నాలుగేళ్లలో ఈ ఘనత: కంపెనీ | redit for four years: company | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లలో ఈ ఘనత: కంపెనీ

Oct 3 2015 2:00 AM | Updated on Sep 3 2017 10:21 AM

నాలుగేళ్లలో ఈ ఘనత: కంపెనీ

నాలుగేళ్లలో ఈ ఘనత: కంపెనీ

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్‌యూవీ) మోడల్ ఎక్స్‌యూవీ500 వాహనాలు

అమ్మకాలు ః1.5 లక్షలు

 న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్‌యూవీ) మోడల్ ఎక్స్‌యూవీ500 వాహనాలు లక్షన్నర అమ్ముడయ్యాయి. 2011 సెప్టెంబర్‌లో ఎక్స్‌యూవీ500ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ లక్షన్నర విక్రయాలను(ఎగుమతులతో సహా) సాధించామని కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు.

ఈ ఎస్‌యూవీని పూర్తిగా చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ(ఎంఆర్‌వీ)లోనే అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ వాహనానికి ఆదరణ అంతకంతకూ పెరుగుతోందంటూ... మరిన్ని కొత్త ఫీచర్లతో న్యూ ఏజ్ ఎక్స్‌యూవీ500ను ఈ ఏడాది మేలో అందుబాటులోకి తెచ్చామని, ఈ కొత్త వేరియంట్‌కు మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement