'ఆయన తిట్టడంలో తప్పేమీ లేదు' | Nothing Wrong in Mulayam Scolding IPS Officer, Says Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

'ఆయన తిట్టడంలో తప్పేమీ లేదు'

Jul 14 2015 9:02 AM | Updated on Sep 3 2017 5:29 AM

'ఆయన తిట్టడంలో తప్పేమీ లేదు'

'ఆయన తిట్టడంలో తప్పేమీ లేదు'

ఐపీఎస్ అధికారిపై నోరుపారేసుకున్న తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ వెనకేసుకొచ్చారు.

లక్నో: ఐపీఎస్ అధికారిపై నోరుపారేసుకున్న తన తండ్రి ములాయం సింగ్  యాదవ్ ను ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ వెనకేసుకొచ్చారు. తన తండ్రి చేసినదాంట్లో తప్పేంలేదని అన్నారు. 'ముఖ్యమంత్రిని అయిన నన్నే ములాయం సింగ్ యాదవ్ తిడుతుంటారు. అలాంటి ఆయన అధికారిని తిట్టడంలో తప్పేంలేద'ని అఖిలేశ్ వెనకేసుకొచ్చారు.

75 ఏళ్ల ములాయం పలుమార్లు బహిరంగంగానే తన కుమారుడిని విమర్శించారు.  తాజాగా ఆయన ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ పై నోరుపారేసుకున్నారు. అయితే తనను తిట్టే అధికారం ములాయంకు లేదని, ఆయనేమీ ముఖ్యమంత్రి కాదని థాకూర్ అన్నారు. అధికారిపై తిట్లదండం అందుకున్న ములాయంకు సమాజ్ వాదీ పార్టీ బాసటగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement