రెండో రోజు కృష్ణ కీర్తన్ ను విచారించిన ఏసీబీ | krishna kirthan quizzing 2nd day by ACB | Sakshi
Sakshi News home page

రెండో రోజు కృష్ణ కీర్తన్ ను విచారించిన ఏసీబీ

Jul 16 2015 5:44 PM | Updated on Aug 17 2018 12:56 PM

రెండో రోజు కృష్ణ కీర్తన్ ను విచారించిన ఏసీబీ - Sakshi

రెండో రోజు కృష్ణ కీర్తన్ ను విచారించిన ఏసీబీ

ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ను ఏసీబీ అధికారులు వరుసగా రెండో రోజూ విచారిస్తున్నారు.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ను ఏసీబీ అధికారులు వరుసగా రెండో రోజూ విచారిస్తున్నారు. గురువారం ఆయన ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఏసీబీ అధికారులు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30  కృష్ణను సుదీర్ఘంగా విచారించారు. కృష్ణకీర్తన్తో పాటు సెబాస్టియన్, ఉదయ సింహాలను కలిపి ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.

బుధవారం కూడా ఏసీబీ అధికారులు కృష్ణను విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్, ఉదయసింహ, సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డిలను ఏసీబీ ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement