స్కూల్ టీచర్ పై సెక్యూరిటీ గార్డు అత్యాచారం | Security guard rapes schoolteacher in jaipur | Sakshi
Sakshi News home page

స్కూల్ టీచర్ పై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

Jun 13 2014 11:01 PM | Updated on Jul 28 2018 8:51 PM

స్కూల్ టీచర్ పై సెక్యూరిటీ గార్డు అత్యాచారం - Sakshi

స్కూల్ టీచర్ పై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

మానవ మృగాల ఆకృత్యాలకు హద్దూ అదుపు లేకుండా పోతుంది. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా కామాంధుల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు.

జైపూర్:మానవ మృగాల ఆకృత్యాలకు హద్దూ అదుపు లేకుండా పోతుంది. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా కామాంధుల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ స్కూల్ టీచర్ పై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడిన ఘటన జైపూర్ లో కలకలం స్పష్టించింది. జాబ్ ప్లేస్ మెంట్ ద్వారా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నగుర్జార్..  అతనికి బాగా పరిచయం ఉన్న 22 ఏళ్ల యువతికి కాలేజీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. ఈ క్రమంలోనే ఆమెను కాలేజ్ యజమానికి పరిచయం చేస్తానని చెప్పి ఓ హోటల్ కు తీసువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.

 

ఈ ఘటనపై బాధితురాలు స్థానిక ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు గుర్జాను మల్వీయా నగర్ లో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement