పిక్నిక్ నిమిత్తం వెళ్లారు.. కానీ ! | six persons died in the van blast at karachi | Sakshi
Sakshi News home page

పిక్నిక్ నిమిత్తం వెళ్లారు.. కానీ !

Aug 13 2017 8:04 PM | Updated on Apr 3 2019 3:52 PM

పిక్నిక్ నిమిత్తం వెళ్లారు.. కానీ ! - Sakshi

పిక్నిక్ నిమిత్తం వెళ్లారు.. కానీ !

వ్యాన్లో ఉన్న సీఎన్జీ సిలిండర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు.

కరాచీ: వ్యాన్లో ఉన్న సీఎన్జీ సిలిండర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కరాచీలో ఆదివారం జరిగింది. కరాచీలోని గార్డెన్ ఏరియాకు చెందిన సలీం, మహమ్మద్ అలీలు కుటుంబంతో కలిసి హక్స్బే ప్రాంతానికి పిక్నిక్ నిమిత్తం వెళ్లారు.

వీరు వెళ్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాను వెనుక వైపు మంటలు చెలరేగి అకస్మాత్తుగా పేలింది. లోపల ఉన్నవారు బయటకు వచ్చేలోపే అగ్నికి ఆహుతి అయ్యారు. రెస్క్యూటీం హుటాహుటిన చేరుకుని నలుగురిని రక్షించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృత్యుల్లో ముగ్గురు మగవారు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement