జీఎస్టీ విచారణల కోసం కాల్‌ సెంటర్లు | GST Call Centres to go live on June 25 to support taxpayers' transition | Sakshi
Sakshi News home page

జీఎస్టీ విచారణల కోసం కాల్‌ సెంటర్లు

Jun 23 2017 8:38 AM | Updated on Sep 5 2017 2:18 PM

జూలై 1 నుంచి అమలు కానున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై సందేహాల నివృత్తి కోసం రెండు కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

న్యూఢిల్లీ: జూలై 1 నుంచి అమలు కానున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై సందేహాల నివృత్తి కోసం రెండు కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల కోసం ఒక కాల్‌ సెంటర్, పన్నుల విభాగాల్లో పనిచేస్తున్న అధికారుల కోసం మరో కాల్‌ సెంటర్‌ను జూన్‌ 25 నుంచి అందుబాటులోకి తెస్తామని జీఎస్టీ అమలుకు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్న సంస్థ జీఎస్టీ నెట్‌వర్క్‌ వెల్లడించింది.

ఇందుకోసం టెక్‌ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రాల సహాయం తీసుకుంటున్నామంది. పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీలో నమోదు తదితర అంశాలపై ఏవైనా సందేహాలుంటే 0120–4888999 నంబరును సంప్రదించాలనీ, అలాగే అధికారులకు ఏవైనా సందేహాలుంటే 0124–4479900కు ఫోన్‌ చేయాలని జీఎస్టీఎన్‌ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement