బంగారం షాపులు, ఫారెక్స్ కంపెనీలపై దాడులు | IT and ED launches raids on gold shops and farex companies | Sakshi
Sakshi News home page

బంగారం షాపులు, ఫారెక్స్ కంపెనీలపై దాడులు

Nov 11 2016 8:51 PM | Updated on Sep 27 2018 5:03 PM

బంగారం షాపులు, ఫారెక్స్ కంపెనీలపై దాడులు - Sakshi

బంగారం షాపులు, ఫారెక్స్ కంపెనీలపై దాడులు

పెద్ద నోట్లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అనంతరం నల్ల కుబేరులు వణికిపోతున్నారా?.

న్యూఢిల్లీ: పెద్ద నోట్లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అనంతరం నల్ల కుబేరులు వణికిపోతున్నారా?. తాజా పరిస్ధితులు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా పెద్దనోట్లను చలామణిలోకి తీసుకురావడానికి నల్ల కుబేరులు నానాతంటాలు పడుతున్నారు. బంగారం షాపులు, ఫారెక్స్ కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారనే సమాచారంతో వాటిపై ఐటీ, ఈడీలు దాడులకు పూనుకోవడంతో వారిలో మరింత కలవరం మొదలైంది.
 
బంగారం షాపుల నగదు లావాదేవీలను ఐటీ శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అంతేకాదు ఫారెక్స్ కంపెనీలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోని 67 ఫారెక్స్ కంపెనీలపై ఒకేసారి దాడులు చేసింది. కంపెనీలకు, బంగారు షాపులకు చెందిన అన్ని వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గత మూడు రోజుల్లో రూ.2.5లక్షలకు పైచిలుకు జరిగిన లావాదేవీల వివరాలను అందజేయాలని ఐటీ శాఖ ఇప్పటికే బ్యాంకులను కోరిన విషయం తెలిసిందే.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement