'భార‌త్ టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోయింది' | Indian Test Cricket Died in Guwahati Team India Fans Enraged On Social Media | Sakshi
Sakshi News home page

ఇండియా టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోయింది.. ఫ్యాన్స్ ఫైర్‌

Nov 26 2025 1:59 PM | Updated on Nov 26 2025 2:16 PM

Indian Test Cricket Died in Guwahati Team India Fans Enraged On Social Media

''టీమిండియాను సొంత‌గ‌డ్డ‌పై ఓడించలేర‌ని ఒక‌ప్పుడు అంటుండేవారు. కానీ ఇప్పుడు ఏ జట్టు అయినా భారత్‌లో భారత్‌ను ఓడించగలదు'' అంటూ ఇండియా క్రికెట్ అభిమానులు సోష‌ల్ మీడియాలో నిర్వేదం వ్య‌క్తం చేస్తున్నారు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఘోరంగా ఓడిపోవ‌డంతో టీమిండియా ల‌వ‌ర్స్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. క‌నీస‌ పోరాట ప‌టిమ లేకుండా ప్ర‌త్య‌ర్థికి దాసోహ‌మ‌వ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు. మరీ ముఖ్యంగా సొంతగ‌డ్డ‌పై టీమిండియా భారీ ఓట‌మి అభిమానుల‌ను మరింత కుంగ‌దీసింది.

అన్ని విభాగాల్లో పైచేయి సాధించి టీమిండియాను సొంత గ‌డ్డ‌పై ఓడించిన ద‌క్షిణాఫ్రికాపై క్రీడాభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. పాతికేళ్ల త‌ర్వాత భార‌త గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ గెల‌వ‌డ‌మే కాకుండా, వైట్‌వాష్ చేయ‌డంతో సౌతాఫ్రికా కెప్టెన్ బ‌వుమాను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఈ విజ‌యానికి స‌ఫారీలు అన్నివిధాలా అర్హుల‌ని కితాబిస్తున్నారు. ఇక, భార‌త్ ఘోర వైఫ‌ల్యానికి హెచ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ ప్ర‌ధాన కార‌కుడ‌ని టీమిండియా ఫ్యాన్స్‌ నిందిస్తున్నారు. భార‌త‌ టెస్టు క్రికెట్‌ను నాశ‌నం చేశాడ‌ని ఫైర్ అవుతున్నారు.

నెటిజ‌నుల మండిపాటు
టీమిండియా (Team India) ఓటమిపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. గువాహ‌టిలో ఇండియ‌న్ టెస్టు క్రికెట్ ఈరోజు చ‌నిపోయిందంటూ ఘాటు కామెంట్లు పెడుతున్నారు. ఒక‌ప్పుడు సొంత గ‌డ్డ‌పై భార‌త జ‌ట్టుతో క్రికెట్ ఆడ‌టానికి ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు భ‌య‌ప‌డేవ‌ని, కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితులు తారుమారు అయ్యాయ‌ని వాపోతున్నారు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, ఛ‌తేశ్వ‌ర్ పుజారా, అశ్విన్ లాంటి ఆట‌గాళ్లు ఉన్న‌ప్పుడు టీమిండియాకు సొంత‌గ‌డ్డ‌పై ఓట‌మి అనేది ఊహ‌ల్లోకి కూడా వ‌చ్చేది కాద‌ని పేర్కొంటున్నారు. 

చ‌ద‌వండి: అందుకే ఓడిపోయాం.. ఓటమి నిరాశపరిచింద‌న్న‌ పంత్‌

సొంత గ‌డ్డ‌పై టీమిండియా చిత్తుగా ఓడిపోవ‌డంతో నెటిజ‌నులు మీమ్స్‌, సైట‌ర్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. వీడియోలు, కామెంట్ల‌తో పాటు గ‌ణాంకాల‌ను జ‌త చేసి టీమిండియా ఓట‌మిపై బాధను వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా ఓడిపోతారా అన్న‌ట్టుగా ఆవేద‌న వెలిబుచ్చుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement