ముగ్గురు మైనర్ బాలురు తమ టీచర్‌ను అతి కిరాతకంగా హత్య చేసి అనంతరం ఆమె మొబైల్ ఫోన్, కొంత డబ్బును దొంగిలించారు.
బీజింగ్: ముగ్గురు మైనర్ బాలురు తమ టీచర్‌ను అతి కిరాతకంగా హత్య చేసి అనంతరం ఆమె మొబైల్ ఫోన్, కొంత డబ్బును దొంగిలించారు. ఈ ఘటన చైనా హునాన్ ప్రావిన్స్‌లోని లియాన్‌కియో పట్టణంలో జరిగింది. ముగ్గురు మైనర్ విద్యార్థులు 52 ఏళ్ల టీచర్‌పై కర్రతో దాడి చేసి ఆపై గుడ్డలను ఆమె నోటిలో కుక్కి బాత్‌రూంలో పడేశారు. అనంతరం వారు మొబైల్ ఫోన్, 2000 యువాన్ నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు. అనంతరం వేరే పాఠశాలలో చదువుకుంటున్న ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరి బాలుర తల్లిదండ్రులు వలస కార్మికులు కావడంతో వీరిని లియాన్‌కియో పట్టణంలో ఏకోపాధ్యాయ పాఠశాలలో చేర్చితే వారు ఇంతటి ఘోరానికి పాల్పడ్డారు.