విడాకులు: కోర్టుకు హాజరైన హీరో కూతురు! | Soundarya appears in court for divorce | Sakshi
Sakshi News home page

విడాకులు: కోర్టుకు హాజరైన హీరో కూతురు!

Jun 23 2017 2:42 PM | Updated on Sep 5 2017 2:18 PM

విడాకులు: కోర్టుకు హాజరైన హీరో కూతురు!

విడాకులు: కోర్టుకు హాజరైన హీరో కూతురు!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతురు సౌందర్య తన భర్తతో విడిపోవడానికి సిద్ధమైంది.

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతురు సౌందర్య తన భర్తతో విడిపోవడానికి సిద్ధమైంది. భర్త అశ్విన్‌ రాంకుమార్‌ నుంచి ఆమె విడాకులు  తీసుకుబోతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ఆమె చెన్నైలోని కుటుంబ న్యాయస్థానానికి హాజరైంది. సౌందర్య 2010లో అశ్విన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు వేద్‌ అనే కొడుకు ఉన్నాడు. విభేదాల కారణంగా గత ఏడాది విడిపోవాలని దంపతులిద్దరూ  నిర్ణయించుకున్నారు.

వీరి విడాకుల కేసు విచారణను కుటుంబ న్యాయస్థానం శుక్రవారం విచారించింది. ఈ విచారణ సజావుగా జరిగిందని, దంపతులిద్దరూ ఉమ్మడి సమ్మతితో విడిపోతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వచ్చే విచారణలోపు దంపతులిద్దరూ విడిపోవడానికి గల కారణాలు సవివరంగా తెలుపుతూ, ఉమ్మడి అంగీకారంతో కూడిన జాయింట్‌ మెమోను దాఖలుచేయాలని కోర్టు సూచించింది. దంపతులిద్దరితో సంప్రదింపుల అనంతరం వారి మెమోతో సంతృప్తి చెందితే చట్టబద్ధంగా విడిపోయేందుకు కోర్టు విడాకులు మంజూరు చేయనుంది. ఈ ఉమ్మడి అంగీకార పత్రంలో భరణం వివరాలు, పిల్లాడి సంరక్షణ బాధ్యతలు తదితర అంశాలు ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement