కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విభజన బిల్లుపై రెండు ప్రాంతాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ బిల్లుపై స్పందించండి!
Feb 5 2014 12:56 PM | Updated on Aug 18 2018 4:13 PM
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విభజన బిల్లుపై రెండు ప్రాంతాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే విధంగా, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ను విభజించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని కూడా లెక్క చేయకుండా ఓట్లు, సీట్లే ప్రతిపాదికన ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి వేగంగా ముందుకుపోతోందని సీమాంధ్ర ప్రాంతంలో వాదన. మరోవైపు ప్రస్తుత బిల్లుకు పలు సవరణలు చేయాలని తెలంగాణ ప్రాంత నేతలు వాదనలు వినిపిస్తున్ననేపథ్యంలో తెలంగాణ బిల్లుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రమంత్రి చిదంబరం కూడా ఈ సమావేశాల్లో ఏ బిల్లు కూడా గట్టేక్కదన్న వ్యాఖ్యలు మరింత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల అనుమానాలను నివృత్తి చేయకుండా పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న తెలంగాణ బిల్లుపై మీ స్పందన తెలియ చేయండి.
Advertisement
Advertisement