రెండో తరగతి విద్యార్థితో మలం ఎత్తించి ఓ టీచర్ దాష్టీకాన్ని ప్రదర్శించింది. తమిళనాడు నామక్కల్ సమీప రామాపురం పుదూర్
♦ టీచర్ సస్పెన్షన్, అరెస్ట్
♦ తమిళనాడులో ఘటన
సేలం: రెండో తరగతి విద్యార్థితో మలం ఎత్తించి ఓ టీచర్ దాష్టీకాన్ని ప్రదర్శించింది. తమిళనాడు నామక్కల్ సమీప రామాపురం పుదూర్ మాధ్యమిక పాఠశాలలో దళితుడు వీరకుమార్ కుమారుడు శశిధరన్(7) రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో ఓ విద్యార్థి మల విసర్జన చేశాడు.దాన్ని తొలగించాలని టీచర్ విజయలక్ష్మి(35) శశిధరన్‌ను ఆదేశించింది. వినకపోవడంతో చితక బాదింది. తాళలేని శశిధరన్ తన చేతులతో మలాన్ని ఎత్తి బయటపడేశాడు. ఈ సమయంలో సహ విద్యార్థులు అవహేళన చేయడంతో చిన్నారి మానసికంగా కుంగిపోయాడు. తండ్రి వీరకుమార్‌కు వివరించాడు.
అతను దళిత సంఘాల దృష్టికి తీసుకెళ్లాడు. శుక్రవారం ఆందోళనకు దిగారు. వీరకుమార్ ఫిర్యాదు మేరకు ఎస్పీ సెంథిల్‌కుమార్, ఆర్‌డీవో కన్నన్ విచారణ జరిపారు. టీచర్ దాష్టీకం నిజమేనని తేల్చారు.అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.