మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన | Pakistan violates ceasefire again | Sakshi
Sakshi News home page

మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన

Sep 10 2013 11:39 AM | Updated on Sep 1 2017 10:36 PM

జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద గత అర్థరాత్రి పాకిస్థాన్ దళాలు అఖ్నర్ సెక్టర్పై కాల్పులకు తెగబడింది.

పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద సోమవారం అర్థరాత్రి పాకిస్థాన్ దళాలు అఖ్నర్ సెక్టర్పై కాల్పులకు తెగబడిందని ఆర్మీ ప్రతినిధి  కెప్టెన్ ఎస్.ఎన్.ఆచార్య మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అందుకు ప్రతిగా తమ భద్రత దళాలు కూడా అదే స్థాయిలో కాల్పులు జరిపిందని ఆయన పేర్కొన్నారు.

 

ఇంకా ఇరు వైపుల కాల్పులు ప్రక్రియ  కొనసాగుతోందని అన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి నియంత్రణ రేఖ వద్ద పాక్ భద్రత దళాలు వరుసగా కాల్పులు జరుపుతూ భారత్, పాక్ దేశాలు గతంలో  చేసుకున్న ఒప్పందాలను అతిక్రమిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement