కాంగ్రెస్ తరపున నిందితులకు టికెట్లిచ్చాం: తరుణ్ గొగోయ్ | Gogoi admits accused persons allowed to contest elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ తరపున నిందితులకు టికెట్లిచ్చాం: తరుణ్ గొగోయ్

Sep 28 2013 5:16 PM | Updated on Sep 1 2017 11:08 PM

క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్లు ఇచ్చామని ఆ పార్టీకి చెందిన అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు.

క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్లు ఇచ్చామని ఆ పార్టీకి చెందిన అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు. దోషులుగా తేలిన చట్టసభ సభ్యుల్నిరక్షించేందుకు ఆర్డినెన్స్ తేవడం అనాలోచిత నిర్ణయమన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఆయన సమర్థించారు.

నేరస్తులు ఎన్నికల్లో పోటి చేయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎలాంటి మార్గదర్శకాలనూ రూపొందించలేదని గొగోయ్ చెప్పారు. రాజకీయాల్ని పారదర్శకం ఉండాలని, రాహుల్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని గొగోయ్ అన్నారు. వివాదాస్పద ఆర్డినెన్స్ను తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement