breaking news
special security
-
పుతిన్ సెక్యూరీటి ఎలా ఉంటుందో తెలుసా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు విన్నారా...? వినే ఉంటారు...? చూశారా అంటే అతికొద్ది మంది మాత్రమే చూసి ఉంటారు. ఇక కలిశారా? అని ప్రశ్నిస్తే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు..... అదేంటీ... ఓ దేశ అధ్యక్షుడు కొంతమందినే కలిశాడనడమేంటీ అని ఆశ్చర్య పోతున్నారా...? అవును మీరు విన్నది నిజమే. అతని చుట్టూ వలయంలా ఉండే భద్రతా సిబ్బందిని దాటి పుతిన్‌ను కలవాలంటే... మామూలు విషయం కాదు. అసలు అతనికున్న సెక్యూరిటీని ఛేదించి ముందుకు వెళ్లాలంటే... ఈగలు- దోమలకు కూడా ఆస్కారం లేదు. అంతటి రక్షణ వ్యవస్థతో కూడిన పుతిన్ సెక్యూరిటీతో పోలిస్తే ప్రపంచంలో మరే అధ్యక్షుడికి అంతటి సెక్యూరిటీ లేదనే చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడికి మించి ఉన్న అతని భద్రతా వలయం... అతని రక్షణ కోసం నిత్యం జరిగే కసరత్తుపై ఓ సారి ఫోకస్ చేద్దాం.వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలో ప్రముఖుల్లో ఒకరు. ఆయనకు విదేశాల నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన భద్రతా బలగాలు... కంటికి రెప్పలా కాపాడుతుంటాయి. పటిష్ఠమైన భద్రతా వలయంలో ఉంటూ... అతనిపై ఈగ కూడా వాలనీయకుండా సిబ్బంది జాగ్రత్త పడుతుంటారు. దానికోసం నమ్మకస్తులైన అతని భద్రతా సిబ్బంది చేసే కసరత్తు... ఓ యంత్రంలా సాగుతుంటుంది. పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది 5 వలయాల్లో ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా... గుర్తించే యంత్రాంగం ఉంటుంది. చివరకు పుతిన్ మల మూత్రాలను కూడా రష్యా తిరిగి తీసుకెళ్తారు.విదేశాల్లో అక్కడి టాయిలెట్ వాడితే... వాటిని సేకరించి... అతని డీఎన్ఏను గుర్తించడం లేదా... పుతిన్‌కు ఉన్న రోగాల గురించి తెలుసుకునే ప్రమాదం ఉందని గ్రహించిన సెక్యూరిటీ సిబ్బంది... అతని మల మూత్రాలను కూడా ఓ సూట్‌కేస్‌లో భద్రపరిచి రష్యాకు తీసుకొస్తారంటే... ఇక అతని సెక్యూరిటీ స్థాయిని గుర్తించవచ్చు. పుతిన్ సెక్యూరిటీ స్థాయి అమెరికా అధ్యక్షుడి సీక్రెట్ సర్వీస్ కన్నా మించి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జనంతో అతి తక్కువగా కలిసే పుతిన్ దగ్గరికి కేవలం అతని కుటుంబీకులు, సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. మిగత వారు అతని వద్దకు రావడం అసాధ్యమే అని చెప్పవచ్చు. ప్రజలతో కాంటాక్ట్ చాలా పరిమితంగా ఉంటుంది. అతనికి దగ్గరగా రావడం దాదాపు అసాధ్యం.పుతిన్ భద్రతా వ్యవస్థను ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అనే ప్రత్యేక భద్రతా సంస్థ పర్యవేక్షిస్తుంది. భద్రతా సిబ్బందితో పాటు ఎలైట్ బాడీగార్డులు, ఇంటెలిజెన్స్ యూనిట్లు పుతిన్ భద్రతలో ఉంటాయి.పుతిన్ మస్కటీర్స్ పేరిట ఉన్న అతని బాడీగార్డులు ఎప్పుడూ అతని చుట్టూ ఓ కంచెలా ఉంటారు. శిక్షణ పొందిన అతని బాడీగార్డులు... అధునాతన ఆయుధాలు ధరించి ఉంటారు. పుతిన్ ఆరస్ సెనేట్ పేరుతో ఉన్న కారులో తిరుగుతారు. సెనేట్ కారు ప్రత్యేకంగా పుతిన్ అధికారిక వినియోగం కోసం తయారైంది. ట్విన్ టర్బో ఇంజిన్‌తో తయారైన కారు ఎంతో అధునాతనమైంది.లగ్జరీతో పాటు సెక్యూరిటీ... రష్యా తయారీ బ్రాండ్ కారునే పుతిన్ వాడుతారు. ఈ కారు ఆర్మర్-పియర్సింగ్ బుల్లెట్లతో...., గ్రనేడ్ దాడులను కూడా తట్టుకునేలా తయారైంది. భోజన విషయంలోనూ ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. పుతిన్ కోసం తయారైన భోజనాన్ని తొలుత అతని బాడీగార్డులు రుచి చూస్తారు. ఆ తర్వాతనే పుతిన్‌కు వడ్డిస్తారు. ఫుడ్ తయారు చేసే షెఫ్‌లను కూడా తనిఖీలతో పాటు హైజీన్ చెక్‌లు ఉంటాయి.పుతిన్ అంతర్జాతీయ పర్యటనల సమయంలో భద్రత పటిష్ఠంగా ఉంటుంది. పుతిన్ ఏ దేశం వెళ్లినా... స్థానిక భద్రతా బలగాలతో కలిపి ఐదు- అంచెల సెక్యూరిటీ గ్రిడ్ ఉంటుంది. వాటిలో స్నిపర్ టీమ్స్, ఏఐ ఆధారిత సర్వైలెన్స్ కూడా ఉంటుంది. విదేశీ ప్రయాణం చేసినప్పుడు ఫ్లయింగ్ క్రెమ్లిన్ అనే ప్రత్యేక విమానం ద్వారా వెళ్తారు. అందులోనూ బాడీగార్డులు, ఎలైట్ సెక్యూరిటీ, అధికారులు, NSG కమాండోలు, టెక్నాలజీ AI ఆధారిత సర్వైలెన్స్, స్నిపర్ టీమ్స్ ఉంటాయి. అతని పర్యటన, షెడ్యూల్ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. విమానం కూడా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌తో ఉంటుంది.దాంతో శత్రు క్షిపణులను గుర్తించి తప్పించుకునే టెక్నాలజీ ఆ విమానానికి ఉంది. రాడార్ - జామింగ్ టెక్నాలజీ ద్వారా శత్రువుల రాడార్లను తప్పుదోవ పట్టించే సాంకేతికత కూడా ఉంది. అందులో ఉన్న కమ్యూనికేషన్ సిస్టంతో.... యుద్ధ పరిస్థితుల్లో కూడా రష్యా సైన్యం... ప్రభుత్వంతో నిరంతర సంబంధాలు కలిగి ఉండేలా చర్యలున్నాయి. విమానం ద్వారానే ఎయిర్‌బోర్న్ కమాండ్ సెంటర్ – ఏర్పాటు చేసి అణు యుద్ధం జరిగినా అధ్యక్షుడు ఆకాశంలో నుంచే ఆదేశాలు ఇవ్వగల సాంకేతికత జోడించి ఉంది. పుతిన్ భద్రతా వ్యవస్థలో అతని వ్యక్తిగత ఆరోగ్య రహస్యాలు ఎక్కడా లీక్ కాకుండా ఉండే విధంగా జాగ్రత్త పడతారు. విదేశీ ప్రయాణాల్లో ప్రత్యేక ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. విచిత్రమేమిటంటే... విదేశీ పర్యటనలో అతని బాడీగార్డుల వద్ద పూప్ సూట్‌కేస్ ఉంటుంది. ఆ సూట్‌కేస్ కూడా... పుతిన్.. విదేశీ పర్యటనల్లో ఉపయోగించే ఒక విచిత్రమైన భద్రతా ప్రోటోకాల్. అతని బాడీగార్డులు అతని శరీర వ్యర్థాలను మూత్రం, మలము సేకరించి వాటిని ప్రత్యేక సూట్‌కేస్‌లో రష్యాకు తీసుకెళ్తారు.దీని ఉద్దేశ్యం అతని ఆరోగ్య స్థితి, DNA వంటి గోప్యమైన సమాచారం విదేశీ గూఢచార సంస్థలకు చేరకుండా కాపాడటం. పుతిన్ ఎప్పుడూ విదేశాల్లో పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించరు. అతని బాడీగార్డులు ప్రత్యేకంగా పూప్ సూట్‌కేస్‌లో సేకరించి రష్యాకు తీసుకెళ్తారు. ఈ ప్రోటోకాల్ అసాధారణంగా వినిపించినా, ఇది అత్యంత గట్టి భద్రతా వ్యూహంలో భాగమని రష్యా సైన్యాధికారులు చెబుతున్నారు. ఇంతటి రక్షణ వ్యవస్థలో ఉన్న పుతిన్ సెక్యూరిటీని ఛేదించడం దాదాపు అసాధ్యమే. -
యాదగిరిగుట్ట క్షేత్రానికి భద్రత ఏది?
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీస్వామివారికి కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇటీవల జరిగిన చింతపండు దొంగతనం వెలుగుచూడటంతో ఆలయ భద్రతలో ఉన్న డొల్లతనం భయట పడింది. కొండపైన కమాండ్ కంట్రోల్ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ సిబ్బంది, పరికరాలు లేకపోవడంతో అలంకార ప్రాయంగా మిగిలింది. యాదగిరి క్షేత్రం అభి వృద్ధి తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర పతి, ప్రధాని వంటి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న ప్రముఖులతోపాటు ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, ఇటీవల విశ్వం నలుమూ లల నుంచి అందగత్తెలు వచ్చారు. ఇలా ఒకరే మిటి వివిధ స్థాయిల్లోని సెలబ్రిటీలు వస్తు న్నారు. వీరి భద్రత కోసం ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను తీసుకు వచ్చే కంటే స్థానికంగా ఆర్మ్‌డ్‌ఫోర్స్‌ను సిద్ధగా ఉంచాలని గతంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా గుర్తించిన గుట్ట క్షేత్రం భద్రతకు ప్రత్యేక భద్రతా ప్రణాళికను రూపొందించారు. దేశ విదేశాల నుంచి వీవీఐ పీలు, వీఐపీలు వచ్చిన ప్రతిసారీ భద్రత కో సం రాచకొండ కమిషనరేట్ నుంచి నలు మూలల నుంచి సిబ్బందిని రప్పిస్తున్నారు. సిబ్బంది లేరు..యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం బాధ్యతలను చూడటానికి ఏసీపీ స్థాయిలో అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఏసీపీని నియమించినా.. పూర్తిస్థాయి సిబ్బంది లేరు. కొండపైన అప్హిల్ పోలీస్ స్టేషన్, సీసీఎస్, మహిళా పోలీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ప్రస్తుతం ఉన్న యాదగిరిగుట్ట పీఎస్‌తోపాటు మరో పీఎస్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటికి స్టేషన్ హౌస్ అధికారులుగా ఇన్స్పెక్టర్లు ఉంటారు. దీంతోపాటు మొత్తంగా ఎస్సైలు ,ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు మొత్తంగా 300 మంది వరకు అదనంగా సిబ్బంది అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సాయుధ దళం ఏర్పాటు చేయాలని..బ్రహ్మోత్సవాల సమయంలో వీవీఐపీలు గుట్టకు వచ్చినప్పుడు రక్షణ బాధ్యతలను చూడటానికి సాయుధ దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రిజర్వ్‌పోలీస్, ఆక్టోపస్ గ్రేహౌండ్స్ పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. 25 మందితో ఆక్టోపస్ పోలీస్ దళం ఉంటుందని అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. 30 ఎకరాల స్థలం కేటాయింపు దేవాలయ అభివృద్ధికి కేటాయించిన భూమిలోనే 30 ఎకరాల స్థలం యాదాద్రి ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం కేటాయించారు. ఆ స్థలాన్ని చదును చేసి వదిలేశారు. నిధులు మంజూరు కాకపోవడంతో ఎలాంటి నిర్మా ణాలూ చేపట్టడం లేదు. ఇందులోనే ప్రధాన కార్యాలయాలు, పరేడ్ గ్రౌండ్, శిక్షణా కేంద్రం క్వార్టర్లు నిర్మించాలి. భద్రతకు ఏదీ ప్రాధాన్యం? ఆలయంతో పాటు భక్తుల భద్ర తకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సీసీ కెమెరాల నిఘాలో శాంతిభద్రతల పర్యవేక్షణ ఉండాలి. వైటీడీఏ (యాదా ద్రి ఆలయ అభివృద్ధి బోర్డు) స్వయంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. వీఐపీల తాకిడి ఎక్కువ గా ఉంటుంది. భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. దీనికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. 100 నుంచి 150 మంది సాయుధ పోలీసులు నిత్యం అందుబాటులో ఉండాలి. దాని కోసం రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ హెడ్‌క్వార్టర్‌ను యాదగిరి గుట్టలోనే ఏర్పాటు చేయాలి. ఏసీపీ కార్యాలయం, టెంపుల్ సిటీకి ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్ మంజూరు చేసి వదిలేశారు. -
స్పెషల్ ట్రీట్మెంట్.. ఇక చాలా కష్టం!
సాక్షి, న్యూఢిల్లీ: వీఐపీ ట్రీట్మెంట్కు ముగింపు పలకాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకు వేసింది. వారి భద్రతా సిబ్బందిని గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర హోంశాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. యూపీఏ హయాంలో 350 మందికి వీపీపీ ట్రీట్మెంట్ కింద ప్రత్యేక భద్రతను కల్పించగా, ఇప్పుడు 457 మందికి ఆ సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) తోపాటు పారామిలిటరీ దళాలు రెండూ కూడా వీరికి భద్రత కల్పిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే గనుక చాలా మంది ఎన్ఎస్జీ సిబ్బందిని వదలుకోవాల్సి ఉంటుంది’ అని ఓ ఉన్నత అధికారి వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యే నేతలకు ముందుగా ఈ నిర్ణయం అమలు చేయబోతున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే సీనియర్ నేత కరుణానిధిలతోపాటు బీజేపీకి చెందిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌లకు భద్రతా సిబ్బందిలో కొత పడే ఆస్కారం కనిపిస్తోంది. ప్రస్తుతం వీరందరికి జ ఫ్లస్ సెక్యూరిటీ కింద 50 మందిని కేటాయించగా, వాళ్లు బయటకు వెళ్లే సమయాలల్లో 35 నుంచి 40 మంది ఎప్పుడూ వెంట ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్య కేవలం 26గా మాత్రమే ఉండేది. అయితే భద్రతా సిబ్బందిని తగ్గించటం.. పెంచటం అనే వ్యవహారంపై పూర్తిగా రాజకీయ స్థితిగతుల మీదే ఆధారపడి ఉంటుందని ఓ అధికారి వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు.. అస్సాం సీఎంగా తరుణ్ గొగోయ్ ఉన్న సమయంలో బ్లాక్ క్యాట్ కమాండోలను ఉపసంహరించుకుంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సర్బనందా సోనోవల్ బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వెంటనే తిరిగి అదే సెక్యురిటీని కేటాయించింది. ఇదే విషయాన్ని ఆ అధికారి ప్రస్తావించారు. గతంలో తమ సిబ్బందిపై నేతలు దురుసుగా వ్యవహరించిన దాఖలాలు కూడా అనేకం ఉన్నాయని ఆయన అంటున్నారు. నేతలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఎక్స్ నుంచి జెడ్ కేటగిరిగా విభజించి వారికి భద్రతా సిబ్బందిని నియమిస్తుంటారు. వై కేటగిరీల్లో ఉన్నవారికి 11 మంది సిబ్బందిని, జెడ్ కేటగిరీల్లో ఉన్న వారికి 30 మంది సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. బాబా రాందేవ్, మాతా అమృతానందమయి, మహంత్ నృత్యగోపాల్ దాస్, సాక్షి మహరాజ్, ముకేష్ అంబానీ-సతీమణి నీతా అంబాని ప్రస్తుతం వీఐపీ ట్రీట్ మెంట్ అందుకుంటుండగా.. ఉత్తర ప్రదేశ్ నుంచే ఎక్కువ మంది ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. -
తమిళనాట ఉద్రిక్తత: శబరిమలకు స్పెషల్ సెక్యురిటీ
తిరువనంతపురం : అమ్మ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తల నేపథ్యంలో తమిళనాట పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి. అమ్మ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ తమిళనాడు నుంచి భక్తులు శబరిమలకు పోటెత్తుతున్నారు. దీంతో శబరిమల ఆలయంలో భద్రతను ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కొబ్బరికాయలు సమర్పించే ప్రాంతంలో కూడా అదనపు చర్యలను ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు తీసుకుంది. ఆజ్జి ప్రాంతంలో పోలీసులు కాపలా కాస్తున్నారు. జయలలిత ఆరోగ్యం క్షీణించిందనే ప్రకటనల నేపథ్యంలో తమిళనాడు నుంచి భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, అమ్మ త్వరగా కోలుకోవాలని పూజలు చేయిస్తున్నట్టు బోర్డు పేర్కొంది. జయలలిత కోరుకోవాలని ఆకాంక్షిస్తూ ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు కూడా నేడు అన్నదానం నిర్వహించింది. మంగళవారం బాబ్రీ మసీదు డేతో పాటు, అమ్మ పరిస్థితి విషమంగా మారుతుందనే ప్రకటనల నేపథ్యంలో శబరిమలకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్పెషల్ టీమ్‌ను రంగంలోకి దించారు. అదేవిధంగా ఆలయానికి సమీప ప్రాంతంలో 360 కేజీల గన్‌పౌడర్ పట్టుబడటంతో శబరిమల అడవి ప్రాంతంలో సెక్యురిటీని ఆ రాష్ట్ర పోలీసులు పెంచారు. 30 మంది సభ్యుల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అటవీ ప్రాంతాన్నంతటిన్నీ జల్లెడ పడుతుంది. ఈ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌కు బాంబ్ స్కాడ్, ఫారెస్ట్, ఫైర్, రెస్క్యూ, పోలీసులు టీమ్‌లు చేపడుతున్నారు. -
GHMC ఎన్నికలకు 46వేల మంది ప్రత్యేక సిబ్బంది
-
ప్రియాంక కుటుంబానికి కొనసాగనున్న ప్రత్యేక భద్రత
న్యూఢిల్లీ: ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా, పిల్లలకు విమానాశ్రయాల వద్ద తనిఖీల నుంచి కల్పిస్తున్న మినహాయింపును కొనసాగించాలని కేంద్రంలోని ఏన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు విమానాశ్రయాల వద్ద ప్రత్యేక భద్రతను నిరాకరించే అవకాశం ఉందంటూ పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు పరోక్షంగా సంకేతాలివ్వడం, తర్వాత రోజు ప్రభుత్వానికి ప్రియాంక లేఖ రాసిన సంగతి తెలిసిందే. భద్రత ఉపసంహరణ అనేది ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ఆధారంగా జరుగుతుందని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) వర్గాలు తెలిపాయి. కొన్ని నిబంధనల మేరకు ప్రియాంక కుటుంబానికి ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంలో మార్పులు చేయాలని కోరుకోవడం లేదని ఎస్పీజీ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రియాంక కుటుంబానికి కల్పిస్తున్న ప్రత్యేక భద్రతపై సమీక్షించే ఉద్దేశం లేదని వెల్లడించారు. -
ఇసుక రవాణాకు,,, ప్రత్యేక సెక్యూరిటీ పర్మిట్
మంత్రి టీబీ జయచంద్ర రోబో ఇసుక వాడకం తప్పనిసరి ఆన్లైన్లో ఇసుక విక్రయాల యోచన మైసూరు జిల్లాలో త్వరలో పెలైట్ ప్రాజెక్ట్ ప్రారంభం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించడంతో పాటు నకిలీ పర్మిట్లను అరికట్టేందుకు ఈ నెల ఒకటో తేది నుంచి కొత్త ప్రత్యేక భద్రతా పర్మిట్ పేపర్‌ను ప్రవేశ పెట్టినట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర వెల్లడించారు. ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్పతో కలసి శుక్రవారం సాయంత్రం విధాన సౌధలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇక మీదట ఎం-ఇసుక(మాన్యుఫ్యాక్చర్డ్ (తయారీ) ఇసుక) వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. దీనినే రోబో ఇసుక అని కూడా వ్యవహరిస్తారని చెప్పారు. స్టోన్ క్రషర్లలో తయారయ్యే ఈ ఇసుక వినియోగం ద్వారా పర్యావరణానికి కొంత మేర నష్టం వాటిల్లకుండా చూడవచ్చని చెప్పారు. కాగా ఇసుక ఏయే ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నదీ ఆన్లైన్లో తెలుసుకోవడానికి నర్మద ఫర్జిలైజర్ కంపెనీతో కలసి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పరచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వందల నుంచి ఏడు వందలస్టోన్ క్రషర్లు చట్ట పరిధిలో పని చేస్తున్నాయని తెలిపారు. నదుల్లో ఇసుక తవ్వకాలను సమతుల్య పరచే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇంకా స్టోన్ క్రషింగ్‌కు అవకాశమున్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం నిర్మాణ రంగానికి పది నుంచి 15 శాతం రోబో ఇసుక లభిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు విధిగా రోబో ఇసుకను వాడాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఏటా రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం కాగా 90 లక్షల టన్నుల నది ఇసుక మాత్రమే లభ్యమవుతోందని చెప్పారు. కాగా ఆన్లైన్లో ఇసుక విక్రయాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వారు వెల్లడించారు. గనులు, భూగర్భ వనరుల శాఖ వెబ్సైట్లో ఎక్కడెక్కడ ఇసుక అందుబాటులో ఉన్నదీ తెలుసుకోవచ్చన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఇసుక రేటును నిర్ణయిస్తారని, ప్రతి జిల్లాలో కంట్రోల్ పాయింట్ల నుంచి ఇసుకను పొందవచ్చని వివరించారు. త్వరలో మైసూరు జిల్లాలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో రెండు నెలల్లో 201 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 117 చెక్‌పోస్టులతో సహా సీసీటీవీ కెమెరాలను నెలకొల్పనున్నట్లు వారు వెల్లడించారు.


