దేశంలోనే పొడవైన సొరంగమార్గం | Prime Minister Narendra Modi to inaugurate India's longest road tunnel in J&K | Sakshi
Sakshi News home page

దేశంలోనే పొడవైన సొరంగమార్గం

Mar 22 2017 10:46 PM | Updated on Aug 24 2018 2:20 PM

దేశంలోనే పొడవైన సొరంగమార్గం - Sakshi

దేశంలోనే పొడవైన సొరంగమార్గం

భారత దేశంలోనే అతిపొడవైన సొరంగమార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

జమ్ము: భారత దేశంలోనే అతిపొడవైన సొరంగమార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం  చేయనున్నారు. జమ్ము–శ్రీనగర్‌ జాతీయ రహదారిపై నిర్మించిన ‘చెనానీ–నాశ్రీ’  సొరంగ మార్గాన్ని ఏప్రిల్‌ 2న  ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఈ రహదారి ద్వారా జమ్ము–శ్రీనగర్‌ల మధ్య దాదాపు 30 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ సొరంగమార్గాన్ని నేషనల్‌ హైవే అథారిటి ఆఫ్‌ ఇండియా నిర్మించింది. దీని నిర్మాణం 2011 మే 23 ప్రారంభమైంది.

286 కిలోమీటర్లమేర నాలుగు లేన్లుగా నిర్మించిన ఈ రహదారిపై 9.2 కిలోమీటర్ల సొరంగమార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.3,720 కోట్లు ఖర్చు చేశారు. సముద్రమట్టానికి 1200 మీటర్ల ఎత్తులో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించడం మరో విశేషం. ఇక ఈ మార్గంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమీకృత నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సొరంగమార్గంలో ఏదైనా ప్రమాదం జరిగి, వాహనానికి మంటలు అంటుకుంటే వాటికవే స్పందించి వెంటనే ఆర్పివేసే యంత్రాలను సిద్ధంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement