ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ప్రధాని తడబాటు | Manmohan Singh, Sonia Gandhi pay tribute to Indira Gandhi | Sakshi
Sakshi News home page

ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ప్రధాని తడబాటు

Nov 19 2013 9:41 AM | Updated on Sep 2 2017 12:46 AM

ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ప్రధాని తడబాటు

ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ప్రధాని తడబాటు

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె సమాధిని సందర్శించే సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తడబడ్డారు.

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె సమాధిని సందర్శించే సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తడబడ్డారు. ఇందిర సమాధి వైపు కాకుండా వెనక్కి తిరిగి దండం పెట్టారు. ఆ తర్వాత నాలిక్కరుచుకుని తిరిగి సమాధి వైపు తిరిగి నమస్కారం చేశారు. ఈ దృశ్యం కెమెరాలో చిక్కింది.

 కాగా ఇందిరా గాంధీ 96వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆమె సమాధి శక్తిస్థల్ వద్ద నేతలు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమిద్‌ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. జయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement