పద్మావతికి భర్త దొరికాడు! | Padmavati, Shahid Kapoor to play Deepika Padukone husband? | Sakshi
Sakshi News home page

పద్మావతికి భర్త దొరికాడు!

Jul 20 2016 6:25 PM | Updated on Sep 4 2017 5:29 AM

పద్మావతికి భర్త దొరికాడు!

పద్మావతికి భర్త దొరికాడు!

దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించనున్న తాజా చిత్రం 'పద్మావతి' చుట్టూ అనేక వదంతులూ వస్తూనే ఉన్నాయి.

దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించనున్న తాజా చిత్రం 'పద్మావతి' చుట్టూ అనేక వదంతులూ వస్తూనే ఉన్నాయి. నిజజీవిత ప్రేమపక్షులైన దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ సినిమాలో 'పద్మావతి' భర్త పాత్ర అత్యంత కీలకమైనది. మేవాడ రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా చారిత్రక ఇతివృత్తంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందనుంది.

ఈ సినిమాలో కీలకమైన పద్మావతి భర్త పాత్ర చుట్టూ అనేక ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పద్మావతి భర్త రాజా రావల్ రతన్‌సింగ్‌ పాత్రలో మొదట 'మసాన్' నటుడు విక్కీ కౌశల్‌ను తీసుకుంటారని వినిపించింది. అయితే, ఆయనకు దీపిక పదుకొనే నో చెప్పారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పద్మావతి భర్త పాత్రకు కొత్త పేరు తెరపైకి వచ్చింది.

పద్మావతి భర్తగా దీపిక సరసన షాహిద్ కపూర్ నటించనున్నారని సమాచారం. రాజా రావల్ రతన్‌సింగ్‌ పాత్రకు షాహిద్ సరిగ్గా సరిపోతారని దర్శకుడు బన్సాలీ భావించినట్టు బాలీవుడ్ వర్గాలు కథనం. తొలిసారి బన్సాలీ సినిమాలో నటించే అవకాశం రావడంతో షాహిద్ కూడా ఎగిరి గంతేసి ఈ ఆఫర్ ను ఒప్పుకున్నట్టు చెప్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. దర్శకుడు బన్సాలీ అధికారికంగా ప్రకటిస్తేగానీ పద్మావతి భర్త పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది కచ్చితంగా తెలిసే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement