సచిన్, కరీనా, దీపికా.. ఎవరూ మాకు అక్కర్లేదు | Goa says no to Sachin Tendulkar, Deepika Padukone, Kareena Kapoor | Sakshi
Sakshi News home page

సచిన్, కరీనా, దీపికా.. ఎవరూ మాకు అక్కర్లేదు

Sep 25 2013 4:36 PM | Updated on Sep 1 2017 11:02 PM

సచిన్ టెండూల్కర్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్.. వీళ్లంతా గోవాకు తాము బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటామంటూ క్యూలు కడుతున్నారు.

సచిన్ టెండూల్కర్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్.. వీళ్లంతా గోవాకు తాము బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటామంటూ క్యూలు కడుతున్నారు. కానీ, గోవా మాత్రం అసలు తమ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోడానికి వీళ్లెవరూ అక్కర్లేదని తెగేసి చెబుతోంది. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ విలేకరులతో చెప్పారు. గోవా దానంతట అదే ఓ పెద్ద సెలబ్రిటీ అని, ఇక ప్రచారం కోసం తారల వెంట పడాల్సిన అవసరం తమ రాష్ట్రానికి లేదని ఆయన అన్నారు.

మార్కెటింగ్ ఏజెన్సీల నుంచి తమకు ప్రతిపాదనలు వచ్చాయని, దీపికా పదుకొనే, సచిన్ టెండూల్కర్, కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ జంట.. వీళ్లంతా గోవాకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేందుకు సిద్ధపడ్డారని ఆయన తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఈ సెలబ్రిటీలు ఎవరితోనూ ఒప్పందాలు చేసుకునే ఆలోచన లేదని పరులేకర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు గోవాను భారత్లో తమ ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకుంటారని  ఆయన తెలిపారు. రెండేళ్ల క్రితం మాత్రం నటి ప్రాచీ దేశాయ్ని గోవా ఒకసారి బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement