శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్‌! | panneerselvam comment on governer meeting | Sakshi
Sakshi News home page

శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్‌!

Feb 9 2017 5:44 PM | Updated on Sep 5 2017 3:18 AM

శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్‌!

శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్‌!

గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌తో భేటీ అయిన అనంతరం తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌ సెల్వం మీడియాతో మాట్లాడారు.

చెన్నై: గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌తో భేటీ అయిన అనంతరం తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌ సెల్వం మీడియాతో మాట్లాడారు. నవ్వుతూ కనిపించిన ఆయన ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని మరోసారి చెప్పారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని, శశికళ ఒత్తిడి చేయడం వల్లే పదవికి రాజీనామా చేశానని ఆయన మీడియాకు చెప్పారు. తనకు అండగా నిలబడిన ఎమ్మెల్యేలకు పన్నీర్‌ సెల్వం కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే శుభవార్త చెప్తానంటూ ఆయన విలేకరుల సమావేశాన్ని ముగించారు.

మద్దతుదారులైన నేతలు, కార్యకర్తల మధ్య పన్నీర్‌  ఈ సందర్భంగా నవ్వుతూ కనిపించారు. ఆయన నవ్వుతూ కళకళలాడటంతో అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. అయితే, పన్నీర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది? ఆయనకు గవర్నర్‌ మరో అవకాశం ఇస్తారా? లేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement