రాహుల్ గాంధీకి చుక్కెదురు | supreme court rejects to probe sahara birla diaries case against narendra modi | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీకి చుక్కెదురు

Jan 11 2017 5:02 PM | Updated on Sep 2 2018 5:28 PM

రాహుల్ గాంధీకి చుక్కెదురు - Sakshi

రాహుల్ గాంధీకి చుక్కెదురు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన ఆరోపణలు తేలిపోయాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన ఆరోపణలు తేలిపోయాయి. వాటికి సంబంధించి దాఖలైన ఒక పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాము నాటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్రమోదీకి లంచాలు ఇచ్చామంటూ సహారా - బిర్లా డైరీలలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ 'భూకంపం' పుట్టిస్తానని కూడా రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే.
 
అయితే, అదే విషయమై.. అవే ఆధారాలను ప్రస్తావిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానమంత్రి సహా ఆ డైరీలలో పేర్లున్నవారిపై విచారణ జరిపించాలని ఆయన ఆ పిటిషన్‌లో కోరారు. అయితే, ఇలాంటి పత్రాలను కూడా చట్టపరమైన ఆధారాలుగా భావిస్తే, చట్టాన్ని కూడా దుర్వినియోగం చేసినట్లవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement