ఏటీఎం వాహనం నుంచి రూ.15 లక్షలు చోరీ | Rs.15 lakh looted from cash van in Delhi | Sakshi
Sakshi News home page

ఏటీఎం వాహనం నుంచి రూ.15 లక్షలు చోరీ

Nov 7 2013 8:42 PM | Updated on Sep 2 2017 12:23 AM

నగరంలోని ఏటీఎంలకు నగదును తరలించే క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్(సీఎంఎస్) వాహనం నుంచి రూ.15 లక్షలను గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు.

న్యూఢిల్లీ: నగరంలోని ఏటీఎంలకు నగదును తరలించే క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్(సీఎంఎస్) వాహనం నుంచి రూ.15 లక్షలను గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం రవిదాస్ మార్గ్‌లో చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... నగదును తీసుకెళ్తున్న సీఎంఎస్ వాహనాన్ని హోండా సిటీ కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు.

 

అనంతరం మోటార్ సైకిళ్లపై వచ్చిన మరో ఇద్దరు వారితో జతకలిశారు. వాహనం నుంచి రూ.15 లక్షలను తీసుకొని అక్కడినుంచి కారులో పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement