సింధు అద్భుతంగా ఆడింది: ప్రధాని మోదీ | PM Modi congratulated P V Sindhu | Sakshi
Sakshi News home page

సింధు అద్భుతంగా ఆడింది: ప్రధాని మోదీ

Nov 20 2016 7:50 PM | Updated on Aug 15 2018 6:32 PM

సింధు అద్భుతంగా ఆడింది: ప్రధాని మోదీ - Sakshi

సింధు అద్భుతంగా ఆడింది: ప్రధాని మోదీ

కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్ను సాధించిన తెలుగమ్మాయి, స్టార్ షట్లర్ పివి సింధును ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు.

న్యూఢిల్లీ: కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్ను సాధించిన తెలుగమ్మాయి, స్టార్ షట్లర్ పివి సింధును ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. చైనా ఓపెన్‌ సిరీస్‌లో సింధు అద్భుతంగా ఆడిందంటూ ట్విట్టర్‌లో కితాబిచ్చారు. ఆదివారం జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో సింధు 21-11, 17-21, 21-11  తేడాతో సున్ యు (చైనా)పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

రియో ఒలింపిక్స్‌లో అద్భుతంగా ఆడి దేశానికి రజత పతకం అందించిన సింధు చైనా ఓపెన్‌ సిరీస్‌లోనూ దూకుడు ఆడి తన సత్తా చాటింది. కెరీర్‌లో తొలి  ప్రదర్శించిన సింధు సూపర్ సిరీస్ టైటిల్ను సాధించిన సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెను అభినందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement