మక్కా తొక్కిసలాటలో హైదరాబాద్ మహిళ మృతి | Indian woman killed in Haj stampede | Sakshi
Sakshi News home page

మక్కా తొక్కిసలాటలో హైదరాబాద్ మహిళ మృతి

Sep 24 2015 6:41 PM | Updated on Mar 28 2018 11:11 AM

మక్కాలో గురువారం చోటుచేసుకున్న హజ్ యాత్రికుల తొక్కిసలాటలో హైదరాబాద్ మహిళ బీబీ జాన్ ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

హైదరాబాద్: మక్కాలో గురువారం చోటుచేసుకున్న హజ్ యాత్రికుల తొక్కిసలాటలో హైదరాబాద్ మహిళ బీబీ జాన్ ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బీబీ జాన్ రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్కు చెందిన మహిళ. ఆమె మరో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా మక్కాకు బయలుదేరి వెళ్లి దురదృష్టవశాత్తు మృత్యువాత పడింది.

రంగారెడ్డిజిల్లాకు చెందిన బీబీ జాన్ ప్రస్తుతం ఎల్బీ నగర్లో ఉంటోంది. మరోపక్క, తెలంగాణ ప్రాంతం నుంచి మక్కాకు వెళ్లిన తమ వారి వివరాలు తెలుసుకునేందుకు హజ్ కమిటీ ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. వివరాలు పొందగోరువారు 040-23214125కు ఫోన్ చేయవచ్చు. డిప్యూటీ ముఖ్యమంత్రి మహ్మద్ అలీ హజ్ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement