హిందూ సంఘం ప్రారంభించిన స్వామి | Subramanian Swamy launches Hindutva outfit | Sakshi
Sakshi News home page

హిందూ సంఘం ప్రారంభించిన స్వామి

Apr 8 2015 6:18 PM | Updated on Sep 3 2017 12:02 AM

హిందూ సంఘం ప్రారంభించిన స్వామి

హిందూ సంఘం ప్రారంభించిన స్వామి

బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి 'విరాట్ హిందూస్థాన్ సంఘం' పేరుతో హిందూత్వ సంస్థ ప్రారంభించారు.

న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి 'విరాట్ హిందూస్థాన్ సంఘం' పేరుతో  హిందూత్వ సంస్థ ప్రారంభించారు. హిందువుల ప్రయోజనాల కోసం తమ సంస్థ పనిచేస్తుందని ఢిల్లీలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370, యూనియన్ సివిల్ కోడ్, బీఫ్ బ్యాన్ పై ప్రధానంగా పోరాడతామని చెప్పారు.
ఇందుకోసం కేంద్రంలోని అధికార బీజేపీపై ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు.

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రామమందిరం నిర్మాణం అంశం చేపడతామన్నారు. 2016 చివరి నాటికి మందిర నిర్మాణం పూర్తిచేయాలన్న ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. హిందూమతం కోసం పనిచేసే యువత సాధికారతకు తమ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement