దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమవుతున్న ‘అసహనం’ అంశంపై ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు
పార్లమెంటులో నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమవుతున్న ‘అసహనం’ అంశంపై ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాలసమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ‘అసహనం’ అంశంపై చర్చించేందుకు ఇప్పటికే 193వ నిబంధన కింద నోటీసు ఇచ్చామని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
కాంగ్రెస్ కలిసొస్తుందనే ఆశాభావం!
జీఎస్టీ బిల్లుపై సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ, సుష్మా స్వరాజ్, మనోహర్ పరీకర్ వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ఈ బిల్లు ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కీలక సంస్కరణలకు సంబంధించిన జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ కలసి వస్తుందని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.