సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్పై మావోల మెరుపుదాడి | Naxals Attack CRPF Camp In Chhattisgarh | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్పై మావోల మెరుపుదాడి

Nov 13 2013 1:34 PM | Updated on Sep 2 2017 12:34 AM

చత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుకుమా జిల్లా తమెళ్వాడలోని సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్పై మావోయిస్టులు బుధవారం మెరుపు దాడి చేశారు.

ఖమ్మం : చత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుకుమా జిల్లా తమెళ్వాడలోని సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్పై మావోయిస్టులు  బుధవారం మెరుపు దాడి చేశారు. మావోయిస్టులకు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు మావోయిస్టుల దాడిని భద్రతా దళాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి.

కాగా ఛత్తీస్గఢ్లో తొలి విడిత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఊపిరి పీల్చుకున్న భద్రతా దళాలపై మావోలు దాడికి పాల్పడుతున్నారు. సుక్మా జిల్లాలో ఎన్నికల విధులు ముగించుకుని తిరిగి వస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు పేల్చి మందుపాతరలో  ఇద్దరు జవాన్లు, ఓ వాహన డ్రైవర్ మృతి చెందారు.
 

Advertisement
 
Advertisement
Advertisement