ఎంపీ నన్ను పదే పదే తాకారు: శ్వేతామీనన్ | Repeatedly touched by MP, Shweta Menon said in statement to police | Sakshi
Sakshi News home page

ఎంపీ నన్ను పదే పదే తాకారు: శ్వేతామీనన్

Nov 7 2013 3:30 AM | Updated on Aug 21 2018 7:53 PM

ఎంపీ నన్ను పదే పదే తాకారు: శ్వేతామీనన్ - Sakshi

ఎంపీ నన్ను పదే పదే తాకారు: శ్వేతామీనన్

కాంగ్రెస్ ఎంపీ పీతాంబర కురుప్ తనను పదేపదే తాకారని మలయాళ నటి శ్వేతామీనన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నటి శ్వేతామీనన్
 కొల్లాం: కాంగ్రెస్ ఎంపీ పీతాంబర కురుప్ తనను పదేపదే తాకారని మలయాళ నటి శ్వేతామీనన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. పీతాంబర క్షమాపణలు చెప్పడంతో శ్వేతామీనన్ ఎంపీపై ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించిచడం తెలిసిందే. అయితే, కేసు నమోదు చేసినందున పోలీసులు చట్టప్రకారం శ్వేత నుంచి సేకరించిన వాంగ్మూలాన్ని కొల్లాం కోర్టుకు సమర్పించారు. మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు శ్వేత చెప్పిన వివరాలిలా ఉన్నాయి. గత శుక్రవారం కొల్లాంలో పడవపోటీల కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్వేత వెళ్లారు. కారులో నుంచి దిగిన వెంటనే పీతాంబర ఆమె చేయిని పట్టుకున్నారు. వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఆలోపు ఆమె చేయిని గట్టిగా పదే పదే తాకారు. చివరికి చేయి విడిచిపెడితే వేదికపైకి వెళతానని శ్వేత కోరిన తర్వాత గానీ పీతాంబర పట్టు విడువలేదు. అలాగే, తన భుజాన్ని కూడా అసభ్యకర రీతిలో ఎంపీ తాకారని శ్వేత చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement