రహస్య కెమెరాలతో ప్రియుడికి పరీక్ష పెట్టి..! | girl tests her boyfriend wether he cheats her | Sakshi
Sakshi News home page

రహస్య కెమెరాలతో ప్రియుడికి పరీక్ష పెట్టి..!

Oct 26 2016 10:18 AM | Updated on Sep 4 2017 6:23 PM

రహస్య కెమెరాలతో ప్రియుడికి పరీక్ష పెట్టి..!

రహస్య కెమెరాలతో ప్రియుడికి పరీక్ష పెట్టి..!

ఏ బంధానికైనా పునాది విశ్వాసమే. ముఖ్యంగా వైవాహిక, ప్రేమబంధాలు నిలబడాలంటే పరస్పర విశ్వాసమే అత్యంత కీలకం.

ఏ బంధానికైనా పునాది విశ్వాసమే. ముఖ్యంగా వైవాహిక, ప్రేమబంధాలు నిలబడాలంటే పరస్పర విశ్వాసమే అత్యంత కీలకం. కానీ ఓ అమ్మడు మాత్రం తన ప్రియుడిని అనుమానించింది. అతన్ని పరీక్షించాలనుకుంది. అంతే ఓ పోర్న్‌ నటిని పంపించి.. అతనికి శీలపరీక్ష పెట్టింది. ఓ పాశ్చాత్య దేశంలో ఈ ఘటన జరిగింది. 'ఏమోషనల్‌ అత్యాచార్‌' పేరిట మన దగ్గరి ఆ మధ్య ఓ రియాల్టీ షో వచ్చిన సంగతి తెలిసిందే. తమ భాగస్వామి మీద అనుమానం ఉన్నవారు ఈ షో ద్వారా రహస్య కెమెరాలతో శీలపరీక్షను చేసేవారు. అవకాశం వస్తే మోసం చేస్తాడా? లేక నిగ్రహంగా ఉంటాడా? అని పరీక్షించేవారు. పాశ్చాత్య దేశాల్లోనూ ఇలాంటి షోలు చాలా వచ్చాయి. కానీ, ఇప్పుడు యూట్యూబ్‌లో 'టు క్యాచ్‌ ఏ చీటర్‌' చానెల్‌ ఇలాంటి పరీక్షలు నిర్వహించి.. ఆ వీడియోలు పోస్టు చేస్తోంది.

తాజాగా ఓ అమ్మాయి ఈ చానెల్‌ను ఆశ్రయించింది. తన ప్రియుడు తనకు విధేయంగా ఉంటాడా? లేక మోసం చేస్తాడా? అన్నది తెలుసుకోవడానికి ఈ చానెల్‌ సాయంతో ఓ పోర్న్‌స్టార్‌ను అతని మీదకు ఉసిగొల్పింది. రహస్య కెమెరాలు చిత్రీకరిస్తుండగా.. ఆ వగలాడి అతన్ని బొల్తా కొట్టించడానికి ప్రయత్నించింది. వీధి మొత్తం తిరుగుతూ అతన్ని వెంటపడి.. విసుగెత్తించింది. అయినా అతను లొంగలేదు. ఆమె ఎంతగా మీదపడినా చెదరలేదు. దీంతో చాలా సంతోషపడిన అతని గర్ల్‌ఫ్రెండ్‌.. వెంటనే ఫోన్‌ చేసి అసలు విషయాన్ని చెప్పింది. తానే కావాలని ఈ పరీక్ష పెట్టినట్టు తెలిపింది. దీంతో అతనికి మతిపోయినంత పని అయింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫోన్‌ పెట్టేశాడు. దీంతో బాయ్‌ఫ్రెండ్‌ను పరీక్షించాలన్న తన తప్పుడు నిర్ణయానికి ఆమె ఇప్పుడు విచారిస్తోంది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో బాగా వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement