు పోటెత్తుతున్నారు.  దీంతో శబరిమల ఆలయంలో భద్రతను ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కొబ్బరికాయలు సమర్పించే ప్రాంతంలో కూడా అదనపు చర్యలను ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు తీసుకుంది. ఆజ్జి ప్రాంతంలో పోలీసులు కాపలా కాస్తున్నారు. జయలలిత ఆరోగ్యం క్షీణించిందనే ప్రకటనల నేపథ్యంలో తమిళనాడు నుంచి భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, అమ్మ త్వరగా కోలుకోవాలని పూజలు చేయిస్తున్నట్టు బోర్డు పేర్కొంది.
 
 
జయలలిత కోరుకోవాలని ఆకాంక్షిస్తూ ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు కూడా నేడు అన్నదానం నిర్వహించింది.  మంగళవారం బాబ్రీ మసీదు డేతో పాటు, అమ్మ పరిస్థితి విషమంగా మారుతుందనే ప్రకటనల నేపథ్యంలో శబరిమలకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్పెషల్ టీమ్ను రంగంలోకి దించారు. అదేవిధంగా ఆలయానికి సమీప ప్రాంతంలో 360 కేజీల గన్పౌడర్ పట్టుబడటంతో శబరిమల అడవి ప్రాంతంలో సెక్యురిటీని ఆ రాష్ట్ర పోలీసులు పెంచారు. 30 మంది సభ్యుల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అటవీ ప్రాంతాన్నంతటిన్నీ జల్లెడ పడుతుంది. ఈ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్కు బాంబ్ స్కాడ్, ఫారెస్ట్, ఫైర్, రెస్క్యూ, పోలీసులు టీమ్లు చేపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement