సైనిక కుటుంబాలకు రాహుల్ పరామర్శ | Rahul Gandhi begins J&K visit | Sakshi
Sakshi News home page

సైనిక కుటుంబాలకు రాహుల్ పరామర్శ

Aug 26 2015 12:18 PM | Updated on Sep 3 2017 8:10 AM

భారత సరిహద్దు గ్రామాల్లో ఉగ్రావాదుల దాడులకు గురై ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు.

జమ్మూకాశ్మీర్: భారత సరిహద్దు గ్రామాల్లో ఉగ్రావాదుల దాడులకు గురై ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు. మూడు రోజులు జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా బుధవారం అక్కడికి వచ్చిన ఆయన వెంటనే హెలికాప్టర్ ద్వారా పూంచ్ జిల్లాలోని బాల్కోట్ ప్రాంతానికి వెళ్లారు.

ఈ జిల్లాలో పాక్ ఉగ్ర వాదుల దాడుల కారణంగా ఆరుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలను పరామర్శించడంతోపాటు సరిహద్దు వెంబడి ఉన్న గ్రామీణ ప్రజలను పరామర్శించి వారి పరిస్థితులు తెలుసుకునేందుకు రాహుల్ పర్యటన ప్రారంభమైంది. లడఖ్ ప్రాంతాన్ని కూడా రాహుల్ త్వరలో సందర్శించనున్నారు. ఈ పర్యటనలో రాహుల్ వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గులాం అహ్మద్ మిర్ ఇతర సీనియర్ పార్టీ నేతలు కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement