ప్రధాని, హోంమంత్రితో గవర్నర్‌ భేటీ | Governor meet With Prime Minister and Home Minister | Sakshi
Sakshi News home page

ప్రధాని, హోంమంత్రితో గవర్నర్‌ భేటీ

May 19 2017 1:48 AM | Updated on Aug 24 2018 2:20 PM

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తన పదవీ కాలాన్ని పొడిగించిన నేపథ్యంలో ఇరువురితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన నరసింహన్‌ రెండు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను వారికి వివరించినట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుపై కేంద్ర హోంశాఖలో కదలిక వచ్చిన నేపథ్యంలో, ఈ విషయాన్ని గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement