బాలకృష్ణ 'శాతకర్ణి'కి కలెక్షన్ల బొనంజా! | Gautamiputra Satakarni Box Office Collections | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ 'శాతకర్ణి'కి కలెక్షన్ల బొనంజా!

Jan 16 2017 10:05 PM | Updated on Aug 29 2018 1:59 PM

బాలకృష్ణ 'శాతకర్ణి'కి కలెక్షన్ల బొనంజా! - Sakshi

బాలకృష్ణ 'శాతకర్ణి'కి కలెక్షన్ల బొనంజా!

నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ ల్యాండ్‌ మార్క్‌ సినిమా..

నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ ల్యాండ్‌ మార్క్‌ సినిమా సంక్రాంతి బరిలో కలెక్షన్లతో దూసుకుపోతున్నది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఇప్పటికే తొలిరోజు రూ. 18 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇటు బాలకృష్ణ కెరీర్‌లోనూ, అటు దర్శకుడు క్రిష్‌ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా రికార్డు సాధించింది.

ఫెస్టివల్‌ సీజన్‌లో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్‌ భారీ వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లో రూ. 48 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం. తొలిరోజు దేశీయంగా రూ. 18 కోట్లు, ఓవర్సీస్‌ మార్కెట్‌లో రూ. 8 కోట్లు, రెండోరోజు దేశీయంగా రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌ రూ. 5 కోట్లు, మూడు రోజు దేశీయంగా రూ. 10 కోట్ల వరకు  వసూలు చేసినట్టు ట్రెడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి బాక్సాఫీస్‌ వద్ద సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతున్నట్టు సినీ పండితులు చెప్తున్నారు. 'శాతకర్ణి' సినిమా 'ఏ' సెంటర్లలో బాగా ఆడుతున్నప్పటికీ, బీ, సీ సెంటర్లలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నదని అంటున్నారు. అయితే, తెలుగు చక్రవర్తి శాతకర్ణి చారిత్రక కథతో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అటు బాలకృష్ణకు, ఇటు దర్శకుడు క్రిష్‌కు గర్వించే సినిమా అని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement