మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా సింగ్లా | Sanjeev Kumar Singla appointed PS to PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా సింగ్లా

Jul 20 2014 8:39 PM | Updated on Aug 15 2018 2:37 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ సింగ్లా నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ సింగ్లా నియమితులయ్యారు. విక్రమ్ మిస్రీ స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. విక్రమ్ మిస్రీ- స్పెయిన్ లో భారత రాయబారిగా నియమితులయ్యారు. వీరి నియామకాలకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ(ఏసీసీ) ఆమోదముద్ర వేసింది.

1997 బ్యాచ్ కు చెందిన సింగ్లా- ఇజ్రాయిల్ లోని భారత దౌత్య కార్యాలయంలో పని చేసిన ఇక్కడకు వచ్చారు. అంతకుముందు విదేశాంగ మాజీ కార్యదర్శి రంజన్ మతాయ్ వద్ద డైరెక్టర్ గా పనిచేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement