breaking news
Virat Hindustan Sangam
-
సుబ్రహ్మణ్యస్వామి సంచలన ప్రతిపాదన
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరో సంచలన ప్రతిపాదనను తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న గోశాలలకు ఫండింగ్ కోసం పెట్రోల్ పై సెస్ విధించాలని ప్రతిపాదించారు. గో రక్షణ పేరుతో విరాట్ హిందూస్తాన్ సంఘం ఆదివారం నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ లో స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. '' 1962లో భారత్ పై చైనా అటాక్ చేసినప్పుడు, రక్షణ నిధి కోసం ఓ అప్పీల్ తీసుకొచ్చాం. ప్రస్తుతం దేశం ఇదే పరిస్థితుల్లో ఉంది. గోశాలల కోసం పెట్రోల్ పై 1 రూపాయి సెస్ ను అడిగితే, దేశం ద్రవ్యంతో నిండిపోతుంది'' అని స్వామి అన్నారు. హిందూవులు, ముస్లింలు అన్ని మతాల వారికి ఈ గోరక్షణ సెస్ అప్లయ్ అవుతుందని పేర్కొన్నారు. గోరక్షకులు మంచి సర్వీసులు అందిస్తున్నారని, వారికి కచ్చితంగా మనం సర్టిఫికేషన్ ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ అన్నారు. గోవుల కోసం అభయారణ్యం ఏర్పాటుచేయాలని ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న హోం వ్యవహారాల సహాయ మంత్రి హన్సురాజ్ అహిర్ ప్రతిపాదించారు. గోవుల అభయారణ్యం కోసం 7 కోట్ల ఎకరాల అడవుల భూమిని కేటాయించాలని తాను ప్రతిపాదిస్తున్నానని, టైగర్ అభయారణ్యం మాదిరి దీన్ని ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వాన్ని ప్రజలు కోరాలని చెప్పారు. అంతేకాక గోవుల రక్షణ కోసం పాఠశాల పాఠ్య ప్రణాళికలో కచ్చితంగా చాప్టర్స్ ను ప్రవేశపెట్టాలని ఉర్జా వరల్డ్ ఫౌండేషన్ స్వామి అరిహంత్ అన్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన గోవుల అమ్మకాల చట్టంపై స్పందించిన స్వామి, ప్రజలు ఏం తినాలనుకుంటున్నారో వారి హక్కులను ఈ చట్టం ఉల్లంఘించడం లేదని ఉద్ఘాటించారు. -
హిందూ సంఘం ప్రారంభించిన స్వామి
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి 'విరాట్ హిందూస్థాన్ సంఘం' పేరుతో హిందూత్వ సంస్థ ప్రారంభించారు. హిందువుల ప్రయోజనాల కోసం తమ సంస్థ పనిచేస్తుందని ఢిల్లీలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370, యూనియన్ సివిల్ కోడ్, బీఫ్ బ్యాన్ పై ప్రధానంగా పోరాడతామని చెప్పారు. ఇందుకోసం కేంద్రంలోని అధికార బీజేపీపై ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రామమందిరం నిర్మాణం అంశం చేపడతామన్నారు. 2016 చివరి నాటికి మందిర నిర్మాణం పూర్తిచేయాలన్న ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. హిందూమతం కోసం పనిచేసే యువత సాధికారతకు తమ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు.