నమ్మకమైన బ్రాండ్... శామ్‌సంగ్ | Samsung is India's most trusted brand followed by Sony, Tata | Sakshi
Sakshi News home page

నమ్మకమైన బ్రాండ్... శామ్‌సంగ్

Jan 30 2014 1:26 AM | Updated on Sep 2 2017 3:09 AM

నమ్మకమైన బ్రాండ్... శామ్‌సంగ్

నమ్మకమైన బ్రాండ్... శామ్‌సంగ్

భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన కంపెనీగా దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ నిలిచిందని బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ 2014 వెల్లడించింది.

న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన కంపెనీగా దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ నిలిచిందని బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ 2014 వెల్లడించింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (టీఆర్‌ఏ) సంస్థ గత నాలుగేళ్ల నుంచి ప్రతీ ఏటా వంద కంపెనీలతో ఈ జాబితాను రూపొందిస్తోంది.

 వివరాలు...
 అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లుగా  ఈ ఏడాది మొదటి మూడు స్థానాల్లో నిలిచిన శామ్‌సంగ్, సోనీ, టాటాలు గతేడాది జాబితాలో వరుసగా రెండు, మూడు, ఐదో స్థానాల్లో ఉన్నాయి.

  నాలుగో స్థానంలో మరో దక్షిణ కొరియా కంపెనీ ఎల్‌జీ నిలిచింది. ఐదో స్థానంలో నోకియా ఉంది.
 గత ఏడాది జాబితాలో 20వ స్థానంలో ఉన్న అమెరికాకు చెందిన హ్యులెట్-ప్యాకార్డ్ కంపెనీ ఈ ఏడాది  6వ స్థానంలోకి దూసుకువచ్చింది.

 గతేడాది 86వ స్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఈ ఏడాది 7వ స్థానం చేజిక్కించుకుంది.
 హోండా కంపెనీ 8వ స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో రిలయన్స్ (9), మహీంద్రా అండ్ మహీంద్రా(10వ స్థానం) ఉన్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement